MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki: చిరంజీవి పేరు చెబితే రాధిక గొప్పగా చెప్పుకుంటుంది..అంతకంటే గొప్పగా నేను చెబుతా, ఎస్ జానకి కామెంట్స్

Janaki: చిరంజీవి పేరు చెబితే రాధిక గొప్పగా చెప్పుకుంటుంది..అంతకంటే గొప్పగా నేను చెబుతా, ఎస్ జానకి కామెంట్స్

లెజెండ్రీ సింగర్ ఎస్ జానకి, మెగాస్టార్ చిరంజీవి మధ్య మంచి అనుబంధం ఉంది. చిరంజీవి సినిమాలకు లెక్కలేనన్ని పాటలు పాడానని జానకి ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 11 2026, 10:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జానకి మరణంతో విషాదంలో సినీ లోకం
Image Credit : Asianet News

జానకి మరణంతో విషాదంలో సినీ లోకం

ప్రముఖ గాయని ఎస్ జానకి మరణ వార్త తెలియగానే సినీలోకం మొత్తం విషాదంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 6 దశాబ్దాల పాటు జానకి అనేక భాషల్లో 48 వేలకు పైగా పాటలు పాడారు. ఎందరో గాయకులకు జానకి ఆదర్శంగా నిలిచారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా అభిమానించే గాయని ఆమె.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జానకి తెలుగులో పాటలు పాడిన మొదటి సినిమా
Image Credit : Asianet News

జానకి తెలుగులో పాటలు పాడిన మొదటి సినిమా

తెలుగులో ఆమె పాటలు పాడిన మొట్ట మొదటి చిత్రం ఎం ఎల్ ఏ. సావిత్రి, జగ్గయ్య నటించిన ఈ చిత్రం 1957లో విడుదలైంది. తెలుగులో ఆమె మొత్తం 12 నంది అవార్డులు అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, ఎస్ జానకికి మంచి అనుబంధం ఉంది. చిరంజీవి నటించిన ఇన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె పాటలు పాడారు.

Related Articles

Related image1
S Janaki: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. లెజెండ్రీ సింగర్ ఎస్ జానకి కన్నుమూత
Related image2
Nithya Menen: నిత్యామీనన్ టాప్ 5 సూపర్ హిట్ మూవీస్.. ఆ రెండూ లేకపోతే క్రేజీ హీరో కెరీర్ క్లోజ్
35
చిరంజీవి సినిమాలకు అద్భుతమైన పాటలు
Image Credit : Asianet News

చిరంజీవి సినిమాలకు అద్భుతమైన పాటలు

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, నీ మీద నాకు ఇదయ్యో, యమహో నీ యమా యమా అందం, సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది ఇలా ఎన్నో అద్భుతమైన పాటలని జానకమ్మ చిరంజీవి సినిమాల్లో పాడారు. ఓ అవార్డుల వేడుకలో జానకి.. చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవిని చూడగానే ఆమె.. నీ మీద నాకు ఇదయ్యో అంటూ పాట అందుకున్నారు. దీనితో అక్కడున్నవారంతా నవ్వేశారు. చాలా మంది హీరోయిన్లు, హీరోల తొలి చిత్రాలకు తానె పాటలు పాడానని జానకి గుర్తు చేసుకున్నారు. రాధికా, సుహాసిని లాంటి హీరోయిన్లకు తానె తొలి పాట పాడానని జానకి అన్నారు.

45
రాధిక, చిరంజీవిపై జానకి కామెంట్స్
Image Credit : Asianet News

రాధిక, చిరంజీవిపై జానకి కామెంట్స్

తన పాటలకు రాధిక ఎంతో అందంగా డ్యాన్స్ చేస్తుంది అని జానకి ప్రశంసలు కురిపించారు. చాలా మంది ఆర్టిస్టులకు నేను పాటలు పాడాను. చిరంజీవి గారి సినిమాలకు అయితే లెక్కలేనన్ని పాటలు పాడాను. చిరంజీవితో నేను ఎక్కువ సినిమాల్లో నటించాను అని రాధిక గొప్పగా చెప్పుకుంటుంది. అంతకంటే గొప్పగా నేను చెప్పుకుంటాను. ఆమెకంటే ఎక్కువగా చిరంజీవి సినిమాలకు నేను పాటలు పాడాను అని జానకి సరదాగా కామెంట్స్ చేశారు.

55
చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
Image Credit : Asianet News

చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

జానకి మరణ వార్త తెలియగానే చిరంజీవి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. 'జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది. నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే. నా కెరీర్‌లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు... ఆ జ్ఞాపకాలు... మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి. జానకమ్మ గారు ఒక గాయని మాత్రమే కాదు... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం. ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది. శ్రీమతి ఎస్. జానకి గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. జానకమ్మ గారు... మీ స్వరం ఎప్పటికీ అమరం' అంటూ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది.

నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే. 

నా కెరీర్‌లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి… pic.twitter.com/yTXS3NKkbk

— Chiranjeevi Konidela (@KChiruTweets) July 11, 2026

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Janaki: జానకి మగ గొంతుతో పాడిన పాటలు ఏవో తెలుసా? ఏకైక లేడీ మిమిక్రీ సింగర్ గా రికార్డు..
Recommended image2
Janaki Net Worth: ఎస్‌ జానకి ఎంత సంపాదించిందో తెలుసా? ఆమె ఆస్తుల విలువ తెలిస్తే మతిపోవాల్సిందే
Recommended image3
S Janaki: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. లెజెండ్రీ సింగర్ ఎస్ జానకి కన్నుమూత
Related Stories
Recommended image1
S Janaki: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. లెజెండ్రీ సింగర్ ఎస్ జానకి కన్నుమూత
Recommended image2
Nithya Menen: నిత్యామీనన్ టాప్ 5 సూపర్ హిట్ మూవీస్.. ఆ రెండూ లేకపోతే క్రేజీ హీరో కెరీర్ క్లోజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved