MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి చేసిన పనికి ప్రతి చోట పరువు పోగొట్టుకుంటున్న యాంకర్‌ సుమ.. చివరికి నవదీప్‌ కూడా వదల్లేదు

చిరంజీవి చేసిన పనికి ప్రతి చోట పరువు పోగొట్టుకుంటున్న యాంకర్‌ సుమ.. చివరికి నవదీప్‌ కూడా వదల్లేదు

మొన్న ఓ ఈవెంట్‌లో చిరంజీవి, సుమ మధ్య  జరిగిన కోట్‌ దొంగ కన్వర్జేషన్‌ బాగా పేలింది. కానీ ఇప్పుడు అది సుమ పరువు తీస్తుంది. ఆమె కొంప ముంచుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 17 2024, 10:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యాంకర్‌ సుమ హోస్ట్ గా ఉన్న ఏదైనా ఈవెంట్‌కి మెగాస్టార్‌ చిరంజీవి వచ్చారంటే ఏదో రకంగా ఇద్దరి మధ్య సరదాగా కన్వర్జేషన్‌ ఉంటుంది. నవ్వులు పూయించేలా చేస్తారు. లేదంటే ఏదైనా ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకోవడమా? కొత్త విషయాలను పంచుకోవడమా జరుగుతుంటాయి. ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫుల్‌ ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఓ ఈవెంట్‌లో చిరంజీవి చేసిన పని ఇప్పుడు యాంకర్‌ సుమకి పెద్ద ఇబ్బందిగా మారింది. పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇంతకి ఏం జరిగిందంటే..
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ఆ మధ్య చిరంజీవి గెస్ట్ గా డిజిటల్‌ మీడియాకి సంబంధించిన ఈవెంట్‌ జరిగింది. ఇందులో యాంకర్‌ సుమ హోస్ట్ గా చేశారు. ఈవెంట్లో స్టేజ్‌పై చిరంజీవి, సుమ మధ్య ఓ ఇంట్రెస్టింగ్‌ కన్వర్జేషన్‌ నడిచింది. అందులో యాంకర్‌ సుమ ఓ కోట్‌,ప్యాంట్‌ వేసుకుని వచ్చింది. అయితే అది తనదే అంటూ చిరంజీవి చెప్పి అందరి ముందు పరువు తీశారు. స్టేజ్‌పై నుంచే భార్య సురేఖకి ఫోన్‌ చేసి, తన కోట్‌ మిస్‌ అయ్యిందన్నావుగా, సుమ కొట్టేసింది, దొరికిపోతుందిలే, ఇచ్చేస్తది అని చెప్పడం హైలైట్ గా నిలిచింది. 
 

37

 ఈ సన్నివేశం ఆ ఈవెంట్‌లో బాగా పేలింది. అది ఫన్నీగా చేసినా, ఇప్పుడు మాత్రం జనాల్లోకి మాత్రం బాగా వెళ్లింది.  దీంతో ఆ చిరంజీవి మాట పట్టుకుని ఆడుకుంటున్నారు. ఏ సందర్భం దొరికినా యాంకర్‌ సుమ పరువు తీస్తున్నారు. తాజాగా నటుడు నవదీప్‌ వంతు వచ్చాయి. అందరి ముందు సుమ పరువు తీశాడు. 

47

సుమ యాంకర్‌గా చేస్తున్న షో `సుమా అడ్డా`. ఈ షోకి `లవ్‌ మౌలి` టీమ్‌ పాల్గొంది. ఇందులో నవదీప్‌తోపాటు హీరోయిన్లు, కమెడియన్‌ పాల్గొని నవ్వులు పూయించారు. యాంకర్‌ సుమ పంచులకు వారి రియాక్షన్స్, కౌంటర్లు బాగా వర్కౌట్‌ అయ్యాయి. ఆద్యంతం ఫన్నీగా సాగింది. 
 

57

ఇందులో సుమ టాపిక్ వచ్చింది. సినిమా వాళ్లు ఏం చేసిన చివరికి పెద్దమ్మ గుళ్లో పూజలు చేస్తారు. ఆ తర్వాత సుమ వద్దకు(షోకి) వస్తారు. చివరికి ఆమె మ.. మ అనాల్సిందే అని తెలిపారు. దీనికి నవదీప్‌ డబ్బులతో దిష్టి తీశాడు. ఆమెకి నమస్కారం తెలియజేశాడు. ఆయనతోపాటు అందరు ఆమెకి దెండం పెట్టడం విశేషం. 
 

67

అనంతరం పెద్ద బాంబ్‌ పేల్చాడు నవదీప్‌. అంతా అయిపోయాక `కాకపోతే మొన్న చిరంజీవి గారి కోటు కొట్టేయడమే నచ్చలేదు` అంటూ షాక్‌ ఇచ్చాడు. అంతటితో ఆగలేదు. సుమ అడ్డాలోనే చిరంజీవి కామెంట్స్ వీడియోని చూపించడం గమనార్హం. దీంతో దెబ్బకి సుమకి మైండ్‌ బ్లాక్ అయిపోయింది. మొహం వాడిపోయింది. ఇది షోలో బాగా పేలింది. 
 

77

చిరంజీవి అప్పుడు ఏదో సరదాకి చేసిన పని కారణంగా ఇప్పుడు సుమ అందరి ముందు పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది. `సుమ అడ్డా` షో ప్రోమో చాలా ఫన్నీగా ఉంది. ఇది ఈ శనివారం ఈటీవీలో టెలికాస్ట్ కానుంది.
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan ఫ్యామిలీతో ప్రధాని ముచ్చట్లు.. మోదీతో మార్క్ శంకర్ ని చూశారా, వైరల్ అవుతున్న ఫోటోలు!
Recommended image2
2026 Biggest Flops: బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో పవన్, ప్రభాస్ సినిమాలు.. దారుణంగా దెబ్బ తీశాయిగా
Recommended image3
Aishwarya Rai కి క్షమాపణ చెప్పిన బాలకృష్ణ హీరోయిన్.. సడెన్ గా సినిమాల నుంచి మాయం, ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved