రజినీకాంత్ కోసం ఏడు రోజులు ఉపవాసం చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
Rajinikanth: రజినీకాంత్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా వివిధ దేశాల్లో రజినీ సినిమాలు రిలీజ్ అవడమే కాదు.. ఆయనకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్..
సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా రజినీకాంత్‌కు అభిమానులు ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా దేశం ఏదైనా సూపర్ స్టార్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం రజినీకాంత్, కమల్ హసన్‌తో కలిసి మల్టీస్టారర్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
జైలర్ 2 సినిమా షూటింగ్ జోరు..
రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న 'జైలర్ 2' సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. దీని మొదట పార్ట్ రెండేళ్ళ క్రితం విడుదల కాగా.. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ. 600 కోట్లు కొల్లగొట్టింది. దీంతో సీక్వెల్‌పై మంచి బజ్ ఉంది. ఈ పార్ట్ 2లో విజయ్ సేతుపతి, ఎస్.జె.సూర్య నటిస్తున్నట్టు సమాచారం. 2026 సమ్మర్‌లో ఇది విడుదల కానుంది.
ఏడు పదుల వయస్సులోనూ..
ఏడు పదుల వయస్సులోనూ రజినీకాంత్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అయితే రజినీకాంత్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ఏకంగా 7 రోజులు ఉపవాసం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీదేవి సినిమాలు..
తెలుగు, తమిళ, హిందీ సహా పలు భాషల్లో స్టార్ హీరోలతో కలిసి నటించింది అతిలోక సుందరి శ్రీదేవి. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన హిట్ చిత్రాలు చేసింది.
రజినీకాంత్‌తో స్నేహం..
శ్రీదేవి, రజినీకాంత్ ఇద్దరూ మంచి స్నేహితులు. వీరు దాదాపుగా 20 సినిమాల్లో కలిసి నటించారు. అయితే ఒకానొక సమయంలో రజినీకాంత్ అనారోగ్యం బారిన పడటంతో.. ఆయన కోసం శ్రీదేవి ఏకంగా ఏడు రోజులు ఉపవాసం ఉన్నారట. ఈ విషయాన్ని వారి సన్నిహితులు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

