సిగ్గు లేకుండా కమిట్మెంట్ అడిగారు, డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ కావ్య థాపర్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు!
హీరోయిన్ కావ్య థాపర్ తనకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవమైందన్నారు. సిగ్గులేకుండా కమిట్మెంట్ అడిగారని డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
ప్రతి చోటా అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. చిత్ర పరిశ్రమల్లో ఈ జాడ్యం మరింత ఎక్కువ ఉంది. గ్లామర్ ఫీల్డ్ కావడంతో అవకాశాల కోసం వచ్చిన అమ్మాయిలు, హీరోయిన్స్ పై లైంగిక దాడులు జరుగుతున్నాయి. ఆఫర్స్ ఆశచూపి లొంగదీసుకోవడం, భయపెట్టడం పరిపాటిగా మారింది.
Kavya Thapar
ఇటీవల జస్టిస్ హేమ కమిటీ విడుదల చేసిన నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపింది. అక్కడ మహిళా నటులకు భద్రత లేదని ఆ కమిటీ తేల్చింది. దేశంలో ఎక్కడ లేని విధంగా మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అవకాశాల పేరిట వారిని భయపెడుతున్నారు. లైంగిక దాడులకు గురైన మహిళలు బయటకు చెప్పడం లేదని నివేదించారు.
పలువురు హీరోయిన్స్, మహిళలకు పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలు సైతం కమిటీ రిపోర్ట్ లో పొందుపరిచారు. హేమ కమిటీ రిపోర్ట్ అనంతరం కొందరు మహిళలు ధైర్యంగా బటయకు వచ్చారు. తమపై లైంగిక వేధింపులకు పాల్పడిన దర్శక నిర్మాతలు, నటులపై ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా యంగ్ హీరోయిన్ కావ్య థాపర్ తనకు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదురైందని వెల్లడించారు.
తనను నటిగా చూడాలన్నది కావ్య థాపర్ తండ్రి కల అట. అందుకే చదువు పూర్తి కాగానే నటన వైపు అడుగులు వేసిందట. యాడ్ లో నటించే ఆఫర్ ఉందని తెలిసి ఆడిషన్ ఇచ్చేందుకు ఒక ఆఫీస్ కి వెళ్లిందట. నీకు ఒకటి కాదు నాలుగు యాడ్స్ లో నటించే అవకాశం ఇస్తాము. కాకపోతే కమిట్మెంట్ ఇవ్వాలి, అన్నారట. అలాంటివి నాకు ఇష్టం ఉండదు అని కావ్య థాపర్ సమాధానం చెప్పిందట.
వారు పదే పదే కమిట్మెంట్ అడుగుతుంటే అక్కడి నుండి వచ్చేసిందట. అనంతరం కొన్ని యాడ్స్ లో నటించిందట. అప్పుడు 'ఈ మాయ పేరేమిటో' మూవీలో ఛాన్స్ వచ్చిందని, కావ్య థాపర్ చెప్పుకొచ్చింది. కమిట్మెంట్ ఇస్తావా అని సిగ్గు లేకుండా అడిగారని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని కావ్య థాపర్ పంచుకుంది.
కావ్య థాపర్ మోడల్ గా కెరీర్ ఆరంభించింది. టాలీవుడ్ ద్వారా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. 2018లో విడుదలైన ఈ మాయ పేరేమిటో చిత్రంతో హీరోయిన్ గా మారింది. తమిళ్, హిందీ భాషల్లో సైతం ఒకటి రెండు చిత్రాలు చేసింది. ఎక్కువగా తెలుగులో నటిస్తుంది.
కావ్య థాపర్ మోడల్ గా కెరీర్ ఆరంభించింది. టాలీవుడ్ ద్వారా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. 2018లో విడుదలైన ఈ మాయ పేరేమిటో చిత్రంతో హీరోయిన్ గా మారింది. తమిళ్, హిందీ భాషల్లో సైతం ఒకటి రెండు చిత్రాలు చేసింది. ఎక్కువగా తెలుగులో నటిస్తుంది.
ఈ ఏడాది కావ్య థాపర్ రవితేజకు జంటగా ఈగల్ మూవీ చేసింది. అనంతరం సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన చిత్రంలో ఓ కీలక రోల్ చేసింది. దర్శకుడు పూరి జగన్నాధ్-రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ లో హీరోయిన్ గా మెరిసింది. ఈ చిత్రంలో ఆమె పాత్రకు మంచి స్క్రీన్ స్పేస్ ఉంది. అలాగే గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల తెరకెక్కించిన విశ్వం మూవీలో హీరోయిన్ గా చేసింది. అయితే ఈ చిత్రాలన్నీ పరాజయం పాలయ్యాయి. ఒక్కటి కూడా కావ్య థాపర్ కి బ్రేక్ ఇవ్వలేదు.