MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమంత తగ్గేదేలే... తనను జైల్లో పెట్టాలంటున్న డాక్టర్ కు స్ట్రాంగ్ రిప్లై

సమంత తగ్గేదేలే... తనను జైల్లో పెట్టాలంటున్న డాక్టర్ కు స్ట్రాంగ్ రిప్లై

ఒక పెద్దమనిషి నా పోస్ట్‌ను, నా సలహాలను ఉద్దేశపూర్వకంగా బలమైన పదాలతో దూషించారు. ఆయన కూడా డాక్టరే. 

4 Min read
Surya Prakash
Published : Jul 06 2024, 09:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114

సమంత గత కొన్నాళ్లుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆ సమస్యతో  ఆమె అనేక హెల్త్ ఇష్యూలను  ఎదుర్కోవల్సి వస్తోంది. వాటి నుంచి దూరం అయ్యేందుకు ఆమె ఫిట్‌నెస్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తోంది. అలాగే తను తీసుకునే ఆహారం నుంచి వ్యాయామం వరకు.. ప్రతీ విషయంలోనూ కాన్షియస్ గా ఉంటోంది. దేన్నీ నిర్లక్ష్యం చేయకుండా తన ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. అంతేకాకుండా. ఈ మధ్య పాడ్‌కాస్ట్ ద్వారా తనకు ఆరోగ్యపరంగా ఎదురవుతున్న ఇబ్బందులు.. వాటికి పరిష్కారం తదితర అంశాలపై మాట్లాడుతోంది. 
 

214
Samantha

Samantha

ఈ క్రమంలో సమంత వైరల్ ఇన్ఫెక్షన్లను ఏ విధంగా నయం చేసుకోవచ్చో చెబుతూ ఓ హెల్త్ టిప్ చెబుతూ ఓ ఫొటో పోస్ట్ చేసింది. అది చూసిన ఓ డాక్టర్ మండిపడ్డారు. ఆమెను జైల్లో పెట్టాలంటూ సీరియస్ అయ్యారు. ఆమెకు జరిమానా కూడా విధించాలని చెప్పుకొచ్చారు. దాంతో సమంత మంచి చేద్దామని వెళ్తే చెడు ఎదురైన పరిస్దితి వచ్చింది. అయితే సమంత మానసికంగా స్ట్రాంగ్. వెంటనే ఆ విషయమై సోషల్ మీడియాలో స్పందించింది. ఇంతకీ ఆమె ఇచ్చిన సలహా ఏమిటి, డాక్టర్ ఏమన్నారు.

314
International Yoga day 2024

International Yoga day 2024

సమంత తాను తీసుకునే వైద్యాన్ని తెలియజేస్తూ ఎప్పటికప్పుడు పోస్ట్‌ పెడుతుంటారు. ఇటీవల కూడా అలానే నెబ్యులైజేషన్‌ గురించి పోస్ట్ పెట్టారు. ‘మాములుగా వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినప్పుడు ఇలాంటి ప్రత్యామ్నాయ మందులు వాడండి అంటూ.. నెబ్యులైజేషన్‌లో ఉపయోగించాల్సిన కొన్నిమందులు సూచించారు. దీనిపై కొందరు డాక్టర్లు ఆమెను విమర్శించారు. ఆమె చెప్పిన హెల్త్‌ టిప్‌ పాటిస్తే ప్రాణానికే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 

414
Samantha ruth prabhu

Samantha ruth prabhu

ఇక ఒక డాక్టర్‌ ఆమెను తీవ్రంగా విమర్శిస్తూ పోస్ట్‌ పెట్టారు. ‘సమంతకు హెల్త్‌, సైన్స్‌ గురించి ఏమీ తెలియకుండా మాట్లాడారు. ఎంతోమందిని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆమెను జైల్లో వేయాలి. జరిమానా విధించాలి’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. తాజాగా దీనిపై సమంత స్పందించారు. తన సోషల్‌ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు.

514

 సమంత పెట్టిన  పోస్ట్ లో లో ఆమె సాధారణ ఔషదాలకు బదులుగా హైడ్రోజన్ పెరాక్సైడ్‌ (hydrogen peroxide), డిస్టిల్డ్ వాటర్ మిశ్రమంలో కలుపుకుని నెబ్యులైజర్ (Nebuliser - ముక్కుతో ఆవిరిని పీల్చేందుకు దీన్ని ఉపయోగిస్తారు) ద్వారా పీల్చితే.. ఇన్ఫెక్షన్లన్నీ మాయమవుతాయని సలహా ఇచ్చింది. ట్యాబ్లెట్స్‌తో పనిలేదని చెప్పింది. అది కాస్తా మిస్ ఫైర్ అయ్యింది. ఆ టిప్ వల్ల సమంత.. డాక్టర్ల ఆగ్రహానికి గురైంది. ఈ సలహ తన ఫ్రెండ్ డాక్టర్ మిత్ర బసు చిల్లర్ ఇచ్చిందని స్పష్టం చేసినా సరే లాభం లేకపోయింది.   

614
samantha

samantha

సమంత రెస్పాండ్ అవుతూ ..‘కొన్నేళ్లుగా నేను అనేక రకాల మందులు వేసుకుంటున్నాను. ప్రతి దాన్ని డాక్టర్ల సలహా మేరకు ఉపయోగిస్తున్నా. ఇతరులకు ఇచ్చే టిప్స్‌ కూడా నేను పాటించి ఫలితం వచ్చిన తర్వాతనే చెప్పాను. నేను తీసుకుంటున్న వైద్యం చాలా ఖరీదైనది. నాకు ఆర్థికస్థోమత ఉంది కాబట్టి దాన్ని భరించగలను. కానీ, కొందరి పరిస్థితి వేరు. ఇంత ఖర్చుపెట్టి వైద్యం చేయించుకోలేరు. వాళ్ల గురించే నేను ఆలోచించి హెల్త్‌ టిప్స్‌ చెబుతుంటాను. దేని గురించైనా తెలుసుకోకుండా ఇతరులకు సలహా ఇచ్చేంత అమాయకురాలిని కాదు. నేను చికిత్స తీసుకుంటున్న డాక్టర్‌కు 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది’ అని తెలిపారు.
 

714

అలాగే  తనను విమర్శించిన డాక్టర్‌ను ఉద్దేశిస్తూ.. ‘ఒక పెద్దమనిషి నా పోస్ట్‌ను, నా సలహాలను ఉద్దేశపూర్వకంగా బలమైన పదాలతో దూషించారు. ఆయన కూడా డాక్టరే. నాకంటే ఆయనకు ఎన్నో విషయాలపై అవగాహన ఉంటుందనడంలో సందేహం లేదు. నన్ను నిందించడం కంటే నాకు చికిత్స చేసిన డాక్టర్‌తో ఆయన ముఖాముఖిలో పాల్గొని ఉంటే బాగుండేది. 

814

ఆయన నా గురించి మాట్లాడే సమయంలో అలాంటి పదాలు వాడకుండా ఉంటే ఆయన్ని గౌరవించేదాన్ని. నన్ను జైల్లో పెట్టాలని ఆయన విమర్శించినందుకు నాకు బాధలేదు. ఒక సెలబ్రిటీని కాబట్టి నన్ను అంత సులువుగా నిందించాడని అనుకుంటాను. కానీ, నేను సెలబ్రిటీగా ఆ హెల్త్‌ టిప్‌ ఇవ్వలేదు.. ఒక సామాన్యమైన వ్యక్తిగా పోస్ట్‌ చేశాను’ అని రాసుకొచ్చారు. దీనిపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు.
 

914

 గత కొద్ది రోజుల క్రితం సమంత  షేర్‌ చేసిన ఫొటోపై నెట్టింట రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు దీనిపై ఆమె ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుపుతూ సమంత తన ఇన్‌స్టా స్టోరీలో ఒక ఫొటో షేర్‌ చేశారు. ‘వైద్యాన్ని కొనసాగిస్తూ కోలుకోవడానికి ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నా’ అనే క్యాప్షన్‌ పెట్టారు. అయితే ఈ ఫొటోతో పాటు సమంత మరొకటి కూడా షేర్‌ చేసి డిలీట్‌ చేశారని. ఒక ఫేక్‌ ఫొటో సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతోంది. అందులో ఆమె హాఫ్‌న్యూడ్‌గా ఉండడంతో ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు సమంత అలాంటి ఫొటో షేర్‌ చేయలేదని.. కావాలనే ఫేక్‌ ఫొటో క్రియేట్‌ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు.
 

1014
Samantha

Samantha

 ఈ నేపథ్యంలో సమంత ఇన్‌స్టాలో పెట్టిన కొటేషన్‌ కూడా ఆసక్తికరంగా మారింది. ‘‘మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం లేదా నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా జీవించగలగడమే నిజమైన విజయం’’ అనే కొటేషన్‌ను పంచుకున్నారు. దీంతో సామ్‌ దీన్ని ఆ ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టడం కోసమే షేర్‌ చేసినట్లు తెలుస్తోంది.
 

1114

సమంత యూట్యూబ్‌ వేదికగా పాడ్‌కాస్ట్‌ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా  అభిమానుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం చిన్న విషయం కాదు. నా ఫ్యాన్స్‌లో చాలామందికి వినోదం, ఫ్యాషన్‌, మేకప్‌పై ఆసక్తి ఎక్కువ. వాళ్లను చూసి ఎన్నో విషయాలపై నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. కొత్త అంశాలపై అవగాహన వచ్చింది. 
 

1214

నా మాటలు కొద్దిమందిపై ప్రభావం చూపినా ఆనందమే. కొంతమందిలో అయినా మార్పు తీసుకురాగలిగితే అంతకు మించి నేనేం కోరుకోను. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట నా మాటను గౌరవించే వాళ్లు ఉండడం అదృష్టం. నా మనసుకు నచ్చిందిచేస్తాను. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది సరైనదా.. కాదా అని ఆలోచిస్తాను. మానసికంగా ప్రశాంతంగా లేకపోతే శారీరకంగా కూడా ఫిట్‌గా ఉండలేరు. అందుకే నేనెప్పుడు మెంటల్‌ హెల్త్‌కు ప్రాముఖ్యతనిస్తాను. దానికోసం అవసరమైన వ్యాయామాలు చేస్తుంటాను’ అని చెప్పారు.
 

1314

చివరిగా ‘ఖుషి’లో కనిపించి కనిపించింది సమంత. ప్రస్తుతం ఆమె నటించిన యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌’ (Citadel) విడుదలకు సిద్ధంగా ఉంది. సమంతతో పాటు వరుణ్‌ధావన్‌ ఇందులో ప్రధానపాత్ర పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌కు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ‘సిటడెల్‌: హనీ-బన్నీ’  పేరుతో స్ట్రీమింగ్‌ కానుంది.
 

1414

ఇక కొన్ని నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్న సమంత రీసెంట్ గా  కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఆమె సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌’పై ‘మా ఇంటి బంగారం’ పేరుతో ఇది రానుంది. ఇటీవల దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ను ఆమె పంచుకున్నారు. ఈ సినిమా దర్శకుడు ఎవరు? ఇతరత్రా విషయాలు తెలియాల్సి ఉంది. 
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved