- Home
- Entertainment
- తన సినిమా కోసం రూటు మార్చిన ఇషా గుప్తా.. చీరకట్టు అందాలతో ఆకట్టుకుంటున్న బోల్డ్ బ్యూటీ..
తన సినిమా కోసం రూటు మార్చిన ఇషా గుప్తా.. చీరకట్టు అందాలతో ఆకట్టుకుంటున్న బోల్డ్ బ్యూటీ..
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఎప్పుడూ ట్రెండీ వేర్ లో గ్లామర్ ధాటి చేస్తుండేది.. తాజాగా సంప్రదాయంగా చీరకట్టి అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది. తను నటించిన చిత్ర ప్రమోషన్స్ కోసం ఇలా రూటు మార్చి చీరకట్టు అందాలతో ఆకట్టుకుంటోంది.

బాలీవుడ్ నటి ఇషా గుప్తా (Esha Gupta) సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా గ్లామర్ ఒళకబోస్తోంది. తన అందచందాలను ఏమీ దాచుకోకుండా బయటపెడుతూ కుర్రాళ్ల హాట్ బీట్ పెంచేస్తుంది. ఎప్పుడూ గ్లామర్ పిక్స్ షేర్ చేసే ఇషా తాజాగా చీరలో దర్శనమిచ్చి సర్ ప్రైజ్ చేసింది.
బ్లూ శారీలో ఈ ముద్దుగుమ్మ మెరిసిపోతోంది. ఫుల్ స్లీవ్ జాకెట్ ధరించి ఇక గ్లామర్ షోకు నో అనేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఒకేసారి ఇషాలో ఇంతటి మార్పును చూసిన నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. సంప్రదాయ దుస్తుల్లోనూ ఇషా ఆకర్షణీయంగా కనిపిస్తున్నదంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇషా ఎప్పుడూ తన అభిమానులు సోషల్ మీడియాలో దగ్గరగానే ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ చీరకట్టిన ఫొటోలను పంచుకుంది. అయితే తను నటించిన వెబ్ సిరీస్ ‘ఆశ్రం’ సీజన్ 3 ప్రమోషన్స్ కోసం ఇలా చీరకట్టి అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇషా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది. గతంలో ‘రిజెక్ట్ ఎక్స్, నకాబ్’ వెబ్ సీరిస్ లలో ఆఫీసర్ గా కనిపించింది. ప్రస్తుతం ‘ఆశ్రం’లో నటించింది. ఈ సిరీస్ ప్రస్తుతం ఓటీటీ వేదిక ఎంఎక్స్ ప్లేయర్ లో విడుదలకు సిద్ధంగా ఉండగా, యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది.
అలాగే ప్రస్తుతం మరో రెండు హిందీ చిత్రాల్లోనూ నటిస్తోందీ బ్యూటీ. ‘దేశీ మ్యాజిక్’ మరియు ‘హేరా పేరీ’ చిత్రాల్లో కనిపించనుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లే కాకుండా గతేడాది ‘బూహ’ అనే మ్యూజిక్ వీడియో సాంగ్ లోనూ నటించి అలరించింది.
ఇషా గుప్తా తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయం అయ్యింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘వినయ విధేయ రామా’ చిత్రంలో చెర్రీతో గ్లామర్ స్టెప్పులేసి ఆడియెన్స్ ను కట్టిపడేసింది. అంతకు ముందు ‘వీడెవడు’ చిత్రంలోనూ మెరిసింది.