MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ వల్ల 17 సినిమాలు వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? నిజమెంత?

ఎన్టీఆర్ వల్ల 17 సినిమాలు వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? నిజమెంత?

ఎన్టీఆర్ వల్ల అప్పట్లో ఓ హీరోయిన్ తన సినిమా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుందా? వీరి బంధం పెళ్లి వరకూ వెళ్లిందా? మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ 17 సినిమాలు వదులుకోడానికి కారణం ఏంటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 13 2026, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎన్టీఆర్ అంటే అప్పట్లో క్రేజ్
Image Credit : Asianet News

ఎన్టీఆర్ అంటే అప్పట్లో క్రేజ్

సీనియర్ ఎన్టీఆర్ అంటే అప్పట్లో క్రేజ్ ఓ రేంజ్ లో ఉండేది. జనాలు ఆయన్ను తెరమీది దైవంలా కొలిచేవారు. ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరు పెద్దాయన్ని గౌరవించేవారు. ఆయన సెట్ లో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండేవారు. ఎన్టీఆర్ తో సినిమా అంటే హీరోయిన్లకు పండగే. ఆయనతో సినిమా చేస్తే వరుస అవకాశాలు వస్తాయని నమ్మకంతో ఉండేవారు. సినిమాల విషయంలో ఎన్టీఆర్ చాలా స్ట్రిక్ట్, హీరోయిన్లు కూడా సెట్ లో ఆయన దగ్గరకు వెళ్లడానికి వెనకడుగు వేసేవారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉన్న హీరోయిన్?
Image Credit : Asianet News

ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉన్న హీరోయిన్?

అయితే కొంత మంది హీరోయిన్లు మాత్రం ఎన్టీఆర్ తో చాలా క్లోజ్ గా ఉండేవారు. వారిలో కృష్ణ కుమారి ఒకరు. ఆమెతో ఎన్టీఆర్ స్నేహం ఎలా ఉండేదంటే.. ఒక దశలో వీరు పెళ్లి చేసుకుంటారేమో అన్న టాక్ కూడా గట్టిగా నడిచింది. ఈ విషయాన్ని కృష్ణ కుమారి అక్క, టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ షావుకారు జానకి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

35
కృష్ణ కుమారి లైఫ్ లో డిస్టబెన్స్
Image Credit : Asianet News

కృష్ణ కుమారి లైఫ్ లో డిస్టబెన్స్

షావుకారు జానకి మాట్లాడుతూ.. "ఎన్టీఆర్ - కృష్ణ కుమారి పెళ్లి చేసుకుంటారని టాక్ అప్పట్లో బాగా నడిచింది. అది అందరిలాగా నేను కూడా విన్నాను. కానీ.. ఎప్పుడు నా చెల్లి నాతో ఈ విషయం చెప్పలేదు.. నేను ఆమెతో ఇంత పర్సనల్ గా మాట్లాడలేదు. అసలు అప్పటికే ఎన్టీఆర్ కు పెళ్లై.. 14 మంది పిల్లలు.. కృష్ణ కుమారికి ఇంకా పెళ్లి కాలేదు. వీరి వివాహం సాధ్యమయ్యే పని కాదు అని నాకు తెలుసు''. అయితే కృష్ణ కుమారి లైఫ్ లో ఏదో చిన్న డిస్టబెన్స్ ఉందనిమాత్రం నాకు అర్దం అయ్యింది. అది ఇదేనా కాదా అనేది నాకు తెలియదు అని షావుకారు జానకి అన్నారు.

45
17 సినిమాలు వదులుకున్న హీరోయిన్..
Image Credit : our own

17 సినిమాలు వదులుకున్న హీరోయిన్..

కృష్ణ కుమారి హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగా.. సడెన్ గా 17 సినిమాలను వదులుకున్నారు. అందులో కొన్ని అగ్రిమెంట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ తో వచ్చిన డిస్టబెన్స్ వల్లే ఆమె ఇలా చేశారన్న టాక్ వచ్చింది. కానీ అసలు కారణం ఏంటో ఎవరికి తెలియదు.

 కృష్ణ కుమారి వదులుకున్న సినిమాలలో ఎన్టీఆర్ తో 5, ఏఎన్నార్ తో 5, జగ్గయ్య, కాంతారావు లాంటి స్టార్స్ తో కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఈ విషయాన్ని షావుకారు జానకి వెల్లడించారు. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగా, ఆమె చేసిన పని.. కెరీర్ పూర్తిగా వెనక్కి వెళ్లేలా చేసిందని జానకి అన్నారు.

55
కృష్ణ కుమారి పెళ్లికి అడ్డుపడ్డ నిర్మాత ఎవరు?
Image Credit : indian express

కృష్ణ కుమారి పెళ్లికి అడ్డుపడ్డ నిర్మాత ఎవరు?

హీరోయన్ గా వరుస అవకాశాలు వస్తున్న టైమ్ లోనే.. సినిమా కెరీర్ కు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుంది కృష్ణ కుమారి. చెందిన రాజస్థానీయుల కుటుంబానికి చెందిన వ్యాపారవేత్త అజయ్ మోహన్ ను ఆమె పెళ్లాడింది. వారి కుటుంబం బెంగళూరులో ఉండేవారు. 

అయితే అప్పటికే అతనికి పెళ్లై విడాకులు అవ్వడంతో, ఆ వివాహం ఆపాలంటూ ఓ నిర్మాత షావుకారు జానకిని రిక్వెస్ట్ చేశారు. కానీ జానకి మాత్రం.. "అది వారి వ్యక్తిగత విషయం.. నేను కల్పించుకోలేను'' అని చెప్పేశారు. కృష్ణ కుమారి దంపతులకు పిల్లలు లేరు. ఓ పాపను దత్తతు తీసుకుని పెంచుకున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి తారక రామారావు
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
CM Vijay Salary: హీరోగా 275 కోట్లు.. మరి సీఎంగా దళపతి జీతం ఎంతో తెలుసా?
Recommended image2
Nayanthara: నయనతార కెరీర్ లో చెత్త సినిమాలు, ఆ ఒక్క మూవీ చేసినందకు ఇప్పటికీ బాధపడుతున్న హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved