MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీహాన్ తో లవ్ షణ్ముఖ్ తో రొమాన్స్... అందరి ముందు తప్పు ఒప్పుకుని ఏడ్చేసిన సిరి!

శ్రీహాన్ తో లవ్ షణ్ముఖ్ తో రొమాన్స్... అందరి ముందు తప్పు ఒప్పుకుని ఏడ్చేసిన సిరి!

అందరి ముందు తప్పు చేశానని ఒప్పుకుంది సిరి. ఆ తప్పు నాకు తెలియకుండానే జరిగిందని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 09 2023, 10:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Siri

Siri

మనసు మాట వినడు అంటారు. ఎప్పుడు ఎవరి పట్ల ఆకర్షితులు అవుతామో చెప్పలేం. శ్రీహాన్ లవర్ సిరి అలాగే ఒక సడన్ రిలేషన్ ట్రాప్ లో చిక్కుకున్నారు.  బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న సిరి తోటి కంటెస్టెంట్ షణ్ముఖ్ తో రొమాన్స్ చేశారు. ముద్దులు, హగ్గులు, ప్రేమలు, కోపాలు, అలకలు... లవర్స్ మధ్య ఉండే అన్ని ఎమోషన్స్ చూపించారు. ఇద్దరూ చాలా పొసెసివ్ గా ఉండేవారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29


సిరి-షణ్ముఖ్ రొమాన్స్ ఆ సీజన్ కి హాట్ టాపిక్ అయ్యింది. సిరికి శ్రీహన్ లవర్ గా ఉన్నాడు. అదే సమయంలో షణ్ముఖ్ కి దీప్తి సునైన లవర్ గా ఉంది. దీంతో షో ముగిశాక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే సందేహాలు మొదలయ్యాయి. శ్రీహాన్ కాంప్రమైజ్ అయ్యాడు. సిరితో ఎప్పటిలాగే మెలిగాడు. తన ప్రేమ బంధం కొనసాగించారు. దీప్తి మాత్రం సహించలేదు. షణ్ముఖ్ కి గుడ్ బై చెప్పేసింది. 
 

39


షణ్ముఖ్-దీప్తిల బ్రేకప్ కి సిరినే కారణమన్న ప్రచారం జరిగింది. ఈ వార్తలను సిరి ఖండించారు. ఎట్టకేలకు తాను చేసిన తప్పును సిరి ఒప్పుకున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా స్టార్ మా లో లవర్స్ స్పెషల్ షో ఏర్పాటు చేశారు. ఈ షోకి సిరి, శ్రీహాన్ హాజరయ్యారు.శ్రీహాన్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు అతన్ని చాలా మిస్ అయ్యాను. గుర్తొచ్చినప్పుడలా ఈ షర్ట్ కి ముద్దులు పెట్టేదాన్నని చెప్పింది. 

49


శ్రీహాన్ కి పలు గిఫ్ట్స్ ఇచ్చి తన ప్రేమ చాటుకుంది. ఈ క్రమంలో సిరి ఎమోషనల్ అయ్యారు. తప్పులు ఎవరైనా చేస్తారు. కానీ అందరి ముందు ఒప్పుకోరు. నేను తప్పు చేశాను. అది నాకు తెలియకుండానే జరిగింది. అని సిరి కన్నీరు పెట్టుకుంది. ఆమెను శ్రీహాన్ ఓదార్చారు. వీరికి నిశ్చితార్థం కూడా జరగ్గా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. 

59


కాగా శేఖర్ మాస్టర్ నిర్మాతగా శ్రీహాన్-సిరి జంటగా వెబ్ సిరీస్ ప్రకటించారు. ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఈ సిరీస్ కి సుజిత్ రాజ్ దర్శకత్వం వహించనున్నారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. 

69
Sreehan

Sreehan


ఈ క్రమంలో శ్రీహాన్-సిరిలకు టైం స్టార్ట్ అయ్యింది. ఈ జంట సిల్వర్ స్క్రీన్ పై బిజీ అయ్యే సూచనలు కలవు అంటున్నారు. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయట. ఇక బిగ్ బాస్ సీజన్ 6 రన్నర్ శ్రీహాన్ అనూహ్యంగా టైటిల్ కోల్పోయాడు. ఆత్మవిశ్వాసం లేక టైటిల్ రేవంత్ కి అప్పగించాడు. నాగార్జున ఆఫర్ కి టెంప్ట్ అయ్యి బిగ్ బాస్ విన్నర్ గా టైటిల్ అందుకునే ఛాన్స్ కోల్పోయాడు. హోస్ట్ నాగార్జున రూ. 40 లక్షలు తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకోవచ్చని చెప్పడంతో... బాగా ఆలోచించిన శ్రీహాన్ డబ్బులు తీసుకొని ఓటమిని అంగీకరించారు. 
 

79
Sreehan-Siri

Sreehan-Siri


అయితే అత్యధిక ఓట్లతో టైటిల్ గెలిచింది శ్రీహాన్(Sreehan) అని నాగార్జున ఫైనల్ గా రివీల్ చేశాడు. దాంతో అందరి మైండ్ బ్లాక్ అయ్యింది. స్వల్ప ఓట్ల తేడాతో రేవంత్ పై శ్రీహాన్ గెలిచాడని చెప్పడం సంచలనమైంది. గత ఐదు సీజన్స్ లో ఎన్నడూ జరగని పరిణామం ఇది. విన్నర్ రేవంత్, రన్నర్ శ్రీహాన్ ఇద్దరూ నొచ్చుకునే పరిస్థితి అక్కడ నెలకొంది. 

89
Sreehan-Siri

Sreehan-Siri

టైటిల్ గెలుచుకున్నప్పటికీ శ్రీహాన్ వదిలేయడం వలన దక్కిందని రేవంత్... అనవసరంగా డబ్బులకు టెంప్ట్ అయ్యి విన్నర్ అయ్యే ఛాన్స్ కోల్పోయానన్న బాధ శ్రీహాన్ లో ఉండిపోయాయి. ఏది ఏమైనా ఈ సీజన్ కి ఇద్దరు విన్నర్స్ అవతరించారు. ప్రైజ్ మనీ కూడా ఇద్దరికీ సమానంగా దక్కింది. చెరో రూ. 45 లక్షలు గెలుచుకున్నారు. 

99
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

టైటిల్ చేజారినా శ్రీహాన్ కొంత డబ్బు గెలుచుకున్నాడు. అతనికి గతంలో లేని ఫేమ్ గుర్తింపు వచ్చాయి. బిగ్ బాస్ షో శ్రీహాన్ కి తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీ తెచ్చింది. ఈ గుర్తింపు శ్రీహాన్ కి వెండితెర ఆఫర్స్ తెచ్చిపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఓకే చేశారు.
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved