Purna: అబ్బాయిలకు హగ్గులు ఇవ్వలేకే ఢీ షో మానేశా... పూర్ణ షాకింగ్ కామెంట్స్!
ఢీ సీజన్ 13లో సందడి చేసి పూర్ణ లేటెస్ట్ సీజన్ 14 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. మంచి ఎంటర్టైనర్ గా పేరుగాంచిన పూర్ణ ఢీషో ఎందుకు వదిలేశారు? ఒకవేళ నిర్వాహకులే తప్పించారా? అనే పలు అనుమానాలు రేకెత్తాయి. వాటన్నింటికీ ఒక్క మాటలో సమాధానం చెప్పింది పూర్ణ.

Purna
బుల్లితెరపై టాప్ రేటెడ్ షోగా ఉంది ఢీ డాన్స్ రియాలిటీ షో. కామెడీ, గ్లామర్, డాన్స్, రొమాన్స్ మిక్స్ చేసి అద్భుతంగా ఈ షోని నిర్వాహకులు రూపొందించారు. ప్రదీప్, సుధీర్, హైపర్ ఆది కామెడీతో పాటు రష్మీ, దీపికా పిల్లి,పూర్ణ, ప్రియమణి గ్లామర్ షోకి ప్రధాన ఆకర్షణగా ఉండేవి.
Purna Hot photos
మంచి టీమ్ వర్క్ తో దూసుకుపోతున్న షోకి పెనుమార్పులు చేశారు. హైపర్ ఆది, ప్రదీప్, ప్రియమణి మినహాయించి అందరినీ తీసేశారు. జడ్జి పూర్ణ సైతం ఢీ14 లో కనిపించడం లేదు. ఢీ నిర్వాహకులు అందరినీ ఒకేసారి తీసేయడం వెనుక కారణం అర్థం కాలేదు. అదే సమయంలో స్వచ్ఛందంగా మానేశారా అనే సందేహాలు కూడా కలిగాయి.
కాగా ఢీ సీజన్ 14 నుండి తాను తప్పుకున్నట్లు తాజాగా పూర్ణ వెల్లడించారు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చిన పూర్ణ మాటల్లో మాటగా అసలు విషయం వెల్లడించారు. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ కి రష్మీ, పూర్ణ రావడం జరిగింది.
ఇక పూర్ణ, రష్మీకి హైపర్ ఆది, రామ్ ప్రసాద్ వెల్కమ్ చెప్పారు. హైపర్ ఆది పూర్ణ, రష్మీలను ఉద్దేశిస్తూ... ఈ షోకి కొత్తగా వచ్చిన యాంకర్ ఎవరైనా మా అన్నకు హగ్గు ఇవ్వాలని చెప్పాడు. ఆ మాటకు సమాధానంగా పూర్ణ.. ఈ హగ్గులు ఇవ్వలేకే ఢీ షో వదిలేశాను. ఇక ఇక్కడ కూడా హగ్గులు అంటే ఇది కూడా మానేస్తా అని చెప్పారు.
ఈ డైలాగ్ పూర్ణ ఫ్లో లో చెప్పిందా, అసలు కారణం ఇదేనా అనే సందేహాలు మొదలయ్యాయి. ఢీ షోలో పూర్ణ నిజంగా హద్దులు మీరి ప్రవర్తించారు. మేల్ యాంకర్స్, డాన్సర్స్ తో ఆమె రొమాన్స్ కురిపించేవారు. కొందరు అబ్బాయిల బుగ్గలు కూడా కొరికిన పూర్ణ... హగ్గులకు లెక్కే లేదు.
ఇక రియాలిటీ షోల్లో జరిగేదంతా దాదాపు ప్రణాళికే. డైరెక్టర్స్ రూపొందించిన స్క్రిప్ట్ ప్రకారం అందరూ నడుచుకుంటారు. కాబట్టి పూర్ణ అలా ప్రవర్తించారంటే దాని వెనుక డైరెక్టర్స్ ప్రేపరేషన్ ఉంటుంది. మనసు పడి, నచ్చి ఆమె అబ్బాయిలకు హగ్గులు ఇచ్చారనుకోవడం పొరపాటే అవుతుంది. కాబట్టి కామెడీగా చెప్పినా పూర్ణ ఢీ షో వదిలేయడానికి హగ్గులు కూడా కారణం కావచ్చు.