- Home
- Entertainment
- Hansika Glamour Photos: హన్సిక ఇప్పుడెలా ఉందో తెలుసా? స్లిమ్ గా మారి మెస్మైరైజ్ చేస్తోంది.. ఫొటోలు వైరల్
Hansika Glamour Photos: హన్సిక ఇప్పుడెలా ఉందో తెలుసా? స్లిమ్ గా మారి మెస్మైరైజ్ చేస్తోంది.. ఫొటోలు వైరల్
గ్లామర్ తో ‘దేశముదురు’లను సైతం తన వెంటపడేలా చేసిన హీరోయిన్ హన్సిక మోత్వాని (Hansika Motwani). 16 ఏండ్లకే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి యూత్ ను తన మాయలోకి లాగింది. గత రెండేండ్లుగా సినిమాకు గ్యాప్ ఇచ్చి.. మెస్మైరైజ్ చేసే బ్యూటీతో మళ్లీ వెట మొదలెట్టింది.

హన్సిక హీరోయిన్ గా తన డెబ్యూ ఫిల్మ్ తెలుగులో చేసినా.. హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తొలుత వెండితెరకు పరిచయం అయ్యింది. 2001 నుంచి 2004 వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా కొనసాగింది. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagganadh) హన్సికను సౌత్ ఆడియెన్స్ కు పరిచయం చేశారు.
పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘దేశముదురు’ సినిమా 2007లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించగా, హన్సిక హీరోయిన్ గా నటించి మెప్పించింది. వీరిద్దరి కెమిస్ట్రీకి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ మూవీకి ‘చక్రి’ సంగీతం అందించారు. మూవీ నుంచి రిలీజైన సాంగ్స్ అప్పట్లో దుమ్ములేపాయి.
దేశముదురు సినిమాలో నటించే వరకు హన్సిక వయస్సు 15 ఏండ్లే. సినిమా రిలీజ్ అయ్యే వరకు 16 ఏండ్లు నిండాయి. ఈ సినిమా తనకు తొలిచిత్రం. అందులోనూ మంచి విజయం సాధించడంతో హన్సికకు సౌత్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఆ వెంటనే వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ‘కంత్రి, మస్కా, బిల్లా, జయీ భవ, సీతా రాముల కళ్యాణం, కందిరీగ, హో మై ఫ్రెండ్, సింగం 2, పవర్’సినిమాల్లో నటించిన ప్రేక్షకులను అలరించింది.
మాస్ మహారాజ రవితేజ (Raviteja) నటించిన ‘పవర్’ మూవీలో హన్సిక నటించింది. ఈ చిత్రం తనకు తెలుగు చివరిగా హిట్ సినిమా నిలిచిపోయింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా హన్సికకు ఒరిగేదేమీ లేకుండా పోయింది.. మరోవైపు హన్సిక బొద్దుగా మారడంతో తెలుగులోనూ సినిమా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.
ఫలితంగా పెద్ద సినిమాల్లో అవకాశాన్ని కోల్పోయింది. ఇది గుర్తించిన హన్సిక ప్రస్తుతం తన బాడీని స్లిమ్ గా మార్చుకుంది. ప్రస్తుతం హన్సిక మోత్వాని ( Hansika Motwani) తాజా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు బొద్దుగా ఉన్న హన్సిక .. ప్రస్తుతం చాలా స్లిమ్ గా మారిపోయింది. జీరో సైజ్ అందాలతో ఫ్యాన్ కు షాక్ కు గురి చేస్తోంది.
హన్సిక మోత్వాని తాజా ఫోటోలు ఇంటర్నెట్‌లో దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ట్రెండీ వేర్ లో... స్లిమ్ ఫిట్ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తెలుగులో పెద్ద సినిమాల ఆఫర్లు లేకున్నా... తమిళంలో మాత్రం స్టార్ హీరోల సరసన నటిస్తూ వరుసగా సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం వెయిట్ లాస్ బాడీతో హన్సిక అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది.
హన్సిక పోస్ట్ చేసిన ఫొటోలకు క్యాప్షన్ కూడా యాడ్ చేసింది. ‘నా శక్తిని పొందడం ఒక ప్రత్యేక హక్కు’ అంటూ పేర్కొంది. అయితే ఒకప్పుడు హన్సిక బొద్దు గా కనిపించి... ఉన్నట్టుుండి స్లిమ్ అవడంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి అందం హన్సిక కోల్పోయిందంటూ అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఫ్యాన్స్ మాత్రం హన్సికకు మద్దుతుగా నిలుస్తున్నారు.
ఈ ఏడాది తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తోంది హన్సిక. ఇఫ్పటికే తన 50వ తమిళ చిత్రం ‘మహా’ మూవీలో నటించింది. ఇదీగాక మరో ప్రాజెక్ట్ కు కూడా సైన్ చేసిందంట హన్సిక. ప్రస్తుతం ‘పాట్నర్, రౌడీ బేబీ’ తమిళ చిత్రాల్లో నటిస్తోంది. తమిళ డైరెక్టర్ విజయ్ చందర్ మూవీతోనూ అలరించనుంది. మరోవైపు తెలుగులో 105 మినిట్స్, మై నేమ్ ఈజ్ శ్రుతి సినిమాల్లో నటిస్తోంది.