MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్‌ వదులుకున్న సినిమాతో లైఫ్‌ టర్న్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన హీరో ఎవరో తెలుసా?

ప్రభాస్‌ వదులుకున్న సినిమాతో లైఫ్‌ టర్న్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన హీరో ఎవరో తెలుసా?

ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్‌ ప్రభాస్‌.. వదులుకున్న ఓ మూవీతో హిట్‌ అందుకున్న హీరో ఎవరో తెలుసా? ఇప్పుడు ఏకంగా పాన్‌ ఇండియా ఇమేజ్‌ తో దుమ్మురేపుతున్నాడు.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jul 20 2024, 06:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రభాస్‌ ఇండియన్‌ సినిమాని శాషిస్తున్నాడు. ఆయన `కల్కి 2898 ఏడీ`తో మరో సారి తానేంటో నిరూపించుకున్నాడు. ఈ మూవీ వెయ్యి కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఇలా బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్‌ కొట్టి ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు డార్లింగ్‌. భారతీయ సినిమాలోనే తిరుగులేని స్టార్ గా రాణిస్తున్నారు. 
 

25

అయితే కెరీర్‌ బిగినింగ్‌లో తాను చేయాల్సిన ఓ మూవీ, మరో హీరో వద్దకు వెళ్లింది. ఆయన హిట్‌ కొట్టాడు. ఆ సినిమాతోనే ఇండస్ట్రీలో నిలబడ్డాడు. ఇప్పుడు ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. ప్రభాస్‌ వదులుకున్న సినిమాతో సక్సెస్‌ అందుకుని ఇప్పుడు తగ్గేదెలే అంటున్నారు. మరి ఆ హీరో ఎవరో తెలుసా?

35
Allu Arjun

Allu Arjun

ఆయన ఎవరో కాదు, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ఆయన తొలి సినిమా `గంగోత్రి`. ఇది బన్నీని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. కానీ హిట్ గా చెప్పేంత కాదు. ఈ విషయంలో బన్నీ కూడా నిరాశతోనే ఉన్నాడు. సాలిడ్‌గా మరో సినిమా చేయాలని వెయిట్‌ చేస్తున్నారు. చాలా కథలు విన్నాడు ఏది నచ్చడం లేదు. ఇంకా ఏదో కావాలనే ఫీలింగ్‌ ఉంది. క్రేజీగా ఉండే సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. 
 

45

ఆ టైమ్‌లోన ప్రసాద్‌ ల్యాబ్‌లో సుకుమార్‌ కలిశారట. `ఆర్య` కథ చెప్పాడు. అది విని పిచ్చెక్కిపోయింది. ఎలాగైనా ఆ మూవీ చేయాలని ఫిక్స్అయ్యాడు బన్నీ. అందుకోసం అల్లు అరవింద్‌ని ఒప్పించాడు. వినాయక్‌ ధైర్యమిచ్చాడు. చిరంజీవి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడు. మొత్తంగా చాలా రోజులు చర్చల అనంతరం `ఆర్య` పట్టాలెక్కింది. సంచలన విజయం సాధించింది. అప్పట్లో ఇదొక క్రేజీ ఫిల్మ్ గా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. లవ్ స్టోరీలో ఇదొక డిఫరెంట్ మూవీగా నిలిచింది. ఈ మూవీతోనే బన్నీకి స్టార్‌ ఇమేజ్‌ వచ్చింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ సినిమా మొదట ప్రభాస్‌కే చెప్పాడు సుకుమార్. కానీ ఆయన తనకు ఇది సెట్ కాదని అన్నాడట. దీంతో బన్నీ వరకు వెళ్లింది. 
 

55

ఈ మూవీ తర్వాత బన్నీ వరుసగా `బన్నీ`, `దేశముదురు`, `రేసుగుర్రం`, `జులాయి`, `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `డీజే`, `సరైనోడు1, `అలా వైకుంఠపురములో` వంటి సినిమాతో విజయాలు అందుకుని సూపర్‌ స్టార్‌ అయ్యాడు. `పుష్ప`తో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన బన్నీ.. `పుష్ప2`తో మరోసారి ఇండియాని షేక్‌ చేసేందుకు వస్తున్నాడు. ఈ సారి పాన్‌ వరల్డ్ మార్కెట్‌ని టార్గెట్ చేయబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల కాబోతుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Arjun Das: ఆ గంభీరమైన గొంతు వెనుక ఇంత విషాదమా? ప్రేమలో విఫలమై కుంగిపోయిన ఓజీ నటుడు
Recommended image2
Rajamouli: రాజమౌళిలో ధైర్యం నింపిన సినిమా.. చిరంజీవి సినిమాతో పూర్తిగా అప్పుల్లోకి, కానీ
Recommended image3
ఆలియా భట్ ను బాక్సాఫీస్ క్వీన్‌గా మార్చిన 5 సినిమాలు.. ఒక మూవీ కలెక్షన్లు తెలిస్తే షాకే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved