Upasana : మెగా కోడలు ఉపాసన డెలివరీ ఖర్చు ఎంతో తెలుసా? ఎన్ని కోట్లు అయ్యాయంటే.!
మెగా కోడలు ఉపాసన కొణిదెల (Upasana Konidela) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. అయితే ఉపాసన డెలివరీ చార్జీలకు సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గ్గా మారింది.
పదేళ్లుగా ఎదురుచూస్తుండగా రామ్ చరణ్ - ఉపాసన పండటి ఆడబిడ్డతో తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు. ఈనెల 20న ఉదయం మెగా ప్రిన్సెస్ జన్మించిన విషయం తెలిసిందే. కొణిదెల వారింట మహాలక్ష్మి అడుగుపెట్టడంతో అంతా సంతోషించారు.
మెగా ప్రిన్సెస్ జన్మించిన రోజు సోషల్ మీడియా మొత్తం అభిమానులు హంగామా చేసిన విషయం తెలిసిందే. స్టార్స్, సెలబ్రెటీలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తమకు విషెస్ తెలిపారు. రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ చరణ్ దంపతులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. త్వరలో Mega Princess పేరును కూడా ప్రకటించబోతున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఉపాసన డెలివరీకి ఎంతో ఖర్చు వచ్చిందో తెలుసా? అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. ప్రెగెన్సీ కన్ఫమైనప్పటి నుంచి ఉపాసన కొణిదెల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఎక్ట్స్ పర్ట్ ద్వారా చెకప్ లు చేయించుకున్నారు. ఇక డెలివరీ అపోలోనే జరిగిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ లోని ప్రముఖ డాక్టర్లతో పాటు ఫారీన్ డాక్టర్లు కూడా వచ్చారని అంటున్నారు. దీంతో ఉపాసన డెలీవరికి బాగానే ఖర్చు అయ్యిందని టాక్ వినిపిస్తోంది. డెలివరీకి సంబంధించిన పరికరాలను కూడా విదేశాల నుంచి తెప్పించారని అంటున్నారు. దీంతో మొత్తంగా రూ. కోటీన్నర వరకు బిల్లు అయ్యిందని తెలుస్తోంది.
అయితే తనకు పండంటి కూతురు జన్మించడంతో రామ్ చరణ్ ఆ మొత్తాన్ని తానే పే చేశారని తెలుస్తోంది. తన అత్తమామలు భరిస్తామని చెప్పినప్పటికీ చెర్రీనే ఆ బిల్లు చెల్లించారంట. మొత్తానికి రామ్ చరణ్ - ఉపాసన తల్లిదండ్రులు కావడంతో అభిమానులు, మెగా ఫ్యామిలీ మెంబర్స్ పట్టలేని ఆనందంలో మునిగి తేలుతున్నారు.
ఇక రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ 21వ రోజున తన కూతురి పేరును ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికే ఓ పేరు కూడా అనుకున్నట్టు మీడియాతో చెప్పారు. ప్రస్తుతం చెర్రీ తన ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టారంట. కొంత గ్యాప్ తీసుకుంటారని వార్తలు వచ్చిన అదేమీ లేదని తేలిపోయింది.