- Home
- Entertainment
- Devi Nagavalli: అర్జెంట్‌గా స్టార్ అయిపోవాలంటే.. దేవి నాగవళ్లితో గొడవ పెట్టుకోవాల్సిందే?.. మీమ్స్ వైరల్
Devi Nagavalli: అర్జెంట్‌గా స్టార్ అయిపోవాలంటే.. దేవి నాగవళ్లితో గొడవ పెట్టుకోవాల్సిందే?.. మీమ్స్ వైరల్
టీవీ 9 యాంకర్ దేవి నాగవళ్లి, హీరో విశ్వక్ సేన్ మధ్య జరిగిన వివాదం ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుడుతుంది. పాపులారిటీకి కొత్త దారులు చూపిస్తుంది. ప్రస్తుతం ఇది ప్రమోషన్‌కి కొత్త స్టంట్‌గా మారుతుంది.

`మీరు అర్జెంట్‌గా పాపులార్ కావాలా? అయితే టీవీ9తో గొడవ పడాల్సిందేనని, లేదంటే ఆ టీవీ ఛానెల్ యాంకర్ దేవి నాగవళ్లితో (Devi Nagavalli)నైనా గొడవ పెట్టుకోవాల్సిందే అని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఇది కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టినట్టవుతుంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుండటం విశేషం. సినిమా ప్రమోషన్లకిది కొత్త దారులు చూపించినట్లయ్యిందని అంటున్నారు సోషల్ మీడియా ఫ్యాన్స్. ప్రస్తుతం దీనికి సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) మొదట్నుంచి బోల్డ్ యాటిట్యూడ్‌తో ఉన్నారు. పాపులారిటీకి ఇదే కొత్త స్టయిల్ అని తొలి చిత్రంతోనే చాటుకున్నారు. ఆయన నటించి రూపొందించిన `ఫలక్‌నూమా దాస్` చిత్ర సమయంలో విశ్వక్ సేన్ చేసిన హడావుడి మామూలు కాదు. కొందరు తన సినిమా పోస్టర్లని చించారంటూ హంగామా చేశాడు. మరోవైపు విజయ్ దేవరకొండపై సెటైర్లు పేలుస్తూ, తాను ఉన్నానని తెలియజేస్తే ప్రయత్నం చేశాడు. ఇటీవల తాను నటించిన `అశోకవనంలో అర్జున కళ్యాణం` సినిమా కోసం సరికొత్త ప్రమోషన్ కార్యక్రమాలకు తెరతీసి వివాదాల్లో ఇరుక్కున్నాడు.
తన సినిమా ప్రమోషన్ కోసం అభిమానితో పెట్రోల్ పోసుకుంటున్నట్టుగా ఓ ఫ్రాంక్ వీడియో చేసి దుమారం రేపిన విసయం తెలిసిందే. దీనిపై చర్చకి పిలిచిన టీవీ9 స్టూడియోకి వెళ్లిన విశ్వక్ సేన్, యాంకర్ దేవినాగవళ్లి మధ్య మాట మాట పెరిగి, ఆమె ఆయన్ని మెంటల్ సేన్, మ్యాడ్ సేన్, డిప్రెషన్ పర్సన్ అంటూ కామెంట్లు చేసింది. దీంతో మండిపోయిన విశ్వక్ సేన్ ఆమెపై విరుచుకుపడ్డారు. దీంతో గెట్ ఔట్ అంటూ తిట్టింది దేవి నాగవళ్లి, దీంతో `F***` పదం వాడారు. ఈ విషయంలో విశ్వక్ సేన్‌ది తప్పు కావడంతో ఆయన సారీ చెప్పారు. కానీ అంతిమంగా దేవి నాగవళ్లిదే అని సోషల్ మీడియా, క్రిటిక్స్ సైతం తేల్చి చెప్పారు. Devi Nagavalli v/s Vishwak sen.
అయితే దేవి నాగవళ్లితోగానీ, టీవీ9తో గాని ఇలాంటి గొడవలు కొత్త కాదు. `డీజే టిల్లు` సిద్దు జొన్నలగడ్డ, అంతకు ముందు విజయ్ దేవరకొండలతో కూడా ఇలాంటి గొడవలే జరిగాయి.ఆ తర్వాత వారికి ఊహించిన క్రేజ్, పాపులారిటీ వచ్చింది. ఆ టైమ్‌లో ఆయా హీరోల సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాతో కొత్త చర్చకి తెరలేపినట్టయ్యింది. సరికొత్త చర్చ ఊపందుకుంది.
అర్జెంట్‌గా పాపులారిటీ కావాలంటే, సరైన బ్రేక్ రాలేదంటే, తమ సినిమాకు ప్రమోషన్ సరిగా కావడం లేదంటే, ప్రమోషన్ చేసుకునేందుకు బడ్జెట్ లేదంటే, ప్రమోషన్‌కి టైమ్ లేదంటే జస్ట్ టీవీ9 యాంకర్ తో గొడవ పెట్టుకుంటే సరిపోతుందని సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. ట్రోలర్స్ సైతం ఇలాంటి కామెంట్లు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. `ప్రమోషన్‌కి కేరాఫ్ దేవి నాగవళ్లి` అని, పాపులర్ చేసే సంస్థ అని సెటైర్లతో కూడిన మీమ్స్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ఈ సరికొత్త నినాదం ఇండస్ట్రీలో ఊపందుకుందని చెప్పొచ్చు.
అయితే ఇది కేవలం సినిమాలు, హీరో, హీరోయిన్ల విషయంలోనే కాదు, జనరల్ విషయాల్లోనూ ఇలాంటి స్ట్రాటజీనే ఫాలో అయితే సరిపోతుందని, కావాల్సిన ప్రమోషన్, పాపులారిటీ వస్తుందని అంటున్నారు. మొత్తంగా దేవి నాగవళ్లి ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. నిత్యం హాట్ న్యూస్ లు అందించే ప్రముఖ న్యూస్ ఛానెలే ఇప్పుడు హాట్ న్యూస్‌గా మారడం విశేషం. ఏదేమైనా ఈ మొత్తం ఎపిసోడ్‌లో దేవి నాగవళ్లి స్టార్ అయిపోవడం కొసమెరుపు.