- Home
- Entertainment
- Allu Arjun: ఇది అల్లు అర్జున్ సపరేట్ బ్రాండ్... ఆ ఫ్యామిలీలో ఒకడిగా ఉండాలనుకోవడం లేదా!
Allu Arjun: ఇది అల్లు అర్జున్ సపరేట్ బ్రాండ్... ఆ ఫ్యామిలీలో ఒకడిగా ఉండాలనుకోవడం లేదా!
అల్లు అర్జున్ (Allu Arjun)కోరుకున్న ఇమేజ్ కి దగ్గరైనట్లే. నేషనల్ వైడ్ గా అల్లు అర్జున్ పేరు మారుమ్రోగుతుంది. పుష్ప హిందీ వర్షన్ హిట్ టాక్ తెచ్చుకోగా... బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. అల్లు అర్జున్ ఇకపై పాన్ ఇండియా హీరో అనడంలో సందేహం లేదు.

మరి ఈ స్థాయికి రావడానికి బన్నీ చాలా కష్టపడ్డారు. తనలోని లోపాలు సరిదిద్దుకుంటూ, నైపుణ్యాలకు మెరుగు పెట్టుకుంటూ టాప్ స్టార్ గా ఎదిగారు. దేశంలోనే బెస్ట్ డాన్సర్స్ లో బన్నీ ఒకరు. అదే బన్నీ ప్రధాన ఆయుధం. పుష్ప క్యారెక్టర్ కోసం అల్లు అర్జున్ కాంప్రమైజ్ అయ్యాడు. స్టైలిష్ స్టెప్స్ కి దూరంగా పాత్రకు తగ్గట్లు నటించారు.
ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి అల్లు అర్జున్ ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. ఎన్టీఆర్ (NTR), ప్రభాస్, రామ్ చరణ్ వంటి స్టార్స్ కొంచెం అటూ ఇటూ గా బన్నీతో పాటే కెరీర్ స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ సింహాద్రితో ప్రభాస్ ఛత్రపతి మూవీతో, రామ్ చరణ్ మగధీర చిత్రాలతో ఇండస్ట్రీ హిట్స్ అతి తక్కువ సమయంలోనే అందుకున్నారు.
ఇది అల్లు అర్జున్ ని వెంటాడిన అతిపెద్ద వేదన. ఆ విషయాన్ని అల్లు అర్జున్ పబ్లిక్ గా ఒప్పుకున్నారు. కష్టపడితే దక్కనిదంటూ ఏమీ ఉండదు. నిరంతర ప్రయత్నంతో అల్లు అర్జున్ అది సాధించారు . అల వైకుంఠపురంలో మూవీతో అల్లు అర్జున్ మొదటి ఇండస్ట్రీ అందుకున్నారు. లేటెస్ట్ పుష్ప నాన్ బాహుబలి రికార్డ్స్ నమోదు చేసింది.
అయితే అల్లు అర్జున్ చాలా కాలంగా చేస్తున్న మరొక ప్రయత్నం 'మెగా హీరో' ఇమేజ్ నుండి బయటికి రావడం. అల్లు అర్జున్ బయటపడకున్నప్పటికీ ఇది నిజం. చిరంజీవి మేనల్లుడు అనిపించుకోవడం కంటే కూడా అల్లు రామలింగయ్య మనవడుగా గుర్తింపు తెచ్చుకోవాలనేది ఆయన తపన.
కెరీర్ బిగినింగ్ లో అల్లు అర్జున్ మామయ్య చిరంజీవి (Chiranjeevi)పేరు వాడుకున్న మాట వాస్తవమే. కానీ ఒక ఇమేజ్ వచ్చాక తన సినిమాల్లో చిరంజీవి ప్రస్తావన తెచ్చిన సందర్భాలు లేవు. అల్లు అర్జున్ తన పేరు షార్ట్ ఫార్మ్ AA అంటూ సపరేట్ లోగో తనంత తానే డెవలప్ చేసుకున్నాడు. దాన్ని ఒక బ్రాండ్ గా పబ్లిసిటీ చేస్తున్నారు. అల్లు అర్జున్ అభిమాన సంఘాలు కూడా ఇదే చేస్తున్నాయి.
తాజాగా అల్లు అర్జున్ ఇదే నా బ్రాండ్ అంటూ సపరేట్ ప్రమోషన్ మొదలుపెట్టాడు. పుష్ప (Pushpa) క్లైమాక్స్ సన్నివేశంలో అల్లు అర్జున్ 'ఇది నా సర్ బ్రాండ్' అంటూ బుల్లెట్ గాయంతో రక్తంతో తడిసిపోయిన చేయిని చొక్కా వెనుక భాగంలో ముద్రించుకుంటాడు. అలాగే ఇది సార్ నా బ్రాండ్ అంటూ డైలాగ్ చెప్తాడు. ఇప్పుడు అల్లు అర్జున్ స్వయంగా... అలా రక్తపు చేతి ముద్ర, డైలాగ్ ఉన్న టీషర్ట్ ధరించి పబ్లిక్ వేడుకలకు, ఫ్యామిలీ డిన్నర్లకు వెళుతున్నారు.
అల్లు అర్జున్ ఈ చర్యలకు కారణం తనది సెపరేట్ బ్రాండ్ అని... మెగా బ్రాండ్ కాదని నిరూపించడానికే అని కొందరి వాదన. ఓ సినిమా వేడుకలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ క్లాస్ పీకాడు. పవన్ పేరు చెప్పను బ్రదర్ అంటూ ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ సినిమాలపై దుష్ప్రచారం చేయడం, ట్రైలర్స్ కి డిజ్ లైక్స్ కొట్టడం చేశారు.
ఇవన్నీ అల్లు అర్జున్ మరచిపోతాడనుకో కూడదు. దానికి తోడు చిరంజీవి కంటే ముందు పరిశ్రమలో నిర్మాతగా నటుడిగా తాతయ్య అల్లు రామలింగయ్య ఉన్నారు. అలాగే తండ్రి అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్ గా మద్దతు ఇచ్చారు. కాబట్టి మెగా కాంపౌండ్ హీరోగా ఆ పదిమందిలో ఒకడిగా ఉండాలని అల్లు అర్జున్ ఉండాలని అనుకోవడం లేదని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.