Actress Turned as Monk : సన్యాసిగా మారిన రామ్ గోపాల్ వర్మ హీరోయిన్.. ఎవరో తెలుసా?
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్ (Ram Gopal Varma) హీరోయిన్ ఒకరు సన్యాసిగా మారడం ప్రస్తుతం హాట్ టాపిక్ గ్గా మారింది. ఇంతకీ ఆమె ఎవరనే విషయం తెలుసుకుందాం.

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ లో చాలా సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అక్కడి టాప్ హీరోలతో గుర్తుండిపోయే సినిమాలను తీశారు.
అయితే రామ్ గోపాల్ వర్మ చిత్రాల్లో నటించి చాలా మంది నటీమణులు కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఆర్జీవీ యంగ్ బ్యూటీలకు ఎలా లైఫ్ ఇస్తున్నారో చూస్తూనే ఉన్నాం.
కానీ రామ్ గోపాల్ వర్మ, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ (Ajay Devgn) కాంబోలో వచ్చిన ‘భూత్’ చిత్రం నటి సన్యాసిగా మారింది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బర్ఖా మదన్ (Barkha Madan).
ఈమె తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ హిందీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ దక్కంచుకున్నారు. 90లలో వరుస చిత్రాలతో అలరించారు. ఇక ఉన్నట్టుండి ప్రస్తుతం బద్ధ సన్యాసిగా మారిపోయారు.
సన్యాసి వేషదారణలో ఉన్న ఆమె ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక బర్ఖా మదన్ కోట్ల ఆస్తులు వదులుకొని ఇలా ఆధ్యాత్మిక బాటలో నడిచినట్టు తెలుస్తోంది. ఇప్పుడిమె న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారింది.
ఇక ఆమె అక్షయ్ కుమార్ ’ఖిలాడియోన్ కా ఖిలాడి’తో నటిగా మారింది. తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఐశ్వర్యా రాయ్, సుష్మితా సేన్ లతో పోటీగా 1994లో మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొంది. మొదటి రన్నరప్ గా నిలిచింది. నవంబర్ 2012 నుంచి ఆమె బౌద్ధ సన్యాసినిగా మారినట్టు తెలుస్తోంది.