- Home
- Entertainment
- హీరో సుమన్ జైలుకు వెళ్ళడానికి కారణం ఆ ముగ్గురే.. అసలు వాస్తవం వెలుగులోకి, చిరంజీవి ప్రమేయం ?
హీరో సుమన్ జైలుకు వెళ్ళడానికి కారణం ఆ ముగ్గురే.. అసలు వాస్తవం వెలుగులోకి, చిరంజీవి ప్రమేయం ?
80 దశకంలో సుమన్ చిరంజీవి లాంటి టాప్ హీరోలతో పోటీగా చిత్రాలు చేస్తూ దూసుకుపోయారు. కానీ ఆ సమయంలో సుమన్ జీవితంలో జరిగిన వివాదాస్పద సంఘటన ఆయన కెరీర్ కి పెద్ద మైనస్ అయింది.

80, 90 దశకాల్లో హీరోగా రాణించిన సుమన్.. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. సుమన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శివాజీ చిత్రంలో విలన్ పాత్ర, అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్ర సుమన్ కి సరికొత్త ఇమేజ్ తీసుకువచ్చాయి. 80 దశకంలో సుమన్ చిరంజీవి లాంటి టాప్ హీరోలతో పోటీగా చిత్రాలు చేస్తూ దూసుకుపోయారు.
కానీ ఆ సమయంలో సుమన్ జీవితంలో జరిగిన వివాదాస్పద సంఘటన ఆయన కెరీర్ కి పెద్ద మైనస్ అయింది. ఆ సంఘటన తర్వాత సుమన్ కెరీర్ నెమ్మదించింది. దర్శక నిర్మాతలు సుమన్ కాల్ షీట్స్ కోసం ఎదురుచూసేవారు. అంతలా క్రేజ్ తో సుమన్ దూసుకుపోతున్న సమయంలో ఆయనపై నీలిచిత్రాల వివాదం పిడుగులా పడింది.
ఈ వివాదంలో సుమన్ ని అరెస్ట్ చేశారు. దీనితో సుమన్ జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. ఈ సంఘటన వల్ల అప్పటి వరకు ఉన్న సుమన్ క్రేజ్ పడిపోయింది. పథకం ప్రకారమే కొందరు సుమన్ ని ఈ వివాదంలో ఇరికించారనే పుకార్లు అప్పట్లో వినిపించాయి. సుమన్ ని ఇరికించిన వారిలో చిరంజీవి కూడా ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఎప్పటికప్పుడు ఈ వివాదంలో చిరంజీవి ప్రమేయం ఏమాత్రం లేదు అని సుమన్ ఖండిస్తూ వచ్చారు.
దివంగత డైరెక్టర్ సాగర్ ఈ ఇవ్వడం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. దీనితో సుమన్ విషయంలో జరిగిన అసలు సంగతి ఇదా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అంటే సుమన్ నీలిచిత్రాల కేసులో చిక్కుకున్నాడనేది పూర్తిగా అవాస్తవం అని తేలింది. అలాగే సుమన్ జైలుకి వెళ్ళడానికి చిరంజీవి ప్రమేయం ఉందనేది కూడా పూర్తిగా అబద్దమే.
అసలు సంఘటనని దర్శకుడు సాగర్ బయటపెట్టారు. తమిళనాడులో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర డీజీపీ ఒకరు ఉండేవారు. అలాగే లిక్కర్ కంట్రాక్టర్ కూడా ఒకరు ఎంజీఆర్ కి క్లోజ్.వీరి ముగ్గురి వల్లే సుమన్ జైలుకి వెళ్లారు. డిజిపి కుమార్తె కి సుమన్ అంటే చాలా ఇష్టం. హీరో సుమన్ ఎక్కడ షూటింగ్ లో ఉన్నా ఆమె అక్కడికి వెళ్ళేది. ఆమెకి ఆల్రెడీ వివాహం జరిగింది.
అయితే సుమన్ కి మాత్రం ఆమెతో సంబంధం లేదు. ఆమె వైపు నుంచి వన్ సైడ్ లవ్ అంతే. కానీ డిజిపి మాత్రం తన కుమార్తె ని సుమన్ ట్రాప్ చేశాడు అని తప్పుగా అర్థం చేసుకున్నారు. అదే సమయంలో సుమన్ స్నేహితుడు ఒకరు లిక్కర్ కాంట్రాక్టర్ కుమార్తె తో ప్రేమలో ఉన్నారు. విషయాన్ని డిజిపి ఎంజీఆర్ కి వివరించారు. దీనితో ఎంజీఆర్ సుమన్ ని ఇంటికి పిలిపించుకుని.. డిజిపి కుమార్తెకి దూరంగా ఉండాలని చెప్పారు. కానీ సుమన్ మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం నాకు కాదు ఆమెకి చెప్పండి అని చెప్పాడట. దీనితో ఎంజీఆర్ కి కోపం వచ్చింది.
అందువల్లే సుమన్ పై తప్పుడు కేసులు పెట్టారు. సుమన్ స్నేహితుడికి క్యాసెట్ల షాప్ ఉండేది. అక్కడికి అమ్మాయిలు కూడా వచ్చేవారు. దీనితో సుమన్ కి బెయిల్ రాణి విధంగా పలు కేసులు బనాయించి జైలుకి తీసుకెళ్లారు. సుమన్ తల్లికి గవర్నర్ తెలిసిన వారు కావడంతో దాదాపు ఆరునెలల తర్వాత బెయిల్ వచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. సుమన్ నటించాల్సిన చిత్రాలు ఆగిపోయాయి. ఆస్తులు కూడా పోయాయి అని సాగర్ అన్నారు.
అంతే కానీ ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు నీలి చిత్రాల కేసు అనేది అబద్దం. అలాగే ఇంకెవరి ప్రమేయమొ ఉందనేది కూడా పూర్తిగా అవాస్తవం అని సాగర్ అన్నారు. డిజిపి వివాదం నిర్మాత రామానాయుడు గారికి ముందే తెలుసు. సుమన్ తప్పనిసరిగా అరెస్ట్ అవుతారని కూడా ఆయనకి తెలుసు. దీనితో సుమన్ తో తెరక్కించాల్సిన చిత్రాన్ని ఆయన రద్దు చేశారు.