Allu Arjun : అల్లు అర్జున్ ఎంతగానో ఇష్టపడే బాలీవుడ్ నటుడు ఎవరో తెలుసా?
సౌత్ కా సుల్తాన్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కి ప్రస్తుతం ఇండియా వైడ్ గా డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ బన్నీకి మాత్రం ఆ బాలీవుడ్ హీరో అంటే ఎంతో ఇష్టమని చాలా తక్కువ మందికి తెలుసు... ఇంతకీ ఆయన ఎవరంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ‘పుష్ప’ Pushpa తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
పుష్పరాజ్ గా వరల్డ్ వైడ్ గానూ బన్నీ గుర్తింపు దక్కించుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ అయ్యింది. అంతేకాదు.. ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ ను కూడా అందుకున్న విషయం తెలిసిందే.
పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ కు హిందీ ఆడియెన్స్ లో చాలా ఫాలోయింగ్ పెరిగింది. వీరాభిమానులు ఏర్పడ్డారు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ లో అల్లు అర్జున్ ఎంతగానో ఇష్టపడే హీరో గురించి తెలిసింది.
అల్లు అర్జున్ కు బాగా నచ్చిన బాలీవుడ్ హీరో మరెవరో కాదు... బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan). ఆయన సినిమాలంటే బన్నీకి చాలా ఇష్టమంట.. ‘జంజీర్’ మూవీ ఫేవరెట్ అని చెప్పారు.
హిందీ ఆడియెన్స్ బన్నీని ఇష్టపడుతున్న తరుణంలో బిగ్ బీ తన ఫేవరెట్ హీరో అని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయాన్ని బన్నీ అలవైకుంఠపురం చిత్రం సమయంలోనే చెప్పారు.
ఇదిలా ఉంటే... ఇండియా మొత్తం ప్రస్తుతం బన్నీ నుంచి రాబోయే మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప2’ (Pushpa 2 The Rule) చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది.