MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీదివ్య, రీతు వర్మ, కలర్స్ స్వాతి, బిందుమాధవి... వీరిబాటలోనే జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్ధుల్లా,

శ్రీదివ్య, రీతు వర్మ, కలర్స్ స్వాతి, బిందుమాధవి... వీరిబాటలోనే జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్ధుల్లా,

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లకు చోటు లేదు. ఈ విషయం అందరికి తెలిసిందే.. చాలా మంది యంగ్ హీరోయిన్లు పక్క ఇండస్ట్రీలవకు వలస వెళ్తున్నారు. ఇక అందరిలాగే జాతిరత్నాలు హీరోయిన్ కూడా పక్క ఇండస్ట్రీ వైపు చూస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : May 14 2022, 02:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లకు పెద్దగా అవకాశాలు లేవు, రావు. ఎంత ప్రయత్నం చేసినా టాలీవుడ్ లో టాలీవుడ్ హీరోయిన్ సెట్ అవ్వరు అనేది అందరికి తెలిసిన నిజమే. ఇక చాలామంది తెలుగు హీరోయిన్లు.. పక్క ఇండస్ట్రీలకు వలస వెళ్లి అక్కడ రాణిస్తున్నారు. ప్రస్తుతం జాతిరత్నాలు బ్యూటీ ఫరియా కూడా అదే బాటపడుతున్నట్టు టాక్. 

26

తెలుగు లో హీరోయిన్లు గా ప్రయత్నం చేసి.. శ్రీదివ్య, కలర్స్ స్వాతి,  బిందుమాధవి లాంటి హీరోయిన్లు.. తెలుగువారై అయినా.. ఇక్కడ ఆధరణ లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళి పోయారు. ఇక ఇప్పటికీ అదే పరిస్థితి కోనసాగుతోంది టాలీవుడ్ లో. జాతిరత్నాలు సినిమాతో హిట్ కొట్టిన ఫరియా అబ్ధుల్లా కూడా టాలీవుడ్ లో ఛాన్స్ లు లేక కోలీవుడ్ గుమ్మం తొక్క బోతోంది. 

36

బిచ్చగాడు సినిమాతో తెలుగు, తమిళ ఆడియన్స్ ను అలరించాడు హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ విజ‌య్ ఆంటోనీ.  ఈ మ‌ల్టీ టాలెంటెడ్ యాక్టర్ కన్ను టాలీవుడ్ అప్ కమింగ్ హీరోయిన్ ఫరియా మీద పడింది. తాను తెరకెక్కిస్తున్న పీడియాటికల్ డ్రామాలో  ఫరియాను హీరోయిన్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది.  `            
 

46

జాతిర‌త్నాలు సినిమాతో ఓవ‌ర్‌నైట్  పాపులారిటీ సంపాధించుకుంది హైద‌రాబాదీ ముద్దుగుమ్మ ఫ‌రియా అబ్దుల్లా కాని  ఆ త‌ర్వాత ఆమెకు సినిమాలు మళ్ళీ కలిసి రాలేదు.  మ‌ళ్లీ ఆ స్థాయి హిట్టు అందుకోలేదు. ప్ర‌స్తుతం సుధీర్ వర్మ  డైరెక్ష‌న్‌ లో ర‌వితేజ హీరోగా రూపొందుతున్న రావ‌ణాసుర లో ఐదుగురు హీరోయిన్లలో ఒక  హీరోయిన్ గా న‌టిస్తోంది ఫరియా. 
 

56

ఇక ఈ  బ్యూటీ విజ‌య్ ఆంటోనీతో జతకట్టబోతోన్నట్టు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్  ఫరియా కొట్టేసిందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. 80ల‌లో పీరియాడిక్ డ్రామా బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమా ఐదు భాష‌ల్లో రిలీజ్ కాబోతోంది. 

66

ఇక ఈ ప్రాజెక్టు షూటింగ్ మే లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు త్వరలో అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. విజ‌య్ ఆంటోనీ సినిమాలంటే బాక్సాపీస్ దగ్గర మంచి క్రేజ్ ఉంటుంది. ఎలాగు టాలీవుడ్ లో అవకాశాలు లేకపోవడంతో.. ఫరియా అబ్దుల్లా.. కోలీవుడ్ లో అయినా సెటిల్ అవుతుందోలేదో అని ఆడియన్స్ గుసగుసలాడుకుంటున్నారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rishab Shetty: కాంతార టు జై హనుమాన్.. రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ ఏంటి?
Recommended image2
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image3
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved