చివరకు అందాలను వెలుగులోకి తెచ్చిన కీర్తి... సమ్మర్ మూడ్ అంటూ గ్లామర్ తెరలేపింది!
హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్ తనలోని హాట్ యాంగిల్ పరిచయం చేసింది. సమ్మర్ మూడ్ అంటూ గ్లామర్ అవతారంలో దర్శమిచ్చి షాక్ ఇచ్చింది. కీర్తి లేటెస్ట్ ఫోటో షూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.
ఆఫ్ స్క్రీన్ కానీ, ఆన్ స్క్రీన్ కానీ, కీర్తి స్కిన్ షో చేసిన దాఖలాలు లేవు. మహానటి మూవీతో ఓ భిన్నమైన ఇమేజ్ తెచ్చుకున్న ఆమె... దానికి అనుగుణంగానే పాత్రలు ఎంచుకుంటుంది.
పవన్ కళ్యాణ్ వంటి స్టార్ సినిమాలో నటించినా... కీర్తి మాత్రం గ్లామర్ హద్దులు దాటి ఎక్స్ పోజ్ చేయలేదు. అలాంటి కీర్తి సోషల్ మీడియాలో మొదటిసారి గ్లామరస్ గా కనిపించారు.
స్లీవ్ లెస్ ట్రెండీ సమ్మర్ వేర్ లో ఆమె సెక్సీ లుక్స్ తో చంపేశారు. కీర్తి అవుట్ ఫిట్ మరీ ఎక్స్ పోజ్ చేయక పోయినా.. గత తన ఫొటోలతో పోల్చుకుంటే కొంచెం డోసు పెంచారని అర్థం అవుతుంది.
ఎప్పుడూ హోమ్లీ లుక్ లో కనిపించే కీర్తి సురేష్... తాజా ఫోటో షూట్ లో హాట్ అవతార్ లో భిన్నంగా కనిపిస్తున్నారు. కీర్తి లేటెస్ట్ లుక్ ఆమె ఫ్యాన్స్ భీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు.
అన్ని వేళలా ఒకలా ఉన్నా మొనాటమీ వచ్చేస్తుంది. అందుకే కాబోలు కీర్తి కొంచెం కొత్తగా ట్రై చేశారు. లేటెస్ట్ ఫోటోలు కీర్తి అందాలను వెలుగులోకి తీసుకు వచ్చినట్లు అయ్యింది.
ఇక సౌత్ ఇండియాలోనే బిజీ హీరోయిన్ గా కీర్తి సురేష్ ఉన్నారు. ప్రస్తుతం కీర్తి చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. తెలుగు, తమిళ, మలయాళ భాషలలో కీర్తి సురేష్ సినిమాలు చేస్తున్నారు.
మహేష్ హీరోగా దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న సర్కారు వారి పాట చిత్రంలో కీర్తి హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ దుబాయ్ లో మొదలు కావడంతో పాటు ఒక షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. సర్కారు వారి పాట దుబాయ్ షెడ్యూల్ నందు కీర్తి సురేష్ కూడా పాల్గొన్నారు.
ఇక తమిళంలో రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న అన్నాత్తే మూవీలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా ఉన్నారు.