MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 4 గంటల పాటు ఐటెం బ్యూటీకి చుక్కలు..అతడి నుంచి బీఎండబ్ల్యూ కారు, ఐఫోన్, కాస్ట్లీ బ్యాగ్స్ గిఫ్ట్ గా పొంది..

4 గంటల పాటు ఐటెం బ్యూటీకి చుక్కలు..అతడి నుంచి బీఎండబ్ల్యూ కారు, ఐఫోన్, కాస్ట్లీ బ్యాగ్స్ గిఫ్ట్ గా పొంది..

సుఖేష్ చంద్రశేఖర్ కేసులో బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహి లకు సంబంధాలు ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 03 2022, 01:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ తో సంబంధాలు ఉన్న ఎవరినీ ఈడీ అధికారులు విడిచిపెట్టడం లేదు. సుఖేష్ చంద్రశేఖర్ కేసులో బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహి లకు సంబంధాలు ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈడీ విచారణకు వీరిద్దరూ విడివిడిగా హాజరవుతున్నారు. శుక్రవారం రోజు ఈడీ విచారణకు ఐటెం బ్యూటీ నోరా ఫతేహి మరోసారి హాజరైంది. ఈడీ అధికారులు ఆమెని ఢిల్లీ ఆఫీస్ లో విచారించారు. దాదాపు 4 గంటల పాటు ఈడీ అధికారులు ఆమెకి వరుస ప్రశ్నలు సంధించారు. ఎక్కువగా సుఖేష్ చంద్రశేఖర్ నుంచి ఆమె పొందిన బహుమతులపైనే ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. 

36

2020 డిసెంబర్ 12న ఒక ఈవెంట్ లో నోరా ఫతేహి సుఖేష్ ని కలసినట్లు తెలుస్తోంది. ఆ ఈవెంట్ లోనే వీరిమధ్య చర్చ జరిగినట్లు.. మనీలాండరింగ్ తో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నోరా ఫతేహికి తాను ఖరీదైన బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ గా ఇచ్చినట్లు సుఖేష్ పోలీసులకు తెలిపారు. 

46

అయితే నోరా ఫతేహి దీనిని అంగీకరించలేదు. తనకి సుఖేష్ బీఎండబ్ల్యూ కారు ఆఫర్ చేసిన మాట వాస్తవమే. మొదట ఒకే చెప్పినప్పటికీ ఆ తర్వాత నేను ఆ కారు తీసుకోలేదు. సుఖేష్ కి, నాకు కామన్ ఫ్రెండ్ అయిన బాబీ ఖాన్ ని తీసుకోమని చెప్పినట్లు నోరా ఆరోపించింది. దీనికి సుఖేష్ కూడా కౌంటర్ ఇచ్చారు. నోరాకి తనకి మధ్య మీడియేటర్స్ ఎవరూ లేరు. 

56

నేను నేరుగా కారుని నోరా ఫతేహికే ఇచ్చాను అని ఇరికించాడు. మధ్యలో ఏ వ్యక్తులకు సంబంధం లేదు అని తెలిపాడు. కారు మాత్రమే కాదు లక్షల్లో విలువ చేసే ఖరీదైన గుచి బ్యాగ్స్, ఐఫోన్ 12, కొంత మొత్తంలో డబ్బు కూడా ఆమెకి సుఖేష్ ఇచ్చాడట. వ్యక్తిగతంగా వీరి మధ్య ఈ సంఘటన జరిగినట్లు తెలిపాడు. 

66

దీనిపై నోరా ఫతేహి స్పందిస్తూ.. వ్యక్తిగతంగా మా మధ్యన ఎలాంటి సంభాషణ జరగలేదు. ఆ ఈవెంట్ లోనే కేవలం ఒక్క బ్యాగ్, ఐఫోన్ ఇచ్చినట్లు నోరా పేర్కొంది. కానీ ఆమె సొంతంగా 4 బ్యాగులు సెలెక్ట్ చేసుకున్నట్లు సుఖేష్ వివరించారు. 4 గంటల పాటు జరిగిన విచారణలో ఈడీ అధికారులు ఆమె స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. శివేందర్ సింగ్, అదితి సింగ్ వద్ద సుఖేష్ చంద్రశేఖర్ మోసానికి పాల్పడి 200 కోట్లు దోపిడీ చేశాడు. ఈ స్కామ్ లో నోరా ఫతేహికి కూడా సంబంధాలు ఉన్నాయనేది ఆరోపణ. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: హౌస్ నుంచి అపూర్వ, చరణ్ ఇద్దరూ అవుట్.. షాలినికి చుక్కలు చూపించిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్
Recommended image2
Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ
Recommended image3
Swetha Naidu: సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి శ్వేతా నాయుడు, బిగ్ బాస్ లోకి ఫైర్ బ్రాండ్ ఎంట్రీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved