'రాజా సాబ్' లో ఆ రీమిక్స్ సాంగ్, థియేటర్స్ దద్దరిల్లాలి
నవ్వించమే పనిగా ఉండే ఈ హారర్ కామెడీలో ఓ రీమిక్స్ సాంగ్ ఉంటే బాగుంటుందని మారుతి భావిస్తున్నారట.

కల్కి చిత్రం సూపర్ హిట్ అవటంతో ప్రభాస్ ఫ్యాన్స్ దృష్టి ఆయన నెక్ట్స్ రిలీజ్ రాజా సాబ్ పై పడింది. . మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఓ రకంగా భాధ్యత ఎక్కువైంది. ఎందుకంటే ఆ రేంజిలో బిజినెస్ అవుతుంది కాబట్టి. దాంతో ఈ సినిమాకు మరిన్ని హంగులు కలిపాలని మారుతి ఫిక్స్ అయ్యారట. థియేటర్స్ ఊగిపోయేలా కొన్ని కామెడీ ఎపిసోడ్స్ ఉన్నాయని నమ్మకంగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఓ రీమిక్స్ సాంగ్ కూడా కలపాలని ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ ఎబ్రాడ్ లో హాలీడే మూడ్ లో ఉన్నారు. ఈ నెలాఖరుకి వెనక్కి వచ్చి మారుతి సినిమా షూట్ ఫినిష్ చేస్తారు. షూటింగ్ మొత్తం ప్రబాస్ ఉండాల్సిన పనిలేదట. ఇప్పటికే కొద్ది కాలం ఈ సినిమాకు పనిచేసారు. మరికొద్ది రోజులు చేస్తే సరిపోతుంది. మొత్తం మీద 50 రోజులు ఈ సినిమా కోసం ప్రబాస్ కేటాయించారు. పూర్తి స్దాయి ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.
నవ్వించమే పనిగా ఉండే ఈ హారర్ కామెడీలో ఓ రీమిక్స్ సాంగ్ ఉంటే బాగుంటుందని మారుతి భావిస్తున్నారట. ప్రభాస్ సినిమాలోదే ఓ పాట తీసుకుందామనుకున్నారు కానీ ఆ తర్వాత రకరకాల కారణాలతో వద్దనుకున్నారుట. ఇప్పుడు 1980 లలో వచ్చిన ఓ పాత హిందీ పాటను రీమిక్స్ చేస్తే బాగుంటుందని మారుతి భావిస్తున్నారట. ఆ మేరకు సంగీత దర్శకుడు తమన్ తో చర్చలు జరుపుతున్నారు.
రీమిక్స్ కోసం హిందీ వింటేజ్ సాంగ్ రెండు మూడు అనుకున్నారట. వాటిలో ఒకటి ఫైనలైజ్ చేసి మందుకు వెళ్తారట.సెకండాఫ్ లో ముగ్గురు హీరోయిన్స్ తో ఓ స్పెషల్ సాంగ్ లా ఈ రీమిక్స్ సాంగ్ రాబోతోందిట. ఇక ఆ సూపర్ హిట్ సాంగ్ రైట్స్ తీసుకున్నాక అప్పుడు అఫీషియల్ గా చెప్పే అవకాసం ఉంది. ఏదైమైనా రీమిక్స్ సాంగ్ సరైంది పడితే థియేటర్స్ లో మంచి ఊపు వస్తుంది. ఆ టెక్నికే మారుతి చెయ్యబోతున్నారు.
మారుతి దర్శకత్వంలో రాబోతోన్న రాజా సాబ్‌లో ప్రభాస్ వింటెజ్ లుక్ తో అదరకొడుతున్నా. డార్లింగ్ ప్రభాస్ వింటేజ్ లుక్ చూసాక, కామెడీ టైమింగ్ మారుతి సరిగ్గా ప్రజెంట్ చేస్తాడనే నమ్మకం అభిమానుల్లో కలిగింది. ఈ మూవీ మీద మొదలైనప్పుడు ఉన్నంత నెగెటివిటీ అయితే కనిపించడం లేదు. రాజా సాబ్ టైటిల్, గ్లింప్స్ బాగానే ఆకట్టుకుంది. లుంగీతో ప్రభాస్‌ను చూపించి అభిమానుల్ని ఆకట్టుకుంటున్నారు. అలాగే కల్కిలోనూ ప్రభాస్ కామెడీతో అదరకొట్టారు.
ఇక మొదట ఈ సినిమాను తెలుగులో మాత్రమే విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ప్రభాస్ పాన్ వరల్డ్ లెవల్లో ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా టైటిల్‌ను ఛేంజ్ చేశారు. మొదట ‘రాజా డీలక్స్’ అని ఉన్న ఈ టైటిల్‌ను రాజా సాబ్ అని మార్చారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో మెరవనున్నారు.
రాజా సాబ్ రిలీజ్ విషయానికి వస్తే...సలార్ 2'ను ఈ ఏడాది క్రిస్మస్ సీజన్ రిలీజ్ చేస్తే... ఆ వెంటనే సంక్రాంతికి 'రాజా సాబ్' రిలీజ్ చేయడం కష్టం. కానీ రాజాసాబ్ ముందు వచ్చే అవకాసం ఉందంటున్నారు. అలాగే చిరంజీవి హీరోగా ప్రభాస్ కజిన్ ప్రమోద్ కూడా ఓ నిర్మాతగా చేస్తున్న 'విశ్వంభర'ను సంక్రాంతి బరిలో విడుదల చేయడానికి రెడీ చేస్తున్నారు. దాంతో 'రాజా సాబ్' ముందు రాకపోతే సంక్రాంతి వెళ్లాక వస్తుంది.
Actor Prabhas
ఇక ‘కల్కి’ రిలీజ్‌కు ముందే ప్రభాస్ ఇటలీ వెళ్లిపోయాడు. ఈనెలాఖరులోగా ఆయన ఇండియా తిరిగొస్తారు. వచ్చాక నేరుగా ‘రాజాసాబ్’ షూటింగ్ లో పాలు పంచుకొంటారు. ఈ సందర్భంగానే ‘రాజాసాబ్’ గ్లింప్స్ విడుదల చేస్తే బాగుంటుందని చిత్రబృందం ఆలోచన.
ఇప్పటి వరకూ ప్రభాస్ లేని సన్నివేశాలన్ని మారుతి పూర్తి చేసేశాడని, ప్రభాస్ తో ముడిపడిన సీన్లే బాకీ ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఆయన 4 పాటల్ని రెడీ చేసేశారు. అందులో ‘రాజాసాబ్’ టైటిట్ ట్రాక్ కూడా ఉంది. ఈ గ్లింప్స్‌లో ఈ టైటిల్ ట్రాక్ వినిపించబోతోంది.
సంక్రాంతికి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అప్పటి నుంచీ ఎలాంటి అప్‌డేట్ లేదు. ఒక్క పాట కూడా బయటకు రాలేదు. అయితే ఇప్పుడు చిత్ర టీమ్ ఓ గ్లింప్స్‌ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ప్రభాస్ మాస్ ఎంట్రీతో ఈ లుక్ డిజైన్ చేశారని సమాచారం. ఇందులో ప్రభాస్ ఒక్కడే కనిపిస్తాడు. మిగిలిన పాత్రల ఎంట్రీ ఉండదని తెలుస్తోంది