మంచు మనోజ్, మోహన్‌బాబు మధ్య గొడవకి మూలం అదే, పనిమనిషి చెప్పిన నిజం, విష్ణు కోపానికి కారణమదే?
మంచు మనోజ్, తండ్రి మోహన్‌బాబు మధ్య గొడవకి మూలం ఏంటో తెలిసిపోయింది. పనిమనిషి షాకింగ్ విషయాలను తెలిపింది. విష్ణులో కోపానికి కారణమేంటో వెల్లడించింది.
హీరో మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ రోడ్డుపైకి వచ్చింది. ఫ్యామిలీ గొడవలతో బజారున పడ్డారు. చినికి చినికి గాలి వానలా మారినట్టు వీరి వివాదం కేసుల వరకు వెళ్లింది. మంచు మనోజ్ ఓ అడుగు ముందుకేసి ఏకంగా సీఎంల వరకు తీసుకెళ్లారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లను ట్యాగ్ చేస్తూ ఓ సుధీర్ఘ లెటర్‌ని ట్విట్టరలో పంచుకున్నాడు మనోజ్. అంతకు ముందే తండ్రి మోహన్‌బాబుపై మంచు మనోజ్, మనోజ్‌పై మోహన్‌బాబు కేసులు పెట్టారు. వారి నుంచి తమకు హాని ఉందని రక్షణ కల్పించాలని ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫారెన్‌లో ఉన్న మంచు విష్ణు హైదరాబాద్‌కి చేరుకున్నారు. జరిగిన ఘటనపై ఆయన సీరియస్‌గా ఉన్నారట. ముఖ్యంగా తమ్ముడు మనోజ్‌పై ఆయన సీరియస్‌గా ఉన్నారట. కారణం తండ్రి మోహన్‌బాబుని మనోజ్ కొట్టడమే. తండ్రికొడుకులు మాట మాట పెరిగి నెట్టేసుకున్నారట.
మోహన్‌బాబుని మనోజ్ టచ్ చేసి నెట్టేశాడట. ఈ విషయం విష్ణుకి తెలిసింది. తండ్రిపై ఈగ వాలినా విష్ణు సహించడట. మనోజ్ ఇలా చేశాడని తెలిసి కోపంతో ఉన్నాడని అంటున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. ఇందులో విష్ణు ఆవేశంతో కనిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే తమ నివాసం నుంచి మనోజ్ బయటకు వచ్చేశాడు. తండ్రి నుంచి హాని ఉందని భావించి ఆయన ఇంటిని ఖాళీ చేశారు. తన భార్య మౌనికా రెడ్డి, కూతురు, కొడుకుతో కలిసి మనోజ్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. అయితే మోహన్‌బాబునే ఇంటి నుంచి ఖాళీ చేయించాడట. ఆయనే వెళ్లిపోవాలని బెదిరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ నడుస్తున్న క్రమంలో ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. వారింట్లో పనిచేసే పనిమనిషి మతిపోయే విషయాలను వెల్లడించింది.
గొడవకు కారణాలు తెలిపింది. చాలా రోజులుగా వీరి మధ్య ఈ గొడవలు నడుస్తున్నాయని తెలిపింది. మంచు మనోజ్.. యూనివర్సిటీ అవకతవకలను బయటపెట్టిన నేపథ్యంలో పనిమనిషి కూడా ఆ విషయాలను చెప్పకనే చెప్పింది. ఆ విషయంలో గొడవలు జరుగుతున్నాయని చెప్పింది. అయితే మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఆమె పంచుకుంది. మనోజ్, మోహన్‌బాబు మధ్య గొడవకి మనోజ్ రెండో పెళ్లినే కారణమని చెప్పింది.
మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, అప్పట్నుంచే ఈ గొడవలు జరుగుతున్నాయని తెలిపింది. పైగా మౌనికా రెడ్డి కొడుకుతో(మొదటి భర్త కొడుకు) వచ్చింది. ఆమెకి కొడుకు ఉన్నాడని తెలిసినా మనోజ్ పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంలోనే మోహన్‌బాబుకి కోపం అని తెలిపింది. అక్కడి నుంచే ఇవన్నీ నడుస్తున్నాయని తెలిపింది.
ఆస్తుల విషయంలో గొడవలంటూ ప్రచారం జరుగుతుంది. మౌనికా రెడ్డి కొడుక్కి కూడా మనోజ్ తరఫున ఆస్తి వెళ్తుందా? ఈ విషయం మోహన్‌బాబుకి నచ్చడం లేదా? అనేది సస్పెన్స్ గా మారింది. ఈ విషయంలో మనోజ్, మంచు లక్ష్మి ఓ వైపు, మోహన్‌బాబు, మంచు విష్ణు మరోవైపు ఉన్నారు. ఇంట్లో సెట్ చేసుకోవాల్సిన గొడవని పబ్లిక్‌లోకి తీసుకొచ్చారు.
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది పెద్ద రచ్చ అవుతుంది. మరి దీన్ని ఎలా సెట్ చేసుకుంటారు? ఎలా ముందుకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే మంచు విష్ణు హీరోగా `కన్నప్ప` అనే సినిమాని వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు మోహన్‌బాబు. ఈ వివాదం ఈ సినిమాపై గట్టి ప్రభావం చూపించబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
read more: మంచువారి కుటుంబంలో కుంపటి, కత్తులు దూసుకుంటున్న మోహన్ బాబు-మనోజ్, షాకింగ్ డిటైల్స్
also read: పుష్ప2 టూ ఆర్‌ఆర్‌ఆర్.. తొలి రోజు ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాలు