Naga Chaitanya: ఎవరూ లేనప్పుడు నాగ చైతన్య శోభితను ఏమని పిలుస్తాడో తెలుసా.? ఎంత ప్రేమో..
Naga Chaitanya: నాగచైతన్య, శోభితా కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. శోభితపై తనకున్న ప్రేమను పలుసార్లు పంచుకున్నాడు చైతన్య. ఈ క్రమంలోనే తాజాగా శోభితాకు తనకు మధ్య జరిగే ఓ ఆసక్తికర విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సమంతతో విడాకుల తర్వాత చాలా కాలం పాటు ఒంటరిగా ఉన్న నాగచైతన్య శోభితాను ధూళిపాళ్లను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట పలుసార్లు మీడియా కంటికి చిక్కింది. అయితే వివాహానికి సంబంధించి చాలా రోజులపాటు గోప్యంగా ఉంచిన చైతన్య ఒక్కసారిగా పెళ్లి విషయాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. 2024 డిసెంబర్ 4న తేదీన హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో చై, శోభతల వివాహం జరిగింది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగింది.

Naga Chaitanya
కాగా నాగచైతన్య కెరీర్ విషయానికొస్తే 2023లో వచ్చిక కస్టడీ మూవీ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. దూత అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. ఇక వివాహం తర్వాత చైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'తండేల్'. సాయిపల్లవి హీరోయిన్‌గా, చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచిన చిత్ర యూనిట్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన్య పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తండేల్ మూవీలోని 'బుజ్జి తల్లి' సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగచైతన్య సాయిపల్లవిని ఇదే పేరుతో పిలుస్తాడు. అయితే ఈవెంట్‌లో ఎదురైన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. తాను ఇంట్లో శోభితని బుజ్జితల్లి అనే పిలుస్తానని చెప్పుకొచ్చారు. తండేల్ మూవీలో కూడా హీరోయిన్‌ను కూడా ఇలాగే పిలుస్తానని చెప్పుకొచ్చాడు. ఇది తెలిసిన అభిమానులు శోభితపై చైతన్యకు ఎంత ప్రేమో అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సందీప్ వంగా గురించి చైతన్య మాట్లాడుతూ.. తన సినిమాలే కాదు, సందీప్ వంగా ఇంటర్వ్యూల్లో మాటలు కూడా ఎంతో నిజాయతీగా, వాస్తవికంగా ఉంటాయన్నాడు. సందీప్ ఈ వేడుకకి రావడం ఆనందంగా ఉంది. ఈ దర్శకులతో, ఈ నిర్మాతలతో కలిసి సినిమా చేయాలని ప్రతి నటుడి దగ్గర ఓ జాబితా ఉంటుంది. అలాంటి నా జాబితాలో గీతా ఆర్ట్స్ పేరు మొదట్లో ఉంటుంది. ఈ సంస్థలో పనిచేస్తే ప్రతి నటుడికీ మంచి ఫలితం లభిస్తుంది. బన్నీ వాస్‌తో నా ప్రయాణం ఎప్పట్నుంచో మొదలైందని చెప్పుకొచ్చాడు.
తండేల్ సినిమాలో రాజు పాత్రకి, తన నిజ జీవితానికీ చాలా వ్యత్యాసం ఉందన్న నాగచైతన్య.. ఈ పాత్రకి తగ్గట్టుగా మారిపోవడానికి తనకు కావల్సినంత సమయం ఇచ్చారని, ఎంతో ఓపికగా నాతో కలిసి ప్రయాణం చేశారన్నాడు. మరి చాలా రోజుల తర్వాత ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్న నాగచైతన్య తండేల్ మూవీతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

