MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Posani: ఆపరేషన్‌ అరుణారెడ్డి మూవీలో ఏం చూపించబోతున్నారో తెలుసా?.. పోసాని మార్క్ ట్రీట్‌మెంట్‌ హైలైట్‌

Posani: ఆపరేషన్‌ అరుణారెడ్డి మూవీలో ఏం చూపించబోతున్నారో తెలుసా?.. పోసాని మార్క్ ట్రీట్‌మెంట్‌ హైలైట్‌

నటుడు, రైటర్‌, దర్శకుడు పోసాని కృష్ణమురళీ ఇప్పుడు `ఆపరేషన్‌ అరుణారెడ్డి` అనే మూవీతో కమ్‌ బ్యాక్‌ ఇస్తున్నారు. మరి ఈ మూవీలో ఏం చూపించబోతున్నారనేది తెలుసుకుందాం.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 14 2026, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పోసాని కమ్‌ బ్యాక్‌
Image Credit : Asianet News

పోసాని కమ్‌ బ్యాక్‌

పోసాని కృష్ణమురళీ.. ముక్కుసూటి మనిషి, భోళా మనిషి.. మనసులో ఏముండదు, ఏదున్నా అప్పటికప్పుడు అనేస్తారు. కక్కేస్తారు. ఆ తర్వాత మళ్లీ ఫ్రీ అయిపోతారు. అయితే కొన్నిసార్లు ఆయన మాట తీరు ఇబ్బందులు క్రియేట్‌ చేస్తుంది. ఎదుటి వారిని బాధపెట్టొచ్చు. కానీ ఆ తర్వాత ఆయన ఫ్రీగా కలిసిపోతారు. రాజా అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు. అంతే ప్రేమతో అక్కున చేర్చుకుంటారు. ఈ క్రమంలో పోసాని ఇప్పుడు `ఆపరేషన్‌ అరుణారెడ్డి` చిత్రంతో రాబోతున్నారు. తన కమ్‌ బ్యాక్‌ ఇచ్చేందుకు వస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సందేశాత్మకంగా `ఆపరేషన్‌ అరుణారెడ్డి`
Image Credit : Asianet News

సందేశాత్మకంగా `ఆపరేషన్‌ అరుణారెడ్డి`

పోసాని ఒకప్పుడు రైటర్‌గా ఎన్నో విజయాలు అందుకున్నారు. బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు తెలుగు ఆడియెన్స్ కి అందించారు. కానీ నటుడిగా పాపులర్‌ అయ్యారు. తనదైన విలనిజం చూపించి మెప్పించారు. అదే సమయంలో కామెడీతోనూ నవ్వులు పూయించారు. దర్శకుడిగా మాత్రం ఆలోచింప చేసే చిత్రాలు చేశారు. సమాజంలోని లోపాలను ఎత్తిచూపారు. రాజకీయాల్లోని కుళ్లుని ప్రశ్నించారు. తన సినిమా ద్వారా ఏదో ఒక సందేశాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆయన చేసిన `ఆపరేషన్‌ అరుణారెడ్డి` ద్వారా కూడా మంచి సందేశాన్ని ఆడియెన్స్ కి చెప్పబోతున్నారు.

34
అపరేషన్‌ అరుణారెడ్డి అసలు కథ ఇదే
Image Credit : Asianet News

అపరేషన్‌ అరుణారెడ్డి అసలు కథ ఇదే

`ఆపరేషన్‌ అరుణారెడ్డి` ఈ నెల 17న విడుదల కాబోతుంది. తన సొంతంగానే రిలీజ్‌ చేస్తున్నారు పోసాని. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంది. ఇందులో తన భార్య తనని ఎంత ప్రేమించింది, ఎంత మాయమాటల చెప్పి మోసం చేసింది, చివరికి తన జీవితం ఎలా మారిపోయిందనే విషయాన్ని చూపించారు. అయితే ఇది ఒక నిజాయితీ గల లేడీ జర్నలిస్ట్ అరుణారెడ్డి చుట్టూ సాగే కథ అని తెలిపారు పోసాని. ఏసియానెట్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకున్నారు. జర్నలిస్ట్ అంటే ఒక నాయకుడు కామెంట్‌ చేస్తే, ఆ నాయకుడి కామెంట్‌పై మీ అభిప్రాయం ఏంటని? ఈ నాయకుడు కామెంట్‌ చేస్తే, ఈయన కామెంట్‌పై ఈ అభిప్రాయం ఏంటని చెప్పడం కాదు, ప్రజలు ఎలా ఉండాలి? ఓటు వేసి గెలుపించుకున్న ప్రజలు ఎంతగా అప్రమత్తంగా ఉండాలి. తప్పు చేస్తే ప్రశ్నించాలి, అభివృద్ధి విషయంలో నిలదీయాలి అని చెప్పే చిత్రమిది.

44
పోసాని మార్క్‌ ట్రీట్‌మెంట్‌తో ఆపరేషన్‌ అరుణారెడ్డి
Image Credit : Asianet News

పోసాని మార్క్‌ ట్రీట్‌మెంట్‌తో ఆపరేషన్‌ అరుణారెడ్డి

ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయనేదాన్ని జర్నలిస్ట్ పాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నానని వెల్లడించారు. ప్రజలు అప్‌డేట్‌ కావాలని, రాజకీయాల్లో, సమాజంలో తప్పేంటి? రైట్‌ ఏంటనేది తెలుసుకోవాలని చెప్పే చిత్రమిదన్నారు. ప్రతి ఒక్క పౌరుడు చూడాల్సిన మూవీ అని తెలిపారు. కామెడీగా ఎంటర్‌టైన్‌ చేస్తూనే సందేశాన్ని అందిస్తుందని, ప్రస్తుత సమాజాన్ని అద్దం పట్టే మూవీ అవుతుందని, కచ్చితంగా ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందని తాను నమ్ముతున్నట్టు తెలిపారు. ఈ శుక్రవారం సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా పోసాని ఈ విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో  బీజేపీనేత రఘునందన్‌ రావు సీఎంగా కనిపించబోతున్నారు. హిందోళ చక్రవర్తి, కాజల్‌ శర్మ, ఆయేషా ఖాన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో పోసాని మార్క్ ట్రీట్‌మెంట్‌ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఆయనకి ఎన్టీఆర్ అయినా, చిరంజీవి అయినా ఒకటే..ఎదురు చూసే అలవాటు లేదు, అందుకే సినిమాలు చేయలేదు
Recommended image2
Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Recommended image3
Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?
Related Stories
Recommended image1
Janaki Love Story: ఫోటోతో మొదలైన ప్రేమ.. సినిమాను మించిన లెజెండరీ సింగర్‌ జానకి లవ్‌ స్టోరీ
Recommended image2
Lenin Day 4 Collections: సోమవారం భారీ డ్రాప్‌.. అఖిల్‌ `లెనిన్‌` నాలుగు రోజుల్లో కలెక్ట్ చేసింది ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved