- Home
- Entertainment
- అమేజింగ్.. తెలుగమ్మాయి వాలెంటైన్స్ డే ట్రీట్ అదిరిందిగా.. స్లీవ్ లెస్ డ్రెస్ లో హాట్ హాట్ గా
అమేజింగ్.. తెలుగమ్మాయి వాలెంటైన్స్ డే ట్రీట్ అదిరిందిగా.. స్లీవ్ లెస్ డ్రెస్ లో హాట్ హాట్ గా
తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా వాలెంటైన్స్ డే స్పెషల్ ఫోటోషూట్ లో మెరిసింది. ఈ ఫోటోషూట్ లో ఈషా మరింత అందంగా కనువిందు చేస్తోంది.

తెలుగు నటి ఈషా రెబ్బా సోషల్ మీడియాలో రోజుకొక స్వీట్ సర్ ప్రైజ్ ఇస్తోంది. తెలుగు నటిగా ఈషా టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది.
తెలుగమ్మాయిగా Eesha Rebba మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. మంచి అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు ఈషా రెడీగా ఉంది. గ్లామర్ పరంగా ఈషా రెబ్బా తిరుగులేని బ్యూటీ అని చెప్పొచ్చు.
గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు పంపుతోంది. సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా.. ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం హాట్ లుక్ తో అదరగొడుతోంది.
సోషల్ మీడియాలో తరచుగా మతిపోగోట్టే విధంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు ప్రపంచం మొత్తం వాలెంటైన్స్ డే సంబరాలు జరుగుతున్నాయి. ఈషా రెబ్బా కూడా అభిమానులకు తన అందంతో వాలెంటైన్స్ డే ట్రీట్ ఇచ్చింది.
బ్రౌన్ కలర్ స్లీవ్ లెస్ గౌనులో పులకింత వచ్చినట్లు ఈషా రెబ్బా అందంతో మెరిసిపోతోంది. ఈ డ్రెస్ ఈషా రెబ్బా కు పర్ఫెక్ట్ గా సెట్ అయిందనే చెప్పాలి. టాప్ టూ బాటమ్ అందంతో కనివిందు చేస్తోంది. కుర్రాళ్ళు మెస్మరైజ్ అయ్యేలా చిరునవ్వులు చిందిస్తూ ఫోజులు ఇచ్చింది.
ఈషా ఫోజులకు నెటిజన్లు ఆగలేకపోతున్నారు. లవ్ ఎమోజిలతో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నాయి. చూపు తిప్పుకోలేని విధంగా ఈషా అందంతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈషా రెబ్బా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది.
ఈషా రెబ్బా అరవింద సమేత చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అమీ తుమీ, రాగాల 24 గంటల్లో, అ! లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఈషా నటించి మెప్పించింది. రీసెంట్ గా ఈషా రెబ్బా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటించింది.