MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • త్రివిక్రమ్ ని తిట్టిన మాట వాస్తవమే మనిషన్నాక కోపం రాదా... ఫైనల్ గా ఓపెన్ అయిన బండ్ల గణేష్!

త్రివిక్రమ్ ని తిట్టిన మాట వాస్తవమే మనిషన్నాక కోపం రాదా... ఫైనల్ గా ఓపెన్ అయిన బండ్ల గణేష్!

నటుడు బండ్ల గణేష్ దర్శకుడు త్రివిక్రమ్ ని తిడుతున్న ఆడియో కాల్ ఒకటి అప్పట్లో వైరల్ అయ్యింది. అయితే ఆ  వాయిస్ నాది కాదని, ఎవరో సృష్టించారని బండ్ల వివరణ ఇచ్చారు. తాజాగా త్రివిక్రమ్ ని తిట్టిన మాట వాస్తవమే అని ఆయన ఒప్పుకున్నారు.

2 Min read
Author : Sambi Reddy
| Updated : Oct 03 2022, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bandla Ganesh

Bandla Ganesh


ఫిబ్రవరి 25న  భీమ్లా నాయక్ విడుదలైంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ జరగడానికి ముందు రోజు ఓ ఆడియో ఫైల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ ఆడియో కాల్ లో బండ్ల గణేష్ దర్శకుడు త్రివిక్రమ్ ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bandla Ganesh

Bandla Ganesh


త్రివిక్రమ్ గాడు నన్ను భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకుండా అడ్డుకుంటున్నాడు. నేను వస్తే వాడు డామినేట్ అవుతాడని ఆహ్వానం పంపలేదు. నేనైతే స్పీచ్ సిద్ధం చేసుకొని ఉన్నాను. పవన్ ఫ్యాన్స్ అందరూ బండ్లన్న బండ్లన్నా అంటూ నినాదాలు చేయడమే, పక్కన వేచి చూస్తున్న నేను వచ్చేస్తాను.. అని పవన్ అభిమానితో బండ్ల గణేష్ మాట్లాడారు. 
 

36


లీకైన ఆడియో ఫైల్ లో ఉన్న మేటర్ ఇది.  ఇక ఆడియో ఫీల్ ఉన్న వాయిస్ బండ్ల గణేష్ వాయిస్ కి చాలా దగ్గరగా ఉంది. అయితే బండ్ల ఆ వాయిస్ తనది కాదని ఖండించారు. ఎవరో నాపై పగతో ఫేక్ క్రియేట్ చేశారన్నారు. త్రివిక్రమ్ సైలెంట్ గా ఉన్న నేపథ్యంలో ఆ వివాదం అంతటితో ముగిసింది. 

46
Puri jagannadh

Puri jagannadh


అప్పుడు ఆడియో రికార్డులో ఉంది నా వాయిస్ కాదన్న బండ్ల తాజాగా ఫ్లేటు మార్చారు. అది నా వాయిస్సే, త్రివిక్రమ్ ని తిట్టిన మాట వాస్తవమే అన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్.. ఏదో కోపంలో అప్పుడు త్రివిక్రమ్ ని తిట్టాను. మనిషన్నాక కోపం వస్తుంది కదా... అలాగే నేను కూడా కోపంలో ఏదో ఒక మాటన్నాను. 

56


తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ కి సారీ చెప్పాను. ఆ వివాదం ముగిసి పోయింది. అది చిన్న విషయం మమ్మల్ని దూరం చేయదు అన్నారు. అయితే  వైరల్ అయిన ఆడియోలో ఉన్న పూర్తి వాయిస్ నాది కాదని ఆయన మరలా మాట మార్చడం విశేషం. ఏదైతేనేమి త్రివిక్రమ్ ని తిట్టినట్లు బండ్ల గణేష్ ఫైనల్ గా ఒప్పుకున్నారు. 

66


కాగా త్రివిక్రమ్ ని తిట్టిన ఆడియో బయటికి వచ్చినప్పటి నుండి పవన్ ని బండ్ల కలవకపోవడం విశేషం. బండ్ల గణేష్ పై కోపంగా ఉన్న పవన్ ఆయన్ని దూరం పెట్టాడని వినికిడి. అప్పట్లో బండ్ల గణేష్ తరచుగా పవన్ ని కలిసేవారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో బయటికొచ్చి చాలా కాలం అవుతుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu Fitness: అమ్మాయిలూ ఈ తప్పు అస్సలు చేయొద్దు.. జీవితాంతం బాధపడతారు
Recommended image2
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..
Recommended image3
Varanasi Movie: రాజమౌళి సినిమా సెట్ లీక్.. ఉగ్రభట్టి గుహల ఫోటోలు వైరల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved