MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • S Janaki Last Wish: వేల పాటలు పాడి జాతీయ అవార్డులు అందుకున్న ఎస్ జానకి చివరి కోరిక ఇదా.. నిజంగా షాకింగ్

S Janaki Last Wish: వేల పాటలు పాడి జాతీయ అవార్డులు అందుకున్న ఎస్ జానకి చివరి కోరిక ఇదా.. నిజంగా షాకింగ్

కొన్ని వేల పాటలు పాడి, లెక్కలేనన్ని పురస్కారాలు, జాతీయ అవార్డులు, ప్రశంసలు దక్కించుకున్న ఎస్ జానకి చివరి కోరిక ఏంటో తెలుసా. వింటే షాకింగ్ గా అనిపించడం ఖాయం.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 11 2026, 11:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఎస్ జానకి చివరి కోరిక
Image Credit : Asianet News

ఎస్ జానకి చివరి కోరిక

భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన లెజెండరీ గాయని ఎస్ జానకి మరణం సంగీత ప్రియులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అయితే ఆమె జీవితంలోని చివరి దశలో చెప్పిన కొన్ని ఆధ్యాత్మిక ఆలోచనలు ఇప్పుడు అందరినీ భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. తనకు ఇక ఎలాంటి కోరికలు లేవని, జీవితంలో అన్నీ చూశానని చెప్పిన జానకి.. "నేను ఎవరు?" అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనే ఆకాంక్ష మాత్రమే తనకు మిగిలి ఉందని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పరమాత్మను తెలుసుకోవడమే నిజమైన జీవితం
Image Credit : stockPhoto

పరమాత్మను తెలుసుకోవడమే నిజమైన జీవితం

మనిషి ఈ దేహం మాత్రమే కాదని, మనలోని పరమాత్మను తెలుసుకోవడమే నిజమైన జీవితం అని ఎస్ జానకి విశ్వసించేవారు. ఈ దేహం ఒక కారణంతో వస్తుందని, కానీ నిజమైన అస్తిత్వం పరమాత్మలోనే ఉందని ఆమె పేర్కొన్నారు. ఆ జ్ఞానం లభించే వరకు దేవుడు ఈ దేహాన్ని కాపాడాలని ప్రార్థించాలని, ప్రతి మనిషి తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆలస్యం చేయకూడదని ఆమె సూచించారు. తినడం, నిద్రపోవడం, మళ్లీ పుట్టడం వంటి జీవిత చక్రాన్ని దాటి ఆత్మ పరమాత్మలో ఐక్యం కావాలంటే పరమాత్మను తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు మరింత అర్థవంతంగా కనిపిస్తున్నాయి.

Related Articles

Related image1
S Janaki: ఎస్ జానకి ఒకే గెటప్ లో ఎందుకు కనిపిస్తారో తెలుసా ? దాని వెనకున్న విషాదం ఇదే
Related image2
Janaki: చిరంజీవి పేరు చెబితే రాధిక గొప్పగా చెప్పుకుంటుంది..అంతకంటే గొప్పగా నేను చెబుతా, ఎస్ జానకి కామెంట్స్
33
తొలి జాతీయ అవార్డు
Image Credit : Asianet News

తొలి జాతీయ అవార్డు

ఇక తన సంగీత ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, 'సిరిమల్లె పువ్వ' పాట తన హృదయానికి ఎంతో దగ్గరగా ఉందని జానకి తెలిపారు. అదే పాటను తమిళంలో పాడినప్పుడు తనకు తొలి జాతీయ అవార్డు వచ్చిందని, తర్వాత తెలుగులో రూపొందించినప్పుడు కూడా నిర్మాతల సెంటిమెంట్ కారణంగా అదే ట్యూన్‌ను కొనసాగించారని చెప్పారు. ఇప్పుడు ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆమె పాటలు, ఆమె స్వరం, అలాగే ఆమె ఆధ్యాత్మిక ఆలోచనలు తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిపోనున్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Roja Selvamani: ఐరన్ లెగ్ అంటూ రోజాపై దారుణంగా ట్రోల్స్, నేపాల్ వరదలు, నగరి పులిహోర ఘటనపై విమర్శలు
Recommended image2
ANR: ఏఎన్నార్ ఇచ్చిన 1 లక్ష రెమ్యునరేషన్ తో 5 ఎకరాలు కొని, కోట్లు సంపాదించిన హీరో ఎవరో తెలుసా?
Recommended image3
Rashmika Mandanna: సిగ్గు పడ్డట్లు అస్సలు అనిపించలేదు, మరిది సినిమాపై రష్మిక క్రేజీ కామెంట్స్
Related Stories
Recommended image1
S Janaki: ఎస్ జానకి ఒకే గెటప్ లో ఎందుకు కనిపిస్తారో తెలుసా ? దాని వెనకున్న విషాదం ఇదే
Recommended image2
Janaki: చిరంజీవి పేరు చెబితే రాధిక గొప్పగా చెప్పుకుంటుంది..అంతకంటే గొప్పగా నేను చెబుతా, ఎస్ జానకి కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved