- Home
- Entertainment
- ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ 400ల ఎపిసోడ్స్ పూర్తి.. షోపై ఆర్టిస్ట్ ల ఫీలింగ్ ఇదే.. గెటప్ శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు!
‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ 400ల ఎపిసోడ్స్ పూర్తి.. షోపై ఆర్టిస్ట్ ల ఫీలింగ్ ఇదే.. గెటప్ శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు!
పాపులర్ కామెడీ షో ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ తాజాగా 400వ ఎపిసోడ్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించిన తాజాగా ప్రోమో విడుదలైంది. ఈ సందర్భంగా షోపై ఒక్కో ఆర్టిస్ట్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.

బుల్లితెర ఆడియెన్స్ ను పొట్టచెక్కలయ్యేలా నవ్వించే ఏకైక కామెడీ షో ‘జబర్దస్త్’. మరింత ఫన్ డోస్ పెంచుతూ ఆ వెంటనే ప్రారంభమైంది ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ (Extra Jabardasth). దాదాపుగా తొమ్మిదేండ్లుగా ఈ షో విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. తక్కువ సమయంలోనే యువతకు, బుల్లితెర ప్రేక్షకులకు ఈ షో ఎంతగానో దగ్గరైంది.
సక్సెస్ రేటింగ్ తో దూసుకుపోతున్న పాపులర్ కామెడీ షో ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ తాజాగా 400ల ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టీం లీడర్లు, ఆర్టిస్టులు మరింత జోష్ గా వేదికపై పంచులు పేల్చారు. ఆసక్తికరమైన స్కిట్లతో, హిలేరియస్ కామెడీతో ఎప్పటిలాగే కడుపుబ్బా నవ్వించారు.
మల్లెమాల ఆధర్యంలో ఈవీలో ప్రసారం అవుతున్న ఈషోకు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ప్రొమో కమెడియన్స్ పంచులు, కామెడీ టైమింగ్ తో ఆద్యంతం ఆకట్టుకుంది. మరోవైపు 400ల ఎపిసోడ్ లు పూర్తికావడంతో షోపై ఆర్టిస్టులు తమ ఓపినీయన్ కూడా రివీల్ చేయడం ఆసక్తికరంగా మారింది.
ఎక్స్ ట్రా జబర్దస్త్ లో టీం లీడర్లుగా కొనసాగుతున్న రాకింగ్ రాకేష్, కెవ్వు కార్తిక్, బుల్లెట్ భాస్కర్, గెటప్ శ్రీను, రోహిణి నాని పో పట్ల తమకున్న అభిమానాన్ని వ్యక్త పరిచారు. రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.. జబర్దస్త్ లేదంటే మా ఆర్టిస్ట్ లకు మరో ఆప్షన్ లేదంటూ అభిప్రాయపడ్డారు. కెవ్వు కార్తిక్ మాట్లాడుతూ.. జబర్దస్త్ నాకు అమ్మ తర్వాత అమ్మలాంటిదని ఎమోషనల్ అయ్యారు.
అధేవిధంగా బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ.. 12 కోట్ల మందిలో 12 మందికి జబర్దస్త్ లో అవకాశం లభించింది. అందులో నేనొక్కడిని అయినందుకు హ్యాపీగా ఫీలవుతున్నానని చెప్పారు. జబర్దస్త్ స్టేజ్ వల్ల తను ఓ స్టేజీలో ఉన్నట్టు రోహిణి నాని సంతోషం వ్యక్తం చేసింది.
ఇక గెటప్ శ్రీను స్పందిస్తూ... ‘మొదట్లో జబర్దస్త్ అనేది మాకు అవకాశం.. ఇప్పుడు బాధ్యతగా మారింది’ అంటూ ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశారు. జబర్దస్త్ నుంచి వందలాది ఆర్టిస్టులు గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ విజయవంత కొనసాగుతుండటం విశేషం. ఈ క్రమంలో లేటెస్ట్ ప్రోమోలో ఆర్టిస్టులు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ మారుతున్నాయి.