- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: ఫుల్ గా మందుకొట్టి అందరి ముందు రెచ్చిపోయిన లాస్య.. తులసితో ఛాలెంజ్!
Intinti Gruhalakshmi: ఫుల్ గా మందుకొట్టి అందరి ముందు రెచ్చిపోయిన లాస్య.. తులసితో ఛాలెంజ్!
Intinti Gruhalakshmi: బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

లాస్య ఫంక్షన్ లో తులసి (Tulasi) పరువు పోగొట్టడానికి ఎలాగైనా మందు తాగించే ప్రయత్నంలో ఉంటుంది. ఇక ఆది దూరం నుంచి దివ్య గమనించి ఏదో కుట్ర చేస్తోందని ఆలోచిస్తుంది. మరోవైపు అక్షర వాళ్ళ తండ్రి.. స్టేజి మీద భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం గురించి చెబుతాడు.
ఇక ఆది తులసి, నందు (Nandhu) లు గ్రహించుకొని ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత అనసూయ (Anasuya) దంపతులతో.. శృతి, దివ్యలు స్టెప్పులు వేసుకుంటూ ఒక రేంజ్ లో చిల్ అవుతారు. మరోవైపు లాస్య మజా కూల్ డ్రింక్ లో మందు కలుపుతుంది. ఇక ఆది తులసి తగేలా చేస్తుంది. ఇక ఈ దెబ్బతో అందరు తులసి (Tulasi) ను చీ కొడతారు అని లాస్య ఆనంద పడుతుంది.
ఇక మరోవైపు లాస్య (Lasya) డ్రింక్ తాగిన తులసికి మత్తు ఎందుకు రావడం లేదు అని చిరాకు పడుతుంది. ఇక ఇందులో చెప్పాల్సిన విషయం ఏమిటంటే దివ్య (Divya) ఆ డ్రింక్ ను మార్చేసి ఆ డ్రింక్ లాస్య తాగేలా చేస్తుంది. ఇక ఫుల్గా మందు తాగిన లాస్య ఫంక్షన్ లో మరో లెవెల్ లో స్టెప్పులు వేస్తుంది.
ఈ క్రమంలో లాస్య (Lasya) ను ఆపడానికి నందు వస్తాడు కానీ లాస్య ఏమాత్రం లెక్కచేయకుండా తాగిన మత్తులో నందును నెట్టేస్తుంది. ఇక తులసి లాస్యను పక్కకి లాక్కుని వచ్చి లాస్య ముఖంపై నీళ్లు కొడుతుంది. దాంతో లాస్య నిన్ను వదలను తులసి (Tulasi) అని రియాక్ట్ అవుతుంది.
ఆ క్రమంలో తులసి (Tulasi) లాస్యతో నందగోపాల్ తో నీ మురిపమ్ మూడు రోజులు మాత్రమే అని అంటుంది. అంతేకాకుండా నీ చేష్టలకి నందు (Nandhu) నిన్ను వదిలేసి పారిపోతాడు అని చెబుతుంది. ఆ విషయం గురించి వారిద్దరి మధ్య ఛాలెంజ్ నడుస్తుంది.
ఇక తరువాయి భాగంలో తులసి దగ్గరకు వాళ్ళ తోటి కోడలు వచ్చి ఈ ఇంటి విషయంలో నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది అని అంటుంది. ఇక ఈ క్రమంలో తులసి (Tulasi) షాక్ అవుతుంది. కాగా రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.