- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: కోడలికి పరీక్ష పెట్టిన రాజ్యలక్ష్మి.. కూతురి ఏడుపును చూసి కంగారుపడుతున్న తులసి దంపతులు?
Intinti Gruhalakshmi: కోడలికి పరీక్ష పెట్టిన రాజ్యలక్ష్మి.. కూతురి ఏడుపును చూసి కంగారుపడుతున్న తులసి దంపతులు?
Intinti Gruhalakshmi: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. కూతురు బ్రతుకు ఏమవుతుందో అని తపన పడుతున్న ఒక తండ్రి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో మీరు ఎక్కువ మానసిక సంఘర్షణ పడుతున్నట్లుగా ఉన్నారు అని నందుతో అంటుంది తులసి. సంఘర్షణ కాదు పెద్ద యుద్ధమే జరుగుతుంది అందులో గెలుస్తానో, ఓడిపోతానో అర్థం కావట్లేదు అంటాడు నందు. వెళ్లి ఆంజనేయస్వామి దండకం చదువుకుంటూ పడుకోండి అంటుంది తులసి.
మన పెళ్లి అయిన కొత్తలో మీ అమ్మగారు వాళ్ళు తరచుగా ఇంటికి వస్తుంటే పిచ్చోళ్ళు అనుకునేవాడిని. కానీ నా కూతురికి పెళ్లయిన తర్వాత ఆ బాధ ఏంటో తెలిసింది అంటూ బాధపడతాడు నందు. పోనీలెండి ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు, ఇప్పటికే లేట్ అయింది రేపు వ్రతానికి వెళ్లాలి వెళ్లి పడుకోండి అంటుంది తులసి. మరోవైపు దివ్య ఆలోచనలతో నిద్ర పట్టక అవస్థ పడుతున్న విక్రమ్ చూసి నవ్వుకుంటాడు వాళ్ళ తాతయ్య.
మనవడిని ఆటపట్టించడం కోసం రొమాంటిక్ సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉంటాడు. ఏంటి తాతయ్య ఆ పాటలు నాకు అసలే నిద్ర పట్టడం లేదు నన్ను చూస్తే నీకు జాలి వేయటం లేదా అంటాడు విక్రమ్. చేవలేని వాడి గురించి ఆలోచించడం వేస్ట్ అంటాడు తాతయ్య. నేను చేవలేని వాడినా? అమ్మే కదా ముహూర్తాలు లేవని చెప్పింది అంటాడు విక్రమ్. పెద్దవాళ్లు అలాగే అంటారు. వాళ్ల జాతకాలు వాళ్ళవి. నా పెళ్ళెప్పుడు నాకు కూడా ఇలాంటి సమస్య వచ్చింది.
కానీ నేను ఊరుకోలేదు అంటూ తన కథ చెప్పి మనవడిని రెచ్చగొడతాడు విక్రమ్ వాళ్ళ తాతయ్య. రెచ్చిపోయిన విక్రమ్ ఆవేశంగా దివ్య గదిలోకి వెళ్తాడు. విక్రమ్ ని సడన్ గా అక్కడ చూసి గట్టిగా అరుస్తుంది దివ్య. వచ్చింది నేనే గట్టిగా అరవకు నాకు కావలసింది ఇచ్చేయ్ వెళ్ళిపోతాను అంటాడు విక్రమ్. ఇప్పుడు కాదు రేపు ఇస్తాను సాంప్రదాయాలని పాటించాలి కదా అంటూ విక్రమ్ ని బలవంతంగా గదిలోంచి బయటికి పంపించేస్తుంది దివ్య.
మరోవైపు నువ్వు నన్ను చూసుకో, నేను నీకు కావలసిన పనులన్నీ చూసుకుంటాను కంటి సైగ చెయ్యు చాలు పనులన్నీ చక చక చేసేస్తాను అని రాజ్యలక్ష్మి తో చెప్తాడు బసవయ్య. ఇంతలో తన భార్య వచ్చి కంటి సైగతో ఏదో చెప్తుంది. అర్థం కాని బసవయ్య ఏంటి అని అడుగుతాడు. ఇప్పుడే చెప్పారు కదా కంటి సైగతో పనులు చేసేస్తానని మరి అర్థం చేసుకోవడం లేదేమి అంటుంది ఆవిడ. నేను చెప్పింది మా అక్కయ్య కోసం, నీ కోసం కాదు అంటూ పెళ్ళాం మీద కేకలు వేస్తాడు బసవయ్య.
వాళ్ళిద్దర్నీ చూసి నవ్వుకుంటుంది రాజ్యలక్ష్మి. మరోవైపు దివ్య దగ్గరికి వెళ్లి నిన్ను ఇలా చూస్తూ కూర్చోవడం ఇబ్బందిగా ఉంది. ఉపవాసం ఉన్నవాడి ముందు బిర్యానీ ప్లేట్ పెట్టినట్లుగా ఉంది అంటాడు విక్రమ్. లొట్టలు వేస్తూ చూస్తూ కూర్చోండి అంటూ ఆట పట్టిస్తుంది దివ్య. దివ్యని హగ్ చేసుకోబోతే అక్కడ నుంచి పారిపోతుంది. ఆమె వెనకే పరిగెడతాడు విక్రమ్. వాళ్ళిద్దరూ చాలా సరదాగా ఉండడాన్ని చూసి కుళ్లుకుంటారు రాజ్యలక్ష్మి, బసవయ్య.
మెడలో తాళి పడిన తర్వాత ఈ పరుగులు మనం ఆపలేము, నువ్వు ఏదేదో ఊహించుకున్నావు కానీ వాళ్ల కళ్ళకి మనం కనపడం, చూడలేక మన కళ్ళు మనం మూసుకోవాల్సిందే అంటాడు బసవయ్య. ఈలోగా దివ్య వాళ్లు అనుకోకుండా రాజ్యలక్ష్మి ముందుకి వస్తారు. పడితే కాళ్లు విరుగుతాయి జాగ్రత్త అంటూ కొడుకుని వెటకారమాడుతుంది రాజలక్ష్మి. ఇందాకే పంతులుగారు ఫోన్ చేశారు వ్రతానికి సంబంధించిన పనులన్నీ పెళ్లికూతురు చేయాలంట లేకపోతే అరిష్టమంట అంటుంది రాజ్యలక్ష్మి.
మీరు ఒక్కొక్కటిగా చెప్తూ ఉండండి నేను చేసుకుంటూ పోతాను అంటుంది దివ్య. పెద్దగా ఏమీ లేవు అంటూనే పెద్ద లిస్టు చెప్తుంది. ఏ పని లేదంటూనే పెద్ద లిస్టు చదివావమ్మా అంటాడు విక్రమ్. తల్లిని అనుమానిస్తున్నావా అంటూ రెచ్చగొడతాడు బసవయ్య. నేనేం చేసినా వాడి మంచి కోసమే అని వాడికి తెలుసు అంటుంది రాజ్యలక్ష్మి. దేవుడి మండపాన్ని అలంకరించు అని చెప్పటంతో అక్కడికి వెళ్లిన దివ్య నాకు అన్ని పనులు వచ్చనుకొని అత్తయ్య గారు చెప్పేస్తున్నారు.
రాదు అంటే ఏమనుకుంటారో అనుకుంటుంది. పటం పెట్టడంలో పొరపాటు చేస్తే మీ ఇంట్లో ఎప్పుడూ వ్రతం చేసుకోలేదా మీ అమ్మ నీకు ఏమీ నేర్పలేదా అంటూ దెప్పుతుంది. తరువాయి భాగంలో బసవయ్య భార్య, రాజ్యలక్ష్మి ఇద్దరూ దివ్యకి పనులు చెప్పటం అందులో తప్పులు ఎంచడం చేస్తూ దివ్యని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. అంతలో తులసి రావటంతో ఆమెని పట్టుకొని కన్నీరు పెట్టుకుంటుంది దివ్య. ఏమైంది అంటూ కంగారు పడిపోతారు తులసి దంపతులు.