దారుణంగా బన్నీ, చరణ్ ఫ్యాన్స్ మధ్య వార్.. భార్యలని లాగడం అవసరమా ?
టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ తరచుగా జరుగుతూ ఉంటాయి. మా హీరో తోపంటే.. మా హీరోనే తోపు అని సోషల్ మీడియాలో అభిమానులు హంగామా చేస్తుంటారు. రాను రాను ఈ పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది.

టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ తరచుగా జరుగుతూ ఉంటాయి. మా హీరో తోపంటే.. మా హీరోనే తోపు అని సోషల్ మీడియాలో అభిమానులు హంగామా చేస్తుంటారు. రాను రాను ఈ పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. హీరోల వరకే ఉండే ఈ ట్రెండ్ ఇప్పుడు వారి కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందిగా మారే పరిస్థితి తలెత్తింది.
అల్లు అర్జున్ అభిమానులు రాంచరణ్ ని ట్రోల్ చేస్తూ ఓ హ్యాష్ టాగ్ క్రియేట్ చేశారు. #GhantaLeniVarasudu తో అల్లు అర్జున్ అభిమానులు ట్రోలింగ్ మొదలు పెట్టారు. అంతే కాదు ఇందులోకి రాంచరణ్ సతీమణి ఉపాసనిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ట్రోలింగ్ కి పాల్పడ్డారు.
దీనితో అల్లు అర్జున్ అభిమానుల తరహాలోనే రాంచరణ్ అభిమానులు కూడా అసభ్యకరమైన ట్రోలింగ్ తో విరుచుకుపడ్డారు. మార్ఫింగ్ ఫోటోలు, మీమ్స్ తో ఇరు వర్గాలు దారుణమైన ట్రోలింగ్ చేసుకున్నాయి. బన్నీ ఫాన్స్ చరణ్ సతీమణిని ఇన్వాల్వ్ చేయగా.. చరణ్ ఫ్యాన్స్ బన్నీ సతీమణి స్నేహని ఇన్వాల్వ్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. #ThammudiGhantaPhalAAm అనే హ్యాష్ టాగ్ తో చరణ్ ఫ్యాన్స్ ట్రోలింగ్ కి దిగారు.
ఈ ట్రోలింగ్ సగటు ప్రేక్షకులకు వెగటు పుట్టించేలా ఉంది. టాలీవుడ్ లో ఈ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోంది. ఇటీవల పవన్ ఫ్యాన్స్ మహేష్ సతీమణి నమ్రతని ట్రోల్ చేసారు. ఇతర హీరోల ఫాన్స్ తరచూ పవన్ సతీమణి అన్నా లెజినోవాని ట్రోల్ చేయడం చూస్తూనే ఉన్నాం.
ఇంత దారుణమైన ట్రోలింగ్స్ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో అర్థం కాని విధంగా ఉంది. ఈ ట్రోలింగ్ పై నెటిజన్లు మండి పడుతున్నారు. ఫ్యాన్ వార్స్ పేరుతో తమ హీరోలని రచ్చకీడ్చేది కాక.. వాళ్ళ కుటుంబ సభ్యులని కూడా ఇన్వాల్వ్ చేయడం, వారి భార్యలని ట్రోలింగ్ చేయడం అవసరమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
గతంలో ఫ్యాన్ వార్స్ హీరోల సినిమాలు, ఆ రికార్డుల వరకే పరిమితం అయ్యేవి. కానీ ఇప్పుడు వ్యక్తిగత విషయాలతో రోత పుట్టిస్తున్నారు. చరణ్, బన్నీ ఫ్యాన్స్ మధ్య ఈ వార్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.