- Home
- Entertainment
- కథ వినకుండా అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రానికి ఒప్పుకున్నాడా..సుకుమార్ పై స్టార్ హీరో భార్య షాకింగ్ కామెంట్స్
కథ వినకుండా అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రానికి ఒప్పుకున్నాడా..సుకుమార్ పై స్టార్ హీరో భార్య షాకింగ్ కామెంట్స్
అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 కోసం పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది.

అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 కోసం పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. అల్లు అర్జున్ మ్యానరిజమ్స్, డ్యాన్స్ ని నార్త్ ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం పుష్ప 2 తెరకెక్కుతోంది. అయితే గత కొన్ని రోజులుగా పుష్ప 2 గురించి అనేక అనుమానాలు, రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ గడ్డం తీసేసి ఫారెన్ వెళ్లారు. దీనితో షూటింగ్ పరిస్థితి ఏంటి ? బన్నీ, సుక్కు మధ్య విభేదాలు మొదలయ్యాయా అనే ప్రచారం జరుగుతోంది. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి విభేదాలు లేవని అంటున్నారు.
ఈ నేపథ్యంలో పుష్ప మొదటి భాగం గురించి అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో సుకుమార్, అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ ముగ్గురూ పాల్గొన్నారు. సుకుమార్ పుష్ప చిత్రంలో విలన్ గా చేసిన ఫహద్ ఫాజిల్ గురించి మాట్లాడుతూ.. ఆ పాత్ర కోసం చాలా మందిని అనుకున్నాం. చివరికి ఫహద్ ని ఫిక్స్ అయ్యాం. అల్లు అర్జున్ కి చెబితే నువ్వు వెంటనే వెళ్లి ఫహద్ ని కలవు అని చెప్పారు.
ఫహద్ ని కలవగానే స్టోరీ వినకుండా ఒకే మీ సినిమా నేను చేస్తున్నా అని చెప్పేశాడు. నేను షాక్ అయ్యానని సుకుమార్ చెప్పారు. కథ వినకుండా ఎందుకు ఒకే చేశానో ఆ తర్వాత చెప్పారు. ఫహద్ ఫాజిల్ భార్య హీరోయిన్ నజ్రియా రంగస్థలం మూవీ చూశారట. అప్పటి నుంచి ఆమె సుకుమార్ కి అభిమాని అయిపోయారట.
సుకుమార్ సర్ వస్తే నువ్వు వెంటనే ఒకే చెప్పు. కథ ఏంటి అని అడగకు.. ఇంకేమి ప్రశ్నలు కూడా అడగొద్దు అని చెప్పిందట. నా భార్య ఇలా చెప్పింది మీ గురించి అని ఫహద్ సుకుమార్ తో చెప్పారట. వెంటనే పక్కనే ఉన్న బన్నీ మాట్లాడుతూ.. నువ్వు నన్ను కూడా పొగడాలి.. ఎందుకంటే నాకు కూడా నువ్వు కథ చెప్పలేదు అని బన్నీ జోక్ చేశాడు. అది నీ ప్రేమ డార్లింగ్ అంటూ సుకుమార్ తిరిగి స్పందించారు.
ఫహద్ కి కథ ఎలా ఉంటుందో తెలియాలి కాబట్టి పుష్ప కథ చెప్పానని సుకుమార్ అన్నారు. పుష్ప మొదటి భాగంలో ఫహద్ ఫాజిల్ సెకండ్ హాఫ్ లో వస్తారు. కానీ పుష్ప 2లో ప్రధానంగా బన్నీ, ఫహద్ మధ్యే పోరాటం ఉండబోతోంది.