గాడ్ ఫాదర్.. తలలు బాదుకుంటున్న ఫ్యాన్స్.. పవన్ ని ఒప్పించి ఉంటే థియేటర్ పైకప్పులు మిగిలుండేవా ?
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రిలీజ్ కి సర్వం సిద్ధం అయింది. ఆచార్య డిజాస్టర్ ఎఫెక్ట్ తో గాడ్ ఫాదర్ మూవీపై బిగినింగ్ లో బజ్ క్రియేట్ కాలేదు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రిలీజ్ కి సర్వం సిద్ధం అయింది. ఆచార్య డిజాస్టర్ ఎఫెక్ట్ తో గాడ్ ఫాదర్ మూవీపై బిగినింగ్ లో బజ్ క్రియేట్ కాలేదు. కానీ ప్రమోషన్స్ జోరు పెరిగే కొద్దీ హైప్ మొదలయింది. బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ తో మెగాస్టర్ మూవీకి కావలసిన హైప్ వచ్చేసింది అనే చెప్పాలి.
చిరంజీవి స్టైల్, యాక్షన్ తో మిక్స్ చేసిన పర్ఫెక్ట్ పొలిటికల్ థ్రిల్లర్ గా గాడ్ ఫాదర్ రెడీ అయింది. అయితే ఈ చిత్రంలో ఒక అంశం మాత్రం మెగా ఫ్యాన్స్ ని పదేపదే ఆలోచనలో పడేసే విధంగా ఉంది. పాన్ ఇండియా అప్పీల్ కోసం ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ని గెస్ట్ రోల్ లో నటింపజేశారు.
అయితే సల్మాన్ ఖాన్ కాకుండా పవన్ కళ్యాణ్ నటించి ఉంటే ఎలా ఉండేది అనే చర్చ జరుగుతోంది. ట్రైలర్ చివర్లో చిరంజీవి, సల్మాన్ మధ్య ఒక షాట్ ఉంది. చిరంజీవి చేతులు వెనుకాల పెట్టుకుని ధీమాగా వస్తుంటే.. ముందు ఉన్న సల్మాన్ ఖాన్ అడ్డు వస్తున్న విలన్స్ ని కొట్టి పారేస్తుంటాడు. నోట్లో కత్తి పట్టుకుని సల్మాన్ ఖాన్ మాస్ యాటిట్యూడ్ తో వస్తుండడం క్రేజీగా ఉంది.
ఈ షాట్ కోసం అయినా సల్మాన్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ నటించి ఉండాల్సింది అని ఫ్యాన్స్ అంటున్నారు. అసలు పవన్ ని ఎలా మిస్ అయ్యారు అంటూ తలలు బాదుకుంటారు. ఇలాంటి సీన్స్ పవన్ చిరంజీవి మధ్య రెండు పడితే చాలు. వాటి కోసం అయినా అభిమానులు థియేటర్స్ కి రిపీట్ గా ఎగబడి ఉండేవాళ్ళు అని అంటున్నారు.
కనీసం చిరంజీవి అయినా రంగంలోకి దిగి పవన్ ని ఒప్పించి ఉండాల్సింది. అన్నయ్య అడిగితే తమ్ముడు ఆ మాత్రం చేయలేడా ? పవన్ కళ్యాణ్ వెనుక చిరంజీవి అలా నడిచి వస్తుంటే.. థియేటర్స్ టాప్ పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు అనేది మెగా ఫ్యాన్స్ అభిప్రాయం.
కేవలం హిందీ మార్కెట్ కోసం మాత్రమే సల్మాన్ ఖాన్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా సల్మాన్ ఖాన్ యాక్షన్ బ్లాక్స్ లో కనిపిస్తున్నారు. సత్యదేవ్, నయనతార, సునీల్, బ్రహ్మాజీ, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు.