కాషాయం కట్టిన మిస్ ఇండియా ... కుంభమేళాలో మెరిసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
ప్రయాగరాజ్ కుంభమేళాలో రాజకీయ ప్రముఖులే కాదు వ్యాపార, సినీ, క్రీడా ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. ఇలా తాజాగా ఓ బాలీవుడ్ నటి, మిస్ ఇండియా కాషాయ వస్త్రాల్లో కనిపించారు. ఆమె ఎవరో తెలుసా?

Esha Gupta
ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో ప్రముఖ నటి, ఒకప్పటి మిస్ ఇండియా ఈషా గుప్తా పాల్గొన్నారు. కాషాయ దుస్తులు ధరించి ప్రయాగరాజ్ మహాకుంభమేళా ప్రాంతంలో ప్రత్యక్షమయ్యారు ఈషా. గంగా, యమునా, సరస్వతి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Esha Gupta
ఈషా గుప్తా స్వయంగా ప్రయాగరాజ్ మహాకుంభ్ నుండి తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. కుంభమేళా ఏర్పాట్లను కొనియాడారు.
Esha Gupta
ఈషా గుప్తా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల్లో ఆమె కాషాయపు రంగు చీరలో స్నానం చేస్తున్నట్లు చూడవచ్చు. స్నానం తర్వాత గంగా మాతకు ప్రణామాలు అర్పించారు.
Esha Gupta
కొన్ని ఫోటోల్లో ఈషా మహా కుంభమేళాలో పాల్గొన్న కొందరు సాధువులను కలుస్తున్నట్లు కూడా చూడవచ్చు. గురువుల పాదాల వద్ద కూర్చుని కనిపించారు.
Esha Gupta
ఈషా గుప్తా తన ఒక ప్రకటనలో తాను కుంభమేళాకు నటిగా కాకుండా సనాతన ధర్మ అనుచరిగా వచ్చానని చెప్పారు. "నేను ఇక్కడికి సనాతన ధర్మ ప్రతినిధిగా, ఒక కూతురిగా, ఒక భారతీయురాలిగా వచ్చాను" అని అన్నారు.
Esha Gupta
ఈ సందర్భంగా ప్రజలను మహా కుంభమేళా కోసం ప్రయాగరాజ్ రావాలని ఈషా కోరారు. "ధర్మం కోసమైనా, పుణ్యఫలం కోసమైనా.. ఎందుకోసమైనా సరే తప్పకుండా రండి" అని అన్నారు.