ఇమ్మానుయేల్ కి బ్రేకప్ చెప్పిన వర్ష..? విషయం చెపుతూ ఏడ్చేసిన జబర్ధస్త్ నటి.
బుల్లితెరపై క్రేజ్ ఉన్న జంటల్లో సుధీర్- రష్మీ తో పాటు ఇమ్మానుయేల్ - వర్ష కూడ ఉన్నారు. ఈ జంట స్కిట్ వస్తుందంటే చాలు నవ్వులే నవ్వులు. మరి ఈ రేంజ్ లో క్రేజ్ ఉన్న వీరు బ్రేకప్ చెప్పుకున్నట్టు తెలుస్తోంది. నిజం ఎంత..?
జబర్దస్త్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా తో బాగా పాపులర్ అయిన వారిలో వర్ష-ఇమ్మానుయేల్ జోడీ ఒకటి. జబర్థస్త్ కామెడీ షోలో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫార్ములా అంటే ఈ జంటల ఫార్ములానే. మొదట్లో.. సుధీర్ రష్మి మధ్య ఉన్నవి లేనివి పెట్టి.. రకరకాలుగా కంటెంట్ ను క్రియేట్ చేశారు. ఇక ఆతరువాత ఇమ్మానుయేల్ - వర్ష మధ్య కూడా ఇలాంటి ట్రాక్ నే నడిపించారు. అయితే ఇంది నిజమా.. లేక నిజంగానే వీరు రిలేషన్ లో ఉన్నారా అనేది వారికే తెలియాలి.
Also Read: బేబీ బంప్‌తో సమంత.. వైరల్ అవుతున్న ఫోటోస్.. షాకింగ్ ట్వీస్ట్ ఎంటంటే..?
కొంత మంది నిజం అంటారు.. కొంత మంది కాదు అంటారు. ఏది ఏమైనా.. ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతున్నారా లేదా అనేది ముఖ్యం. అయితే చాలా మంది ఆడియన్స్ వీరి లవ్ ట్రాక్ కోసమే జబర్దస్త్ ను చూశారంటే ఈ ఫార్ములా ఎంత సక్సెస్ అయ్యిందో అర్ధం అవుతుంది. అంతే కాదు ఈ జంటల పైత్యం ఎక్కడివరకూ వెళ్లిందంటే.. వీరు స్టేజ్ ఎక్కారంటే చాలు.. ఫీల్ గుడ్ ఆర్ఆర్ లు.. ఒక్కోసారి స్టేజ్ మీదనే పెళ్లిళ్ళు చేశారు.
Also Read: పుష్ప 3 లో రజినీకాంత్, సూపర్ స్టార్ పాత్రేంటో తెలిస్తే షాక్ అవుతారు..?
ఇక కొన్ని ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ కూడా పెట్టి.. అటు సుధీర్- రష్మీకి.. ఇటు ఇమ్మానుయేల్ - వర్షకు ఆన్ స్క్రీన్ పెళ్లి కూడా చేశారు. ఇక తెరపై వీరి కెమిస్ట్రీని చూసి వీరు నిజ జీవితంలో కూడా లవ్ లో ఉన్నట్లు కొంత మంది భావించారు. చాలామంది ఆడియెన్స్ అయితే, తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమే నని, అంతకు మించి ఏమీ లేదని ఇమ్మాన్యుయేల్, వర్ష పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. అయితే ఏమయ్యిందో ఏమో కాని.. వీరు వీరి ఫ్రెడ్ షిప్ కు కూడా బ్రేకప్ చెప్పుకున్నట్టు తెలుస్తోంది.
Also Read: ముగ్గరు అక్క చెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?
తాజాగా ఓ షోలో వీరిద్దరు కనిపించారు. వర్ష, ఇమ్మాన్యుయేల్. ఈ సందర్భంగా 2024 సంవత్సరం ఎలా గడిచిందో చెప్పారు. వర్ష మాత్రం ఈ ఏడాది తనకు అస్సలు బాలేదన్నారు. 2024 లాంటి ఏడాది ఇంకోటి అసలు వద్దు అంటూ ఎమోషనల్ అయ్యింది.
నా జీవితంలో 2024 లాంటి సంవత్సవరం మళ్లీ ఎప్పటికి చూడకూడదు అనుకుంటున్నా అంది. ఎందుకంటే మనకి ఇష్టమైన వ్యక్తితో ఏదైనా సమస్య వచ్చిందంటే కొంచం కూడా తట్టుకోలేం. ఈ ఏడాది నాకు ఇమ్మానుయేల్‌కి ఒకసారి కాదు.. లెక్క లేనన్ని సార్లు గొడవలు జరిగాయి.
photo- jabardasth promo
ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నాం అంటూ... వీరి మధ్య జరిగిన గొడవల గురించి చెపుతూ..కన్నీళ్లు పెట్టుకుంది వర్ష. ఏం జరిగింది ఏంటో తెలియదు కాని ప్రస్తుతం వర్ష కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరు తమ బంధానికి బ్రేకప్ చెప్పుకున్నారని రకరకాల కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరి ఏం జరిగిందో క్లారిటీ ఫుల్ ఎపిసోడ్ లోనే తెలుస్తుంది.