MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డింపుల్ హయాతీకి గుడి కడతానన్న అభిమాని... మైండ్ బ్లాక్ చేసిన ఆమె ఆన్సర్!

డింపుల్ హయాతీకి గుడి కడతానన్న అభిమాని... మైండ్ బ్లాక్ చేసిన ఆమె ఆన్సర్!

హీరోయిన్ డింపుల్ హయాతీకి ఓ అభిమాని గుడి కడతాను అన్నాడు. దీనికి ఆమె దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : May 03 2023, 02:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

జయాపజయాలతో సంబంధం లేకుండా హీరోయిన్ డింపుల్ హయాతీకి యూత్ లో భారీ క్రేజ్ ఉంది. ఆమె గ్లామర్ అంటే పడిచచ్చే కుర్రాళ్ళు ఎందరో ఉన్నారు. ఆమెపై జనాలకు ఉన్న అభిమానం ఏపాటితో తెలిపేందుకు ఇదొక ఉదాహరణ. డింపుల్ హయాతీ లేటెస్ట్ మూవీ రామబాణం. ఈ మూవీ మే 5న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆమె అభిమానులతో  వేదికగా ముచ్చటించారు. ఓ అభిమాని మీకు గుడి కట్టాలి అనుకుంటున్నాను. ఇటుకలతో కట్టాలా లేక పాలరాయితో కట్టాలా? అని ప్రశ్నించాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Dimple Hayathi

Dimple Hayathi

ఈ ప్రశ్నకు డింపుల్ హయాతీ ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు. నాకు గుడి కట్టే ఆలోచన ఉంటే బంగారంతో గుడి కట్టాలని ఆమె సమాధానం చెప్పారు. దాంతో సదరు అభిమాని మైండ్ బ్లాక్ అయ్యింది. సాధారణంగా తమిళనాడులో హీరోయిన్స్ కి గుడులు కడతారు. ఆ కల్చర్ ఏపీకి కూడా పాకుతుంది. ఇటీవల బాపట్ల జిల్లాలో సందీప్ అనే వ్యక్తి తన ఇంటి ప్రాంగణంలో సమంతకు గుడి కట్టించారు. సెక్సీ బ్యూటీ డింపుల్ హయాతీకి కూడా ఒక అభిమాని గుడి కడతానని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

35

రామబాణం మూవీలో గోపీచంద్ హీరోగా నటిస్తున్నారు. శ్రీవాస్ దర్శకుడిగా ఉన్నారు. జగపతిబాబు కీలక రోల్ చేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై పరిశ్రమలో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం విజయం డింపుల్ హయాతీతో పాటు హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ లకు చాలా అవసరం. 

45

దర్శకుడు శ్రీవాస్ రెండు ఆడిషన్స్ చేశాకే నమ్మి ఆఫర్ ఇచ్చినట్లు వెల్లడించారు. రామబాణం మూవీ నేను యూట్యూబ్ బ్లాగర్ భైరవి రోల్ చేశాను. సోషల్ మీడియా మీద నాకు పెద్దగా అవగాహన లేదు. అందుకే భైరవి పాత్ర ఛాలెంజింగ్ అనిపించింది. ఖిలాడి మూవీలో నేను గ్లామరస్ రోల్ చేశాను. ఆ సినిమా చూసి నేను భైరవి పాత్రకు సెట్ కానేమో అని దర్శకుడు శ్రీవాస్ సందేహం వ్యక్తం చేశారు. రెండుసార్లు ఆడిషన్ చేసిన తర్వాత నన్ను నమ్మి ఛాన్స్ ఇచ్చారని... ఆమె చెప్పుకొచ్చారు. 
 

55


ఇక పరిశ్రమకు వచ్చి ఐదేళ్లు అవుతున్నా ఇంకా బేబీ స్టెప్స్ వేస్తున్నానంటూ... డింపుల్ హయాతీ చెప్పుకొచ్చారు. 2017లో విడుదలైన గల్ఫ్ మూవీతో డింపుల్ హీరోయిన్ అయ్యారు. అనంతరం అభినేత్రి 2, గద్దలకొండ గణేష్ చిత్రాల్లో నటించారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Love and War: లవ్ అండ్ వార్ సెట్‌లో విషాదం.. భన్సాలీపై చట్టపరమైన చర్యలకు డిమాండ్
Recommended image2
Samantha Pregnancy: సారీ, సినిమాల నుంచి మళ్ళీ బ్రేక్ తీసుకుంటున్నా.. అఫీషియల్ గా గుడ్ న్యూస్ చెప్పిన సమంత
Recommended image3
Samantha: సమంతపై పోటీకి దిగుతున్న మహేష్, మంచు విష్ణు, తేజ సజ్జా.. భయపడాల్సిన అవసరమే లేదా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved