MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • చిరంజీవి, బాలయ్యతో పోటీగా వచ్చి దుమ్ములేపిన ప్రభాస్‌ సినిమా ఏంటో తెలుసా? ఇండస్ట్రీ మొత్తం షాక్‌..

చిరంజీవి, బాలయ్యతో పోటీగా వచ్చి దుమ్ములేపిన ప్రభాస్‌ సినిమా ఏంటో తెలుసా? ఇండస్ట్రీ మొత్తం షాక్‌..

ప్రభాస్‌ మామూలోడు కాదు.  అప్పటి వరకు ఒక్క హిట్‌ కూడా లేని డార్లింగ్‌.. ఏకంగా సూపర్ స్టార్లుగా రాణిస్తున్న చిరంజీవి, బాలకృష్ణలకు పోటీగా వచ్చాడు. దుమ్ములేపాడు.  

3 Min read
Author : Aithagoni Raju
Published : Jul 01 2024, 12:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రభాస్‌ ఇప్పుడు ఇండియన్‌ నెంబర్‌ వన్‌ స్టార్‌. ఆ విషయంలో మరో ఆలోచనే లేదు. `కల్కి 2898ఏడీ`తో ఆయన ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు. హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో అత్యధికంగా ప్రభాస్‌ మూవీస్‌ ఉండటం విశేషం. కృష్ణంరాజు వారసుడిగా సినిమాల్లోకి వచ్చని ప్రభాస్‌ తనకంటూ ఒక్కో స్టెప్‌ ఎక్కుతూ ఎదుగుతూ వచ్చాడు. `బాహుబలి` సినిమా ఆయన రేంజ్‌ని మార్చేసింది. పాన్‌ ఇండియా స్టార్‌ని చేసింది. ఇప్పుడు `కల్కి` గ్లోబల్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇదిలా ఉంటే ప్రభాస్‌ `ఈశ్వర్‌` చిత్రంతో హీరోగా తెలుగు తెరకి పరిచయం అయ్యారు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఓ మోస్తారుగా ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత `రాఘవేంద్ర` మూవీ సైతం ఆడలేదు. డిజాస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలో డార్లింగ్‌కి పెద్ద బ్రేక్ ఇచ్చిన మూవీ `వర్షం`. శోభన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో త్రిష హీరోయిన్‌ కాగా, గోపీచంద్‌ విలన్‌గా నటించారు. ఇండస్ట్రీని షేక్‌ చేసిన చిత్రమిది. ప్రభాస్‌, త్రిషల మధ్య లవ్‌ స్టోరీ, గోపీచంద్‌ విలనిజం సినిమాకి హైలైట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. 
 

37

ఇదిలా ఉంటే `వర్షం` చిత్ర విడుదల సమయంలో మరో సంచలనం చోటు చేసుకుంది. ఇండస్ట్రీ అంతా షాక్‌ అయ్యే సంఘటన చోటు చేసుకుంది. `వర్షం` సినిమా సంక్రాంతికి విడుదలైంది. అప్పటికీ ప్రభాస్‌కి ఎలాంటి ఇమేజ్‌ లేదు, కొత్త కుర్రాడుగానే ఉన్నాడు. ప్రభావం చూపించే స్థాయిలో లేడని అంతా అనుకున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి నటసింహం బాలయ్య కూడా అదే అనుకున్నారు. ప్రభాస్‌ని కన్సిడర్‌ చేయలేదు. పైగా సంక్రాంతికి అంటే రెండు మూడు సినిమాలకు స్కోప్‌ ఉంటుంది కాబట్టి, ప్రభాస్‌ కదా, ఓకేలే అనుకున్నారు. 
 

47

కానీ ప్రభాస్‌ కొట్టిన దెబ్బకి చిరంజీవికి, బాలయ్యకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే `వర్షం`.. చిరంజీవి నటించిన `అంజి`, బాలయ్య నటించిన `లక్ష్మీ నరసింహ` చిత్రాలకు పోటీగా విడుదలైంది. జనవరి 14న బాలయ్య మూవీ `లక్ష్మీ నరసింహ`తోపాటు ప్రభాస్‌ `వర్షం` రిలీజ్‌ అయ్యింది. నెక్ట్స్ డే జూన్‌ 15న చిరంజీవి `అంజి` విడుదలైంది. బాలకృష్ణ చిత్రానికి యావరేజ్‌ టాక్‌, `వర్షం`కి బాగుందన్నారు.
 

57

నెక్ట్స్ డే `అంజి` వచ్చింది. సోషియో ఫాంటసీ చిత్రం జనాలకు పెద్దగా ఎక్కలేదు. మొదటి రెండు మూడు రోజులు చిరు, బాలయ్యలు ప్రభావం చూపించారు. ఆ తర్వాత నెమ్మదిగా `వర్షం` పుంజుకుంది. ఏకంగా కుంభ స్థలాన్నే కొట్టింది. బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. ప్రభాస్‌కి తొలి బ్రేక్‌తోపాటు స్టార్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చింది. దీంతో చిరు, బాలయ్య మాత్రమే కాదు, ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్‌ అయ్యారు. 

67

ఈ విషయాన్ని ప్రభాస్‌.. బాలయ్య హోస్ట్ గా చేసిన `అన్‌ స్టాపబుల్‌` టాక్‌ షోలో  తెలిపారు. ఇందులో ఓ డైలాగ్‌ వినిపించి అది ఏ సినిమాలో చెప్పాల్సి ఉంటుంది. `వర్షం` మూవీ నుంచి వచ్చిన డైలాగ్‌ అది, ప్రభాస్‌ వెంటనే చెప్పాడు. దీంతో ఆ మూవీకి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇదే తన మొదటి హిట్‌ అని చెప్పారు ప్రభాస్‌. ఆ సినిమా వచ్చినప్పుడు మీరు(బాలయ్య) ఓ పక్కన, చిరంజీవిగారు మరో పక్కన. వాళ్లతో ఎందుకు సార్‌, మనం తర్వాత వేసుకుందామని ప్రభాస్‌ అన్నాడట. కానీ నిర్మాత ఎంఎస్‌ రాజు వినలేదట. 
 

77

దీనికి బాలయ్య కౌంటర్‌ వేశాడు. `మీరు రాజులు కదా మాట వినరు` అని, దీంతో పడి పడి నవ్వాడు ప్రభాస్‌. ఆ సినిమా ఆడుతుందని ముందు ఊహించారా అని బాలయ్య అడగ్గా, అన్ని సినిమాలు ఆడతాయనే చేస్తాం కదా సర్‌ అన్నాడు ప్రభాస్‌. నాకు అనుభవం లేదు సర్‌, కానీ ఆ మూవీ కచ్చితంగా ఆడుతుందనే నమ్మకం ఉంది అన్నారు ప్రభాస్‌. దీనికి `కుంభస్థలాన్ని బద్దలు కొట్టింది` అని బాలయ్య చెప్పడం హైలైట్‌గా నిలిచింది. ఈ వీడియో క్లిప్‌ ఇప్పుడు వైరల్‌గా మారడం విశేషం. ప్రస్తుతం బాలకృష్ణ `ఎన్బీకే109` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనికి బాబీ దర్శకుడు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved