- Home
- Entertainment
- Neha Shetty: ట్రోల్స్ పై రియాక్ట్ అయిన `డీజే టిల్లు` భామ నేహా శెట్టి.. `శెట్టి`పై ఇంట్రెస్టింగ్ కామెంట్..
Neha Shetty: ట్రోల్స్ పై రియాక్ట్ అయిన `డీజే టిల్లు` భామ నేహా శెట్టి.. `శెట్టి`పై ఇంట్రెస్టింగ్ కామెంట్..
నేహాశెట్టి మీడియాతో ముచ్చటించింది. `డీజే టిల్లు` సినిమా గురించి, ట్రోల్స్ పై, `శెట్టి`పేరుపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

`డీజే టిల్లు` చిత్ర ట్రైలర్‌తో ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకుంది నేహా శెట్టి. సిద్ధుతో కలిసి ఆమె నటించిన `డీజే టిల్లు` చిత్రం ఫిబ్రవరి 12న విడుదల కాబోతుంది. విమల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా శుక్రవారం నేహాశెట్టి మీడియాతో ముచ్చటించింది. `డీజే టిల్లు` సినిమా గురించి, ట్రోల్స్ పై, `శెట్టి`పేరుపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాల్యం నుంచే నటి కావాలనే కోరిక ఉండేదట నేహాకి. చిన్నప్పుడు హృతిక్ రోషన్ సినిమాలో డాన్సులు చూసి చిత్రరంగంపై ఇష్టాన్ని పెంచుకున్నాని తెలిపింది. స్టడీస్ పూర్తయ్యాక మోడలింగ్ చేశానని, ఆ క్రమంలోనే మలయాళంలో `ముంగారమళై 2` చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చిందని చెప్పింది. అదే సమయంలో తెలుగులో పూరీ జగన్నాథ్ గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. `మెహబూబా` చిత్రంలో నటించాను. ఆ సినిమా తర్వాత కొన్నాళ్లు యూఎస్ వెళ్లి అక్కడ న్యూయార్క్ ఫిల్మ్ అకాడెమీలో నటనలో కోర్సు నేర్చుకున్నాను. అక్కడి నుంచి వచ్చాక `గల్లీ రౌడీ`, `మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్` చిత్రాల్లో నటించాను. ఇప్పుడు `డీజే టిల్లు` సినిమా విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది.
ఇంకా నేహా శెట్టి చెబుతూ, `డీజే టిల్లు` ట్రైలర్ చూసి రొమాంటిక్ ఫిల్మ్ అనుకుంటారు కానీ ఈ సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపిన ఒక ప్యాకేజ్ లాంటిది. ఇందులో కామెడీ, థ్రిల్, ఎంటర్ టైన్ మెంట్, రొమాన్స్ అన్నీ ఉన్నాయి. సినిమాలో రాధిక పాత్రలో నటించాను. ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంతా రాధిక ఆప్తే అని పిలుస్తున్నారు. రాధిక ఈతరం అమ్మాయి, నిజాయితీగా, ఆత్మవిశ్వాసంతో ఉంటుంది, తను కరెక్ట్ అనుకున్న పనిని చేసేస్తుంది. ఎవరేం అనుకుంటారు అనేదాని గురించి ఆలోచించదు. తను తీసుకునే నిర్ణయాల గురించి పూర్తి స్పష్టతతో ఉంటుంది.
రాధిక క్యారెక్టర్ ను నేను త్వరగా అర్థం చేసుకోగలిగాను. ఆ పాత్రలా మారిపోయాను. తప్పును తప్పులా ఒప్పును ఒప్పుగా చెబుతుంది. నేను రాధిక క్యారెక్టర్ తో చాలా రిలేట్ చేసుకోగలను. ఇలాంటి పాత్రను నేను సినిమాల్లో ఇప్పటిదాకా చూడలేదు. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న పాత్ర అది. రాధిక పాత్రలో నటించేప్పుడు దర్శకుడు విమల్ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నానుంచి సహజంగా ఆ పాత్ర స్వభావం ఎలా ఉంటుందో చూపించాలనుకున్నారు. కానీ నేను భయపడ్డాను. నేను అనుకున్నట్లు చేస్తే ఎలా వస్తుందో అని. కానీ అందరికీ రాధిక క్యారెక్టర్ లో నేను నటించిన విధానం నచ్చింది.
ఈ సినిమా చెప్పినప్పుడు బాగా నవ్వుకున్నాను. నేను తెలంగాణ వినడం యాస కొత్త. ఈ యాసలో కామెడీ చేస్తున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఈ యాసలో ఇంకా సినిమాలు రావాలి. చాలా ఫ్రెష్ కామెడీ కథలో ఉంటుంది. హీరోను రాధిక కన్ఫ్యూజ్ చేసినట్లు ట్రైలర్ లో చూపించాం. రాధిక ఏం చేసినా దానికో కారణం ఉంటుంది. అదేంటి అనేది సినిమా చూసినప్పుడు తెలుస్తుంది.
సిద్ధు టాలెంటెట్ యాక్టర్. అతను యాక్ట్ చేస్తుంటే నేనే నవ్వు ఆపుకోలేకపోయాను. అతను రచయిత, గాయకుడు కూడా. సిద్ధు నుంచి నటనలో చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను, సిద్దు, విమల్, బ్రహ్మాజీ, ప్రిన్స్ మేమంతా స్నేహితుల్లా సరదాగా ఉండేవాళ్లం. పాండమిక్ వల్ల మనమంతా ఒత్తిడికి గురయ్యా, బాధపడ్డాం, ఆ ఒత్తిడినంతా డిజె టిల్లు చూస్తే నవ్వుతూ మర్చిపోతారని చెప్పగలను. నేను నటించబోయే కొన్ని సినిమాలకు సంప్రదింపులు జరుగుతున్నాయి. ఖరారు కాగానే చెబుతాను` అని తెలిపింది నేహా శెట్టి.
ట్రోల్స్, సోషల్ మీడియా కామెంట్లపై ఆమె స్పందిస్తూ, వాటిని చదువుతానని, కాకపోతే వాటిని పెద్దగా పట్టించుకోనని తెలిపింది. వాటి ప్రభావం తనపై ఉందని పేర్కొంది. అదే సమయంలో ఇటీవల జరిగిన ఇష్యూ గురించి స్పందిస్తూ, జరిగింది జరిగిపోయిందని, పాస్ట్ గురించి ఆలోచించి టైమ్‌వేస్త్ చేసుకోనని తెలిపింది. సినిమా కెరీర్ పరంగా తాను హ్యాపీగానే ఉన్నానని, అవకాశాల పరంగానూ ఎలాంటి రిగ్రెట్ లేదని చెప్పింది. మంచి కథ, మంచి పాత్ర అనిపిస్తే నటిస్తానని, తనకు ఎలాంటి కండీషన్స్ లేవని పేర్కొంది. ప్రస్తుతం తన లైనప్‌లో చాలా సినిమాలున్నాయని, ఆ వివరాలు మున్ముందు తెలుస్తాని పేర్కొంది నేహా శెట్టి. మరో వైపు `శెట్టి` పేరుతో హీరోయిన్లు వరుసగా వస్తున్నారనే ప్రశ్నకి, `శెట్టి` ఆర్గనైజేషన్ పెట్టాలేమో అంటూ ఫన్నీగా కామెంట్ చేసింది నేహా.