- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: అత్తకు భయాన్ని పరిచయం చేసిన దివ్య.. కొడుకు కోపానికి షాకైన రాజ్యలక్ష్మి?
Intinti Gruhalakshmi: అత్తకు భయాన్ని పరిచయం చేసిన దివ్య.. కొడుకు కోపానికి షాకైన రాజ్యలక్ష్మి?
Intinti Gruhalakshmi: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి రేటింగ్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. సమస్యలలో ఉన్న తన మాజీ భర్తని రక్షించుకోవడానికి తపన పడుతున్న ఒక మాజీ భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నేను ఇప్పుడప్పుడే కేఫ్ కి రాను మీకు ఏమైనా అవసరమైతే తెలిసిన మేడంకి ఫోన్ చేయండి అని చెప్పి కెఫ్ మేనేజర్ కి తాళాలు ఇస్తాడు నందు. ఎందుకు కేఫ్ కి వెళ్ళరు అంటుంది తులసి. కోర్టు గొడవలు తేలే వరకు వెళ్ళను అయినా నా గురించి ఎవరు ఎక్కువగా ఆలోచించకండి అంటూ బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నందు.
మరోవైపు చెప్పింది గుర్తుంది కదా లేదంటే మీ బండారం బయట పెడతాను అని పంతులు గారిని బెదిరించి రాజ్యలక్ష్మి దగ్గరికి తీసుకువస్తుంది దివ్య. పంతులుగారు దివ్య చెప్పినట్లు చేయటానికి భయపడిపోతాడు. ఇందులో పనిమనిషి వచ్చి రాజ్యలక్ష్మి వాళ్ళని టిఫిన్ చేయడానికి రమ్మంటుంది. రాజ్యలక్ష్మి పంతులు గారిని కూడా టిఫిన్ చేయడానికి రమ్మంటుంది.
ఆ తర్వాత అందరూ టేబుల్ మీద కూర్చుంటారు. విక్రమ్ కిందన కూర్చుంటాడు అంతలోనే అక్కడికి దివ్య వస్తుంది. భర్త కోసం అన్నీ త్యాగం చేస్తున్నావు.. వెళ్లి నీ భర్త పక్కనే కూర్చో టిఫిన్ చేయటం ప్రారంభిద్దాము అంటుంది బసవయ్య భార్య. పిరికి పంతులు మోసం చేశాడు అనుకుంటుంది దివ్య. అంతలోనే పూజారి వచ్చి ఇక మీకు కిందన కూర్చునే అవసరం లేదు.
ఈరోజుతో మీ అమ్మగారికి పట్టిన దోషమంతా పోయింది అంటాడు. ఒక్కసారిగా రాజ్యలక్ష్మి వాళ్ళు షాక్ అవుతారు. మతి పోయిందా పంతులుగారు 20 ఏళ్ల వరకు ఇలాగే చేయాలని చెప్పారు కదా అంటుంది రాజ్యలక్ష్మి. అప్పుడు గ్రహాలు అలా ఉన్నాయి కానీ ఇప్పుడు గ్రహాలు మారిపోయి ఉంటాయి అంటుంది దివ్య. దివ్య పంతులు గారిని మానిప్యులేట్ చేసినట్టు గ్రహిస్తుంది రాజ్యలక్ష్మి.
ఈ ఇంటికి గురువు లాంటి పంతులుగారు చెప్పారు కదా ఇంకెందుకు కిందన కూర్చోవడం అంటూ భర్తని తీసుకెళ్లి అత్తగారి పక్కన కూర్చోబెట్టి తను కూడా భర్త పక్కనే కూర్చుని భర్తకి టిఫిన్ తినిపిస్తుంది. మీరు కూడా తినిపించండి అత్తయ్య చాలా సంతోషిస్తారు అంటుంది. విక్రమ్ కూడా ఆనందంగా దివ్య కి టిఫిన్ తినిపిస్తాడు. అది చూసిన రాజ్యలక్ష్మి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
మరోవైపు మాధవి భర్త తులసికి ఫోన్ చేసి కేసు విషయంలో నాకేమీ పాలుపోవటం లేదు అందుకే నీకు ఫోన్ చేశాను అంటాడు. ఏం చేయడానికైనా ఆయన సహకరించాలి కదా పూర్తిగా ఓటమికి సిద్ధపడిపోయారు అంటుంది తులసి. ఇంతలో నందు రావటం గమనించి తర్వాత ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది తులసి. నందు తులసి దగ్గరికి వచ్చి దివ్యని చూడాలనిపిస్తుంది అక్కడికి వెళ్దాము అంటాడు.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బాగోదేమో అంటుంది తులసి. పర్వాలేదు మళ్లీ ఈ పరిస్థితులు ఎలా ఉంటాయో ఏంటో దివ్యని చూడగలనో లేదో అంటూ నిరాశగా మాట్లాడుతాడు. సరే వెళ్దాం అంటుంది తులసి. మరోవైపు దివ్యని.. అక్క అని పిలిచి ఇన్నాళ్లు ఈ ఇంట్లో భయాన్ని చూశాను ఈరోజు తలెత్తుకొని మాట్లాడే శివంగిని చూశాను ఇకనుంచి నేను కూడా ధైర్యంగా ఉంటాను అంటుంది ప్రియ.
వాళ్ళిద్దరూ అలా నవ్వుకుంటూ ఉంటే అక్కడికి వచ్చిన విక్రమ్ వాళ్ళ తాతయ్య చాలా ఆనందపడతాడు. విక్రమ్ తల్లి మాయలో పడిపోయాడు అని బాధపడతాడు. మీరేమీ బాధపడకండి తాతయ్య ఆయనకి అన్ని విషయాలు తెలిసేలాగా నేను చేస్తాను అత్తయ్యకి భయం అంటే ఏంటో చూపిస్తాను అంటుంది దివ్య. ఇప్పటికే నువ్వు తనకి భయాన్ని రుచి చూపించావు అని ఆనందపడతాడు విక్రమ్ వాళ్ళ తాతయ్య.
మరోవైపు దివ్య దగ్గరికి బయలుదేరుతారు నందు, తులసి. గుమ్మంలోనే లాస్య ఎదురవుతుంది. చిలక గోరింక ఎక్కడికో బయలుదేరినట్లు ఉన్నారు అడిగేవాళ్లు లేక అడ్డు ఆపు లేదు అంటూ అసహ్యంగా మాట్లాడుతుంది. తప్పుగా మాట్లాడితే చంపేస్తాను అంటాడు నందు. కొట్టకపోయినా కొట్టావు అని కేసు పెట్టాను ఇప్పటికీ బయటకు రాలేక దించుకుంటున్నావు.
మళ్లీ చంపేస్తాను అంటున్నావు అంటూ నందుని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంది లాస్య. ఆయనని రెచ్చగొట్టొద్దు అంటుంది తులసి. భుజం మీద చేయి వేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతాను ఏం చేస్తావు అంటూ భర్తని తీసిపారేసినట్లుగా మాట్లాడుతుంది లాస్య. తరువాయి భాగంలో తులసి వాళ్ళు దిగి ఇంటికి వస్తారు. గుమ్మంలోనే ఉన్న అత్తమామల్ని చూసి పలకరిస్తాడు విక్రమ్. అత్తయ్య గారి పర్మిషన్ తీసుకుని అమ్మానాన్న వాళ్ళని రమ్మన్నాను అంటుంది దివ్య. వాళ్ళ అమ్మ నాన్న రావడానికి పర్మిషన్ ఎందుకు అంటూ కోప్పడతాడు విక్రమ్. విక్రమ్ కోపాన్ని చూసి షాక్ అవుతుంది రాజ్యలక్ష్మి.