ప్రభాస్‌ను ఆ సెంటిమెంట్ నిండా ముంచేసిందా.! ఇక దాని జోలికి వెళ్లరంటూ..
Prabhas: వినడానికి విడ్డూరంగా ఉన్నా.. సెంటిమెంట్స్ చుట్టూనే ఇండస్ట్రీ తిరుగుతోంది. ఓ డైరెక్టర్ లేదా ఓ జోనర్‌తో సినిమా హిట్ కాలేదంటే.. కచ్చితంగా మరోసారి అది ట్రై చేయరు హీరోలు. ఇప్పుడు ప్రభాస్ విషయంలో కూడా అదే వచ్చింది. ఆ వివరాలు ఇలా..

సినిమా సెంటిమెంట్..
సినిమావాళ్లకు సెంటిమెంట్‌పై బాగా నమ్మకం ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఓ డైరెక్టర్ లేదా హీరోయిన్, ఓ జోనర్.. ఇలా ఏదైనా హిట్ కాలేదంటే.. కచ్చితంగా మరోసారి అది ట్రై చేయరు హీరోహీరోయిన్లు. సరిగ్గా ఈ సెంటిమెంట్ ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ చుట్టూ తిరుగుతోందని అభిమానులు అంటున్నారు. తాజాగా విడుదలైన సినిమాతో అది ప్రూవ్ అయిందని నెటిజన్లు చెబుతున్నారు.
ప్రభాస్ 'ది రాజా సాబ్'..
ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతీ తెరకెక్కిన చిత్రం 'ది రాజా సాబ్'. జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. డివైడ్ టాక్ తెచ్చుకుందని చెప్పొచ్చు. కొందరు సినిమా బాగుందని అంటుంటే.. మరికొందరు బాగోలేదని పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా అభిమానుల మనసు గెలవడంలో విఫలమైంది. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ తెచ్చుకోకపోవడానికి దని టైటిల్ కారణమని అంటున్నారు అభిమానులు.
టైటిల్ కారణం..
'ది రాజాసాబ్' బాక్సాఫీస్ దగ్గర తేలిపోవడానికి.. ఆ టైటిల్‌లో ఉన్న ఇంగ్లిష్ లెటర్ 'ఆర్' కారణమంటున్నారు నెటిజన్లు. ఇప్పటికే ఇది నాలుగుసార్లు ప్రూవ్ అయిందని సాక్ష్యాలు పెడుతున్నారు. ప్రభాస్ రెండో చిత్రం.. అలాగే ఆయన కెరీర్‌లో 'ఆర్' లెటర్‌తో వచ్చిన తొలి చిత్రం 'రాఘవేంద్ర'. 2003లో విడుదలైన 'రాఘవేంద్ర' చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
ఆ ఒక్క సినిమానే కాదు..
2012లో ప్రభాస్ హీరోగా 'రెబల్' మూవీ వచ్చింది. ఇది కూడా 'ఆర్' లెటర్‌తో ఆరంభమయ్యేదే. ఈ సినిమాలో సీనియర్ నటుడు కృష్ణంరాజు ప్రధాన పాత్రలో కనిపించగా.. అప్పట్లో వరుస విజయాలతో ఊపుమీదున్న లారెన్స్ దర్శకత్వం వచించాడు. ఈ మూవీ అటు ప్రభాస్, ఇటు లారెన్స్ ఇద్దరికీ పెద్ద డిజాస్టర్‌ను మిగిల్చింది..
పాన్ ఇండియా స్టార్ అయినా సెంటిమెంట్ మారలేదు..
'బాహుబలి' సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. అయితేనేం 'ఆర్' లెటర్ సెంటిమెంట్ మాత్రం ఆయన్ని వదలలేదు. 2022లో 'రాధే శ్యామ్' అనే మూవీతో ప్రభాస్ ప్రేక్షకులను పలకరించినా.. అది బాక్సాఫీస్ దగ్గర పరాజయాన్ని చవిచూసింది. ఇలా 'ఆర్' లెటర్ టైటిల్స్ అన్ని కూడా ప్రభాస్‌కు అచ్చిరాలేదు. అందుకే 'ది రాజాసాబ్' మేకర్స్ టైటిల్ ముందు 'ది' లెటర్ జోడించారు. అయినప్పటికీ 'ఆర్' సెంటిమెంట్ ప్రభాస్‌ను వెంటాడిందని నెటిజన్లు అంటున్నారు. అలాగే ఇకపై 'ఆర్' టైటిల్స్ ప్రభాస్ ఎంచుకోకపోవచ్చునని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.

