దుల్కర్ సల్మాన్ మామూలోడు కాదు, నాగ్ అశ్విన్ కే నో చెప్పాడా?.. చివరికి తెలుగులో లైఫ్ ఇచ్చింది ఆయనే!
దుల్కర్ సల్మాన్ ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు, తెలుగు హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ నాగ్ అశ్విన్‌కి సినిమా చేయడానికి నో చెప్పాడట.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు దుల్కర్ సల్మాన్. మలయాళంలో యంగ్ స్టర్‌గా ఎదిగాడు. అట్నుంచి ఆయన నెమ్మదిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. `మహానటి` సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇందులో జెమినీ గణేషన్ పాత్రలో ఒదిగిపోయాడు. ఈ తరానికి, తెలుగు ఆడియెన్స్ కి జెమినీ గణేషన్ ఇలానే ఉంటాడేమో అనే ఫీలింగ్‌ని కలిగించాడు.
ఆ తర్వాత నెమ్మదిగా తెలుగు సినిమాలు చేస్తూ ఇక్కడ బిజీ అయిపోయాడు. `సీతారామం`తో పెద్ద విజయాన్ని అందుకున్నాడు దుల్కర్. తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యాడు. ఆ తర్వాత `కల్కి`లోనూ చిన్న గెస్ట్ రోల్ లో మెరిశాడు. ఇప్పుడు `లక్కీ భాస్కర్` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. బ్యాంక్ కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. నాగవంశీ నిర్మించారు. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సక్సెస్ మీట్ కూడా పెట్టారు.
ఇదిలా ఉంటే దుల్కర్ సల్మాన్ కి సంబంధించిన ఓ క్రేజీ వార్తని బయటపెట్టారు దర్శకుడు నాగ్ అశ్విన్. `మహానటి`ని ఆయనే రూపొందించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో జెమినీ గణేషన్ పాత్ర కోసం దుల్కర్ ని అడిగారట. ఈ కథ చెప్పినప్పుడు విని తాను చేయనని చెప్పాడట. తనకు తెలుగు తెలియదు, ఇక్కడ చేయడం నా వల్ల కాదు అని చెప్పాడట.
తాను ఈ సినిమా చేయలేనని తెగేసి చెప్పాడట. కానీ చాలా సార్లు ఆయన్ని కలిసి స్క్రిప్ట్, ఆయన పాత్రలు మరింతగా వివరించి ఒప్పించారట. నాగ్ అశ్విన్, ప్రియాంక దత్ అంతా కలిసి ఆయనకు నమ్మకాన్ని కలిగించారట. తాము ఉన్నాం, మేం చూసుకుంటామని చెబితే, ఎన్నో సిట్టింగ్స్ తర్వాత ఓకే చేశాడట దుల్కర్. అలా ఆయన తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఇదే కాదు అంతకు ముందు కూడా తెలుగు సినిమాకి నో చెప్పారట. `ఓకే బంగారం` సినిమా తర్వాత దిల్ రాజు.. దుల్కర్‌ని అప్రోచ్ అయ్యారట. తెలుగులో సినిమా చేయమని ఓ స్క్రిప్ట్ కూడా చెబితే నో చెప్పాడట. తాను తెలుగులో చేయనని అన్నాడట. అప్పుడు మిస్ అయ్యింది. కానీ నాగ్ అశ్విన్ వదల్లేదు. గట్టిగా పట్టుకున్నాడు. మొత్తానికి మనసు మార్చుకుని `మహానటి` సినిమా చేశాడు దుల్కర్. అంతే ఆయన కెరీరే మారిపోయింది.
తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పైగా ఇప్పుడు ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్నది టాలీవుడ్ కావడంతో దుల్కర్ కూడా ఓ ప్రయత్నం చేశాడు. ఇక్కడ సెటిల్ అయ్యాడు. అప్పుడు నాగ్‌కి నిజంగానే నో చెప్పి ఉంటే ఇప్పుడు ఇంతటి క్రేజ్, మార్కెట్, ఆదరణ ఆయనకు తెలుగు ఆడియెన్స్ ద్వారా దక్కేది కాదు, పాన్ ఇండియా హీరోగా ఈ స్థాయికి ఎదిగేవారు కాదు. ఓ రకంగా ఫస్ట్ నో చెప్పిన దర్శకుడే ఆయనకు లైఫ్ ఇచ్చాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇక `లక్కీ భాస్కర్` సక్సెస్ మీట్‌లో దుల్కర్ మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. మీతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. నాగి, స్వప్న 'మహానటి' కోసం నన్ను సంప్రదించినప్పుడు నాకు తెలుగు రాదు అన్నాను. కానీ నన్ను తీసుకొచ్చి, ఈరోజు ఇలా నిలబెట్టారు.
ఆ తర్వాత హను గారు 'సీతారామం'తో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాన్ని అందించారు. ఇప్పుడు వెంకీ. చూడటానికి కుర్రాడిలా ఉంటాడు. కానీ ఎంతో ప్రతిభ ఉంది. అందుకే ఇంత గొప్ప సినిమాలు చేస్తున్నాడు. `లక్కీ భాస్కర్` సినిమాకి, ఇందులోని పాత్రలకు ప్రాణం పోసిన వెంకీకి థాంక్స్. అలాగే ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు` అని చెప్పారు దుల్కర్.
Also read: పెళ్లై పిల్లలున్నా సరే, ఆ స్టార్ హీరోనే కావాలి.. పెద్ద గొడవ చేసిన హీరోయిన్ రాశీ