ట్రాన్స్ ఫరెంట్ శారీలో మెస్మరైజ్ చేస్తున్న ఫరియా అబ్దుల్లా.. చీరకట్టులో ‘చిట్టి’ అందాలు చూడతరమా?
‘జాతి రత్నాలు’తో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ఇటు సోషల్ మీడియాలో సంప్రదాయ దుస్తుల్లో ఫ్యాన్స్ ను, ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటోంది. తాజాగా చిట్టిచీరట్టులో దర్శనమిచ్చి అట్రాక్ట్ చేస్తోంది.
హైదరాబాద్ కు చెందిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే క్రేజ్ పెంచుకుంటోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ ‘జాతిరత్నాలు’తో తెలుగు ఆడియెన్స్ కు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘చిట్టి’ పాత్రలో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చి యూత్ లో క్రేజ్ సాధించుకుంది.
సోషల్ మీడియాలోనూ ఫరియా అబ్దుల్లా ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. కేరీర్ ప్రారంభం నుంచే ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుతూ వస్తోంది. రీల్స్, గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. ఈ సందర్భంగా తాజాగా చిట్టి చీరకట్టులో దర్శనమిచ్చింది.
ట్రాన్స్ ఫరెంట్ శారీలో మతిపోయేలా అందాల విందు చేస్తోంది. అప్పటికే గ్లామర్ పరంగా ఒకే అనిపించే ఈ ముద్దుగుమ్మ సంప్రదాయ దుస్తుల్లో తళుక్కున మెరవడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. చిట్టి మత్తు చూపులు, మతిపోయే పోజులకు కుర్రకారు మంత్రముగ్ధులవుతున్నారు. ఫరియా ఫొటోలకు లైక్స్, కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు.
తొలిచిత్రంతోనే అదిరిపోయే హిట్ అందుకున్న ఫరియా అబ్దుల్లాకు వరుసపెట్టి ఆఫర్లు వస్తున్నాయి. తెలుగుతో పాటు అటు తమిళంలోనూ అవకాశాలు అందుకుంటోంది. ‘జాతిరత్నాలు’ తర్వాత ‘మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిసింది. అంతేకాకుండా గ్లామర్ విందు చేస్తూ స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తోంది.
కింగ్ నాగార్జున నటించిన ‘బంగార్రాజు’ చిత్రంలో స్పెషల్ నెంబర్ లో అందాలు ఆరబోసి కుర్రకారును ఉర్రూతలూగించింది. గ్లామర్ స్టెప్పులతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది. మరోవైపు లీడ్ రోల్స్ లోనూ అవకాశాలను అందుకుంటోంది. అంతేకాకుండా ఇతర భాషల చిత్రాల నుంచి కూడా చిట్టికి ఆఫర్లు వస్తున్నాయి.
బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్న ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటించిన ‘రావణాసుర’ (Ravanasura)లో మరో హీరోయిన్ గా ఎంపికైంది. అదీగాక ‘వల్లి మయిల్’ అనే మలయాళ చిత్రంలోనూ నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఫన్ ఫుల్ ఫిల్మ్ ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్’(Like Share Subscribe)లోనూ కీలక పాత్రలో నటించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్స్ లోనూ ఫరియా చురుకుగా పాల్గొంటుండటం విశేషం.