- Home
- Entertainment
- నయనతారకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశారు.. ఇంకెప్పుడు బయటపెడతారు, మండిపడుతున్న ఫ్యాన్స్ ?
నయనతారకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశారు.. ఇంకెప్పుడు బయటపెడతారు, మండిపడుతున్న ఫ్యాన్స్ ?
సౌత్ లో ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ నయనతార హాట్ టాపిక్ గా మారింది. నయనతార, విగ్నేష్ శివన్ దంపతులు సరోగసి విధానం ద్వారా పిల్లలని పొందారు.

సౌత్ లో ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ నయనతార హాట్ టాపిక్ గా మారింది. నయనతార, విగ్నేష్ శివన్ దంపతులు సరోగసి విధానం ద్వారా పిల్లలని పొందారు. నాలుగు నెలల క్రితం నయనతార, విగ్నేష్ శివన్ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్ళికి ముందు సహజీవనం చేసిన వీరిద్దరూ ఎట్టకేలకు మహాబలిపురంలో జరిగిన వివాహ వేడుకలో దంపతులయ్యారు.
పెళ్ళై నెలలు కూడానా గడవకముందే నయన్ , విగ్నేష్ జంట ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ప్రియాంక చోప్రా, మంచు లక్ష్మి, శిల్పా శెట్టి, కరణ్ జోహార్ లాంటి సెలెబ్రిటీల బాటలో పయనిస్తూ నయనతార కూడా సరోగసి విధానం ఎంచుకుంది. కానీ నయనతార క్రేజీ సెలెబ్రిటీ కావడంతో ఈ వ్యవహారం కాస్త వివాదం అయ్యింది.
నయనతార సరోగసిని ఎంపిక చేసుకోవడంపై కొందరు సెలెబ్రిటీలు విమర్సలు గుప్పిస్తున్నారు. ఇది పక్కన పెడితే ఒక విషయంలో నయనతార అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. నయనతారకి వివాహం జరిగి నాలుగు నెలలు పూర్తవుతోంది. ఆమెకి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. కానీ ఇంతవరకు నయన్ విగ్నేష్ పెళ్లి వీడియో మాత్రం రిలీజ్ కాలేదు.
రెండు నెలల క్రితం నెట్ ఫ్లిక్స్ సంస్థ నయనతార పెళ్లి వీడియోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. కానీ ఇంతవరకు పూర్తి వీడియో టెలికాస్ట్ చేయలేదు. ఆ మధ్యన నయనతార, నెట్ ఫ్లిక్స్ సంస్థ మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం నెలకొన్నట్లు ప్రచారం జరిగింది.
భారీ మొత్తం వెచ్చించి నెట్ ఫ్లిక్స్ సంస్థ నయన్ పెళ్లి వీడియో హక్కులని సొంతం చేసుకుంది. కానీ నయన్ పెళ్లి ఫోటోలు బయటకి రావడంతో నెట్ ఫ్లిక్స్ డీల్ రద్దు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ చివరకు తామే వీడియో రిలీజ్ చేయబోతున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రోమోతో క్లారిటీ ఇచ్చింది.
కానీ ఇంతవరకు మ్యారేజ్ వీడియో టెలికాస్ట్ కాకపోవడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇలా ప్రశ్నిస్తున్నారు. నయన్ కి ఇద్దరు పిల్లలు కూడానా పుట్టేశారు. పెళ్లి వీడియో అసలు రిలీజ్ చేస్తారా చేయరా ? అని ప్రశ్నిస్తున్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ సంస్థ మ్యారేజ్ వీడియోలో నయనతార లైఫ్ కి సంబంధించిన విషయాలని కూడా డాక్యుమెంటరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆలస్యం అవుతున్నట్లు టాక్. ఇప్పుడు పిల్లలు కూడా పుట్టేసారు కాబట్టి ఆ వీడియోలో వారిని ఇంక్లూడ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.