MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • S Janaki: ఎస్ జానకి ఒకే గెటప్ లో ఎందుకు కనిపిస్తారో తెలుసా ? దాని వెనకున్న విషాదం ఇదే

S Janaki: ఎస్ జానకి ఒకే గెటప్ లో ఎందుకు కనిపిస్తారో తెలుసా ? దాని వెనకున్న విషాదం ఇదే

Singer S Janaki: గాన కోకిల ఎస్. జానకి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె పాటలతోనే కాదు, తన నిరాడంబరతతోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 11 2026, 10:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భర్త రామ్ ప్రసాద్ మరణం
Image Credit : Asianet News

భర్త రామ్ ప్రసాద్ మరణం

జానకమ్మ కెరీర్‌లో ఆమె భర్త వి. రామప్రసాద్ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనిది. 1997లో ఆయన చనిపోయారు. ఆ ఘటనతో జానకమ్మ జీవితం పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి ఆమె తనకిష్టంగా రంగుల చీరలు, బంగారు అంచు చీరలు కట్టుకోవడం మానేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గాయనిగా భర్త ఇచ్చిన ప్రోత్సాహం
Image Credit : Asianet News

గాయనిగా భర్త ఇచ్చిన ప్రోత్సాహం

ఎస్. జానకి చిన్నప్పటి నుంచే పాటలు పాడేవారు. కానీ, రామప్రసాద్‌తో పెళ్లి తర్వాత ఆమె గాన ప్రస్థానం మరింత ఉన్నత స్థాయికి చేరింది. జానకమ్మ గొంతును, ప్రతిభను రామప్రసాద్ ఎంతగానో మెచ్చుకునేవారు. ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచి, ప్రోత్సాహం అందించారు. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే జానకమ్మ గాన రంగంలో శిఖరాలను అధిరోహించారు.
35
మారిపోయిన జీవితం
Image Credit : Asianet News

మారిపోయిన జీవితం

1997లో రామప్రసాద్ కన్నుమూశారు. ఈ ఘటన జానకి జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భర్త దూరం కావడంతో ఆమె తీవ్రంగా కుంగిపోయారు. తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగాన్ని కోల్పోయినట్లు ఆమె భావించారు.
45
రంగుల చీరలకు దూరం
Image Credit : Asianet News

రంగుల చీరలకు దూరం

భర్త చనిపోకముందు జానకమ్మ రంగురంగుల చీరలు కట్టేవారు. జడలో మల్లెపూలు, నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో కళకళలాడేవారు. కానీ, రామప్రసాద్ మరణం తర్వాత ఆమె స్వయంగా వీటన్నింటికీ దూరమయ్యారు. అప్పటినుంచి తెలుపు లేదా లేత రంగు చీరలనే కట్టడం మొదలుపెట్టారు.  తన భర్తపై ఉన్న ప్రేమకు, గౌరవానికి గుర్తుగా ఆమె ఈ మార్పు చేసుకున్నారు. మన దేశంలో స్త్రీలు భర్త మరణించినప్పుడు దానిని సాంప్రదాయంగా ఫాలో అవుతారు.

55
దీని అర్థం ఏంటి?
Image Credit : Asianet News

దీని అర్థం ఏంటి?

భర్త మరణానికి సంతాపంగా, ఆయనకు గౌరవ సూచకంగా జానకమ్మ రంగుల చీరలను వదిలేశారు. తెలుపు రంగు సాధారణంగా పవిత్రతకు, వైరాగ్యానికి చిహ్నం. ఆమె ఎప్పుడూ ఆధ్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. బాహ్య ఆకర్షణల కంటే అంతర్గత శాంతికే ఆమె విలువిచ్చారు. రామప్రసాద్ మరణం తర్వాత ఆమెలోని నిరాడంబరత మరింత పెరిగింది. ఆడంబరాలకు దూరంగా, సాధారణ జీవితాన్ని గడిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
krishna: చార్లీ చాప్లిన్ గెటప్ వేయమంటే సూపర్ స్టార్ కృష్ణ ఏమన్నారో తెలుసా? షాక్ అయిన దర్శకుడు.. అస్సలు ఊహించలేదు..
Recommended image2
Irumudi 27 Days Collections: థియేటర్లో రవితేజ మాస్‌ జాతర.. 27వ రోజూ ఇరుముడికి సంచలన వసూళ్లు.. ఇక ఓటీటీ వంతు
Recommended image3
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Related Stories
Recommended image1
Nithya Menen: నిత్యామీనన్ టాప్ 5 సూపర్ హిట్ మూవీస్.. ఆ రెండూ లేకపోతే క్రేజీ హీరో కెరీర్ క్లోజ్
Recommended image2
Janaki: చిరంజీవి పేరు చెబితే రాధిక గొప్పగా చెప్పుకుంటుంది..అంతకంటే గొప్పగా నేను చెబుతా, ఎస్ జానకి కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved