MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దీపావళికి రిలీజైన సినిమాలు ...ఏ OTTలో రాబోతున్నాయి?

దీపావళికి రిలీజైన సినిమాలు ...ఏ OTTలో రాబోతున్నాయి?

ఈ దీపావళికి విడుదలైన లక్కీ బాస్కర్, కెఎ, అమరన్, బగీరా వంటి సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ సినిమాలు Netflix, ETV Win వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ కానున్నాయి.

3 Min read
Surya Prakash
Published : Nov 02 2024, 08:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Lucky Baskhar, Amaran, Netflix, KA , Bagheera

Lucky Baskhar, Amaran, Netflix, KA , Bagheera


 ఈ ఏడాది దీపావళికి విడుదలైన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని సినిమాలు మంచి హైప్ మరియు ఎక్సపెక్టేషన్స్ తో ఈ సినిమాలు వచ్చాయి.

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుండి లక్కీ బాస్కర్, కెఎ, అమరన్, బగీరా, బ్రదర్ విడుదల కాగా, బాలీవుడ్ నుండి సింగం ఎగైన్ మరియు భూల్ భూలయ్యా 3 రిలీజ్ అయ్యాయి. ఈ నేపధ్యంలో  ఈ దీపావళి రిలీజ్ ల  OTT స్ట్రీమింగ్ పార్టనర్స్  కూడా కన్ఫర్మ్ అయ్యారు. ఏ సినిమా ఏ ఓటిటిలో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవనుంది ...ఆ వివరాలు చూద్దాం.  అలాగే ఆ సినిమాలు భాక్సాఫీస్  పరిస్దితి ఏమిటి

27

 
'లక్కీ భాస్కర్' 

పేరుకు మలయాళ నటుడు అయినా తెలుగువాళ్లకు బాగా దగ్గరయ్యాడు దుల్కర్ సల్మాన్. ఆయన తాజా చిత్రం  'లక్కీ భాస్కర్'. టీజర్, ట్రైలర్ రిలీజ్ దగ్గర నుంచి ఎక్సపెక్టేషన్స్ క్రియేట్ చేసాయి.  బ్యాంకింగ్ రంగంలో మోసాలపై లాంటి  కాన్సెప్ట్ కావడం ఓ వర్గానికి బాగా నచ్చింది.

నిర్మాత నాగవంశీ రిలీజ్ కు ముందే  ప్రీమియర్స్  తో బజ్ క్రియేట్ చేసారు.  రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి . కాబట్టి ఈ సినిమా దీపావళిని సినిమాతో సెలబ్రేట్ చేసుకోవాలనుకునేవారికి మంచి ఆప్షన్ గా నిలిచింది. కట్ చేస్తే తొలిరోజు రూ.12.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి.  ఈ సినిమా  Netflix లో స్ట్రీమ్ అవనుంది. 

37
death

death


కిరణ్ అబ్బవరం ‘క’

హిట్, ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో కిరణ్ అబ్బవరం దూసుకెళ్లాడు. అయితే ఇటీవల ఆయన నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కాస్త గ్యాప్‌ తీసుకొని ఏకంగా పాన్‌ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

అదే ‘క’. టైటిల్‌ ప్రకటన నుంచే ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఆ ఆసక్తినికి మరింత పెంచేసింది. భారీ అంచనాల మధ్య  దీపావళి కానుకగా (అక్టోబర్‌ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ నే తెచ్చుకుంది. మాస్ ఆడియన్స్ సైతం ఈ సినిమాకు క్యూలు కడుతున్నారు. ఈ సినిమా ETV Win  లో స్ట్రీమ్ అవనుంది. 
 

47
kodakara

kodakara

సాయి పల్లవి  'అమరన్'

శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం ‘అమరన్‌’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని  కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సాయి  పల్లవి ఉండటంతో  టాలీవుడ్‌లో కూడా ఈ మూవీపై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య దీపావళి రోజు (అక్టోబర్‌ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి రివ్యూలు తెచ్చుకుంది. తమిళంలో సాలిడ్ హిట్ టాక్ నడుస్తోంది. తెలుగు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కూడా ఎ, మల్లిప్లెక్స్ లలో  అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. మరీ ముఖ్యంగా ప్రేక్షకులు కంటతడి పెట్టుకునేలా సాయిపల్లవి తనదైన యాక్టింగ్‌తో అదరగొట్టేసిందని అంటున్నారు. దీనికి కూడా రూ.30 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ చెప్తోంది. ఈ సినిమా  Netflix లో స్ట్రీమ్ అవనుంది. 

57


  'బఘీర'

కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాలతో తెలుగు డైరక్టర్ గా అనిపించుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన కథతో వచ్చిన సినిమా ఇది. ప్రశాంత్ నీల్ తొలి సినిమా ఉగ్రం హీరో శ్రీ మురళి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బఘీర.  ఈ చిత్రంతో డాక్టర్‌ సూరి డైరెక్టర్‌గా పరిచమయ్యారు.

దీపావళి కానుకగా కన్నడతో పాటు తెలుగులో విడుదలైన ఈ సినిమా కన్నడంలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది.  హీరో పోలీస్. కానీ వ్యవస్థ పనితీరు వల్ల రాత్రి వేళలో ముసుగు వేసుకుని మరీ విలన్లని చెండాడటం అనే కాన్సెప్టు మనవాళ్లకు బాగా పాతది అనిపించింది. ఈ సినిమా  Netflix లో స్ట్రీమ్ అవనుంది. 
 

67
vandebharath

vandebharath


ఇక  దీపావళికి రిలీజైన హిందీ, తమిళ చిత్రాలు 

Brother: Zee5
Singham Again: Amazon Prime Video
Bhool Bhulaiyaa 3: Netflix లలో స్ట్రీమింగ్ కానున్నాయి.


 

77
Lucky Baskhar, Amaran, Netflix, KA , Bagheera

Lucky Baskhar, Amaran, Netflix, KA , Bagheera

ఫైనల్ గా  'బఘీర'ని ప‌క్క‌న పెడితే.. మిగిలిన‌ మూడు సినిమాల‌కూ మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. అమ‌ర‌న్‌, ల‌క్కీ భాస్క‌ర్‌, క చిత్రాలు దీపావ‌ళిని క్యాష్ చేసుకోగ‌లిగినట్లే. అయితే.. ‘అమ‌ర‌న్‌’ మాత్రం మ‌ల్టీప్లెక్సుల్లో ఎక్కువ మంది చూస్తున్నారు. ఇదో డ‌బ్బింగ్ సినిమా.  కిరణ్ అబ్బవరం ‘క’ క్రింద సెంటర్లలలో రన్ బాగుంది. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved