- Home
- Entertainment
- ట్రెండీ గౌన్ లో మైమరిపిస్తున్న ‘ఎఫ్3’బ్యూటీ.. క్యాట్ వాక్ తో కవ్విస్తున్న మెహ్రీన్ ఫిర్జాదా..
ట్రెండీ గౌన్ లో మైమరిపిస్తున్న ‘ఎఫ్3’బ్యూటీ.. క్యాట్ వాక్ తో కవ్విస్తున్న మెహ్రీన్ ఫిర్జాదా..
యంగ్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా (Mehreen Pirzada) ‘ఎఫ్3’ మూవీ ప్రమోషన్స్ కోసం మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. ట్రెండీ వేర్స్ ధరిస్తూ నెటిజన్లను తనవైపు ఆకర్షిస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

టాలీవుడ్ హీరోయిన్, యంగ్ బ్యూటీ మెహరీన్ ప్రస్తుతం తెలుగు హీరోయిన్ గా వరుస ఆఫర్లను దక్కించుకుంటోంది. మరోవైపు ఇతర భాషల్లోనూ నటిస్తూ తన పాపులారిటీని పుంచుకుంటోంది. చివరిగా ఈ బ్యూటీ ‘మంచి రోజులొచ్చాయి’ చిత్రంలో ‘పద్దు’ పాత్రతో ఆడియెన్స్ ను అలరించింది.
తాజాగా తను నటించిన కామెడీ మరియు ఫ్యామిటీ ఎంటర్ టైనర్ ‘ఎఫ్3’ మూవీ రిలీజ్ కానుంది. ఎఫ్2కు సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది. మెహ్రీన్ F2 చిత్రంతోనే టాలీవుడ్ లో మంచి సక్సెస్ ను అందుకుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘హనీ’ పాత్రలో నటించింది.
ఎఫ్2లో మెహ్రీన్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. అల్లరి తనం చూపించడంతో పాటు ఈ బ్యూటీ అందాలను ఆరబోస్తూ ఆడియెన్స్ ను కట్టిపడేసింది. తమన్నాకు ధీటుగా మెహ్రీన్ నటన, గ్లామర్ ఉండటంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుతం ఎఫ్3లోనూ ఈ బ్యూటీ నటించింది. ఈ మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ జోరుగా కొనసాగిస్తోంది. దీంతో మెహ్రీన్ కూడా తన వంతుగా చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తోంది.
తాజాగా ట్రెండీ వేర్ ధరించిన ఈ బ్యూటీ వయ్యారంగా నడుస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ పిక్స్ ను ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన అభిమానులో పంచుకుంది. ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఆమె అందానికి మంత్రముగ్ధులైన అభిమానులు పిక్స్ ను వైరల్ చేస్తున్నారు.
తన పోస్ట్ చేసిన పిక్స్ లో ట్రెండీ గౌన్ లో మెహ్రీన్ మెరిసిపోతోంది. గ్రాస్ పై క్యాట్ వాక్ చేస్తూ మతిపోయేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. స్లీవ్ లెస్ గౌన్ ధరించిన మెహ్రీన్ గ్లామర్ షోతో చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఆమె గ్లామర్ కు పిక్స్ ను చూసిన హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కూడా లైక్ చేయకుండా ఉండలేకపోయింది.