- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: తల్లి కాళ్లు పట్టుకున్న విక్రమ్.. గట్టి సాక్ష్యాలతో పెద్ద షాకిచ్చిన లాస్య?
Intinti Gruhalakshmi: తల్లి కాళ్లు పట్టుకున్న విక్రమ్.. గట్టి సాక్ష్యాలతో పెద్ద షాకిచ్చిన లాస్య?
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. భర్తని సవతి తల్లి చెరనుంచి విడిపించాలని తపన పడుతున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 23 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నా కొడుకు ఇలా బ్రష్టు పట్టిపోతుంటే చూస్తూ ఉండటానికేనా నేను ఇంకా బ్రతికున్నది ఈరోజు తల్లిగా నేను ఓడిపోయాను అంటూ దొంగ కన్నీరు పెట్టుకుంటుంది రాజ్యలక్ష్మి. అయినా ఇన్నాళ్లు పెంచిన మీ అమ్మ మాట కాదని 20 రోజుల క్రింద వచ్చిన నీ భార్య మాటకి విలువిస్తావా ఏంట్రా ఇది అంటూ మేనల్లుడిని నిలదీస్తాడు బసవయ్య.
వెంటనే షూస్ అవీ తీసేసి తల్లి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి ఇంకెప్పుడూ ఇలా జరగకుండా చూసుకుంటాను అని మాటిస్తాడు విక్రమ్. వెళ్లి బట్టలు మార్చుకొని రా అని కొడుక్కి చెప్పింది రాజ్యలక్ష్మి. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్లిపోయిన తర్వాత ఇప్పటికైనా అర్థమైందా ఈ రాజ్యలక్ష్మి అంటే ఏంటో అంటూ దివ్య వైపు గర్వంగా చూస్తుంది. మరోవైపు లాస్య దగ్గరికి వస్తుంది తులసి.
గుమ్మంలోనే ఎందుకు వచ్చావు అంటూ కసురుకుంటుంది లాస్య. చాలా రోజుల తర్వాత తులసి అక్క మా ఇంటికి వచ్చింది మర్యాదలు చేసుకోనివ్వు అంటుంది భాగ్య. నేను నీ సమస్యని తీర్చడానికే వచ్చాను అంటుంది తులసి. నామీద జాలితో వచ్చిందా.. మీ బావగారి మీద ప్రేమతో వచ్చిందా అడుగు భాగ్య అంటుంది లాస్య.
అలా అడిగితే తను మాత్రం ఏం చెప్తుంది మనకి కావాల్సింది సమస్యకి పరిష్కారం అంటుంది భాగ్య. లాస్యకి కావలసింది తన కాపురం నిలబడటం, కేఫ్ ఈ రెండు తనకి దక్కేలాగా నేను చేస్తాను నాతో రమ్మను అంటుంది తులసి. నా అనుమానాలు నాకు ఉన్నాయి ఈ డీలింగ్ ఏదో నందు వొచ్చి చెప్పొచ్చు కదా అంటుంది లాస్య. లడ్డు వస్తే తినేయాలి అంతే. కుడి చేత్తో ఎందుకు ఇచ్చావు, ఎడం చేత్తో ఎందుకు ఇవ్వలేదు అని కాలక్షేపం చేస్తే లడ్డు పాచిపోతుంది అంటూ గడ్డి పెడుతుంది భాగ్య.
అదంతా నాకు తెలియదు రేపటిలోగా నందు వచ్చి నా చేయి పట్టుకొని ఇంటికి తీసుకు వెళ్తే సరేసరి లేదంటే కోర్టులోనే తేల్చుకుందాం అని ఖరాకండి గా చెప్తుంది లాస్య. ఏమి మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తులసి. మరోవైపు తాతయ్య పక్కన పడుకుని ఏమైనా కబుర్లు చెప్పమంటాడు విక్రమ్. విక్రమ్ ని కోపంగా చూస్తాడు తాతయ్య. నేనేం చేశాను ఎందుకు అంత కోపంగా చూస్తావు అయినా అమ్మ ఏదో ఆడియో పంపించింది అది వింటూ పడుకుంటాను అని భగవద్గీత పెట్టుకుంటాడు విక్రమ్. అది పవిత్రమైన భగవద్గీత నిద్ర మాత్ర కాదు అంటూ ఫోన్ ఆపేస్తాడు తాతయ్య.
మరోవైపు మాధవి భర్త తులసికి ఫోన్ చేసి కేసు విషయంలో నాకేమీ పాలుపోవటం లేదు అందుకే నీకు ఫోన్ చేశాను అంటాడు. ఏం చేయడానికైనా ఆయన సహకరించాలి కదా పూర్తిగా ఓటమికి సిద్ధపడిపోయారు అంటుంది తులసి. ఇంతలో నందు రావటం గమనించి తర్వాత ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది తులసి. నందు తులసి దగ్గరికి వచ్చి దివ్యని చూడాలనిపిస్తుంది అక్కడికి వెళ్దాము అంటాడు.
మరి ఏం చేయమంటావు అంటాడు విక్రమ్. మీ అమ్మ మనసుతో కాదు నీ మనసుతో ఆలోచించు అప్పుడప్పుడు తీయ్యని తప్పులు చేయొచ్చు లేదంటే మీ అమ్మ జీవితాంతం నా పక్కనే పడుకోబెడుతుంది అంటాడు తాతయ్య. ఇంతలోనే దివ్య వచ్చి విక్రమ్ ని టెంప్ట్ చేస్తుంది. తాతయ్య నువ్వు అన్నట్టే తియ్యని తప్పు చేయటానికి వెళ్తున్నాను అంటూ దివ్య వెనుక వెళ్తాడు విక్రమ్. అది రాజ్యలక్ష్మి వాళ్ళు చూస్తారు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు బసవయ్య. మనసు చెప్పినట్లు విందామని అంటాడు బసవయ్య. నీ అవస్థ నాకు అర్థమవుతుంది
కానీ ఏం చేస్తాం సంప్రదాయానికి విరుద్ధంగా వెళ్తే ఇంటికి ఏమైనా అరిష్టం వస్తే ప్రమాదం కదా రాజ్యలక్ష్మి. బసవయ్య తన పక్కనే పడుకోబెట్టుకుంటానంటూ విక్రమ్ ని తీసుకువెళ్లిపోతాడు. ఇదంతా చూస్తున్నా దివ్య వైపు మళ్లీ గర్వంగా చూస్తుంది రాజ్యలక్ష్మి. మరోవైపు అత్తమామలకి భోజనం వడ్డిస్తూ లాస్య సంగతి చెప్తుంది తులసి. నువ్వు వెళ్లేటప్పుడు చెప్పాల్సింది నందుని ఒప్పించే వాళ్ళం కదా అంటుంది అనసూయ. చెప్తే వెళ్ళనివ్వరు కదా అత్తయ్య అందుకనే చెప్పలేదు పోనీ ఆ ఒప్పించే లేదు ఇప్పుడు ఒప్పించండి నువ్వు కూర్చుంటే సమస్య రోజు రోజుకి పెద్దదవుతుంది తప్ప సమస్య తీరేదిగా అనిపించడం లేదు అంటుంది తులసి.
తరువాయి భాగంలో లాస్యకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పటానికి దొంగ సాక్షులను తీసుకొస్తాడు మాధవి భర్త. లాస్య కూడా నందు తనని కొట్టినప్పుడు తీసిన వీడియోని సాక్ష్యంగా తీసుకువస్తుంది. ఈ సాక్షాలని పరిగణలోకి తీసుకోవడం లేదు అని చెప్తాడు జడ్జి. నందు తో సహా అందరూ షాక్ అవుతారు.