MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అందుకే ఆ రోజు పబ్ కి వెళ్ళాను... అరెస్ట్ పై మొదటిసారి నోరువిప్పిన నిహారిక!

అందుకే ఆ రోజు పబ్ కి వెళ్ళాను... అరెస్ట్ పై మొదటిసారి నోరువిప్పిన నిహారిక!

నిహారిక కొణిదెల రాడిసన్ బ్లూ హోటల్ పై జరిగిన దాడిలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి విచారించి నిహారికతో పాటు కొందరిని ఉదయం విడుదల చేశారు. ఈ కేసు విషయంలో ఏం జరిగిందో నిహారిక తాజాగా వెల్లడించింది.  

1 Min read
Author : Sambi Reddy
| Updated : Mar 18 2024, 12:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

2022 లో నిహారిక కొణిదెల అరెస్ట్ కలకలం రేపింది. రాడిసన్ బ్లూ హోటల్ లో లేట్ నైట్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ పార్టీలో డ్రగ్స్ ఉపయోగించారని సమాచారం. నిహారిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Niharika Konidela

Niharika Konidela

అర్ధరాత్రి అరెస్ట్ అయిన నిహారిక ఉదయం 7 గంటల వరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. విచారణ అనంతరం ఆమెను ఇంటికి పంపారు. మరోసారి విచారణకు రావాలని నోటీసులు పంపినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై నిహారిక తండ్రి నాగబాబు వివరణ ఇచ్చారు. 

 

36
Niharika Konidela

Niharika Konidela

డ్రగ్ కేసుతో నిహారికకు ఎలాంటి ప్రమేయం లేదు. నిహారిక ఎలాంటి తప్పు చేయలేదని పోలీసులే నిర్ధారించారని చెప్పుకొచ్చాడు. ఈ అరెస్ట్ పై నిహారిక ఎప్పుడూ మాట్లాడలేదు. తాజా ఇంటర్వ్యూలో ఆమె పెదవి విప్పారు. ఆ రోజు ఏం జరిగిందో వెల్లడించారు. మీడియా అత్యుత్సాహం చూపింది తప్పితే అక్కడ ఏమీ జరగలేదని నిహారిక అన్నారు. 

46
Niharika Konidela

Niharika Konidela

నిహారిక మాట్లాడుతూ... ఆ రోజు మా స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలిశాము. దాదాపు ఆరు నెలల తర్వాత మేము కలుసుకున్నాము. అయితే అక్కడ సౌండ్స్ మాకు చాలా ఇబ్బందిగా అనిపించాయి. దాంతో ఇంటికి వెళ్ళిపోదామని బిల్ చెల్లించి బయలుదేరాము. అప్పుడే రైడ్ జరిగింది. అందరితో పాటు మమ్మల్ని కూడా స్టేషన్ కి తీసుకెళ్లారు. 
 

56
Niharika Konidela

Niharika Konidela

ఆ రోజు జరిగింది ఇదే. మీడియా మాత్రం దీన్ని హైలెట్ చేసింది. అత్యుత్సాహం ప్రదర్శించారని నిహారిక చెప్పుకొచ్చింది. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని ఆమె పరోక్షంగా చెప్పారు. నిహారిక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆమె నటిగా నిర్మాతగా రాణించాలి అనుకుంటుంది. 

 

66
Niharika Konidela

Niharika Konidela

నిహారిక గత ఏడాది భర్తకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ తమిళ సినిమాకు ఆమె సైన్ చేసింది. పింక్ ఎలిఫెంట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చిత్రాలు, సిరీస్లు నిర్మించాలి అనుకుంటుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Recommended image2
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image3
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved