- Home
- Entertainment
- యాంకర్ రష్మి లవ్ సక్సెస్.. ఆ సంతోషంలో అసలు రహస్యం బయటపెట్టిన జబర్దస్త్ యాంకర్.. సుధీర్ పరిస్థితేంటో?
యాంకర్ రష్మి లవ్ సక్సెస్.. ఆ సంతోషంలో అసలు రహస్యం బయటపెట్టిన జబర్దస్త్ యాంకర్.. సుధీర్ పరిస్థితేంటో?
యాంకర్ రష్మి జబర్దస్త్ కామెడీ షోకి కేరాఫ్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. అందంతోపాటు తనదైన వినోదంతో అలరిస్తుంది. లవ్ ట్రాక్‌లతో వార్తల్లో నిలుస్తుంది. కానీ ఇప్పుడు ఆమె నిజమైన ప్రేమని అందరి ముందు తేల్చుకుంది.

జబర్దస్త్ యాంకర్ రష్మి.. పదేళ్లుగా ఈ కామెడీ షోకి యాంకర్‌గా చేస్తూ టీవీ రంగంలో పాపులర్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. ఆమె సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ని, క్రేజ్‌ని ఏర్పర్చుకుంది. దాన్ని మరింత పెంచుకునేందుకు గ్లామర్ ఫోటోలతో అలరిస్తుంది. యూత్‌కి డ్రీమ్ గర్ల్ గా మారుతుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయ్యింది.
యాంకర్ రష్మి గౌతమ్ `శ్రీదేవీ డ్రామా కంపెనీ`కి కూడా యాంకర్‌గా చేస్తుంది. ఇందులో జబర్దస్త్ కమెడియన్లతోపాటు మిగిలిన ఆర్టిస్టులు, డాన్సర్లు పాల్గొంటూ సందడి చేస్తుంటారు. ఈ ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రసారమైన విషయం తెలిసిందే. ఇందులో రష్మి తన లవ్ లైఫ్ గురించి సీక్రెట్ బయటపెట్టింది. రష్మి.. సుడిగాలి సుధీర్‌తో ప్రేమలో ఉన్నారనే చర్చ నడుస్తుంది. కానీ అందులో నిజం లేదని, వీరిద్దరు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు.
ఇక ఇప్పుడు `శ్రీదేవి డ్రామా కంపెనీ` ఎపిసోడ్‌లో అసలు విషయం బయటపెట్టింది. వ్యక్తిగత జీవితంలో తాను ప్రేమలో ఉన్నట్టు వెళ్లడించింది. కెరీర్ లైఫ్ సాఫీగానే సాగుతుందని, కానీ పర్సనల్ లైఫ్ లో తన లవ్ సక్సెస్ అవుతుందా? లేదా? అనేది టెస్ట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ షోలో ఓ పాప్ కార్న్ బాక్స్ లో రాళ్లు వేస్తుంటారు. కరెక్ట్ గా అది బాక్స్ లో పడితే, అనుకున్నది సక్సెస్ అవుతుంది, లేదంటే ఫెయిల్ అయినట్టు లెక్క. అలా రష్మి తన ప్రేమనే టెస్ట్ చేసుకుంది.
ఇక ఉత్కంఠతకి గురిచేసేలా రష్మి ఎపిసోడ్ సాగింది. ఆమె టెన్షన్ పడుతూనే రాయి వేయగా లక్కీగా అది ఆ డబ్బాలో పడింది. దీంతో ఒక్కసారిగా రష్మి ఆనందంతో కూడిన షాక్‌కి గురయ్యింది. అంతే తన లవ్ సక్సెస్ అవుతుందనే ఆనందంలో అదిరిపోయే మాస్ స్టెప్పులేసింది. తీన్ మార్ సాంగ్‌కి డాన్సులేస్తూ అదరగొట్టింది. `రష్మీ నీ లవ్ సక్సెస్` అని చెప్పగా, నా పొలంలో మొలకలొచ్చాయ్ అంటూ ఆమె రెచ్చిపోవడం విశేషం. ఈ ఎపిసోడ్ ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతుంది.
అయితే ఇందులో రష్మి తన లవ్ మ్యాటర్ గురించి పూర్తి వివరాలు తెలియజేయలేదు. జస్ట్ సక్సెస్ అయ్యిందనే ఆనందంతో ఎగిరి గంతేసింది కానీ, ప్రియుడి వివరాలు వెల్లడించలేదు. ఎవరూ ప్రశ్నించలేదు. దీంతో ఇది జస్ట్ కామెడీ కోసం చేసిందేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది అబద్దమా? లేక నిజంగానే తన లైఫ్‌లో రష్మికి లవర్ ఉన్నాడా? ఉంటే సుడిగాలి సుధీర్ పరిస్థితేంటనేది పెద్ద ప్రశ్న. ఇందులో నిజమేంటనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.