MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Christmas Movies: క్రిస్మస్‌ కానుకగా విడుదలయ్యే సినిమాలివే.. కుర్రాళ్లతో శివాజీ ఫైట్‌.. ఒకే రోజు ఏడు సినిమాలు

Christmas Movies: క్రిస్మస్‌ కానుకగా విడుదలయ్యే సినిమాలివే.. కుర్రాళ్లతో శివాజీ ఫైట్‌.. ఒకే రోజు ఏడు సినిమాలు

Christmas Movies: క్రిస్మస్‌ కానుకగా ఈ సారి భారీగా సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. మరో సంక్రాంతిని తలపిస్తుంది. అయితే ఈ సారి కుర్రహీరోలతో శివాజీ పోటీ పడుతుండటం విశేషం. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Dec 23 2025, 05:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
క్రిస్మస్‌ కానుకగా విడుదలయ్యే సినిమాలు
Image Credit : Asianet News

క్రిస్మస్‌ కానుకగా విడుదలయ్యే సినిమాలు

సాధారణంగా సంక్రాంతికి ఎక్కువగా సినిమాలు విడుదలవుతుంటాయి. మళ్లీ ఉగాది, దసరా, దీపావళి పండగులకు కూడా బాగానే రిలీజెస్‌ ఉంటాయి. చిన్నా, పెద్ద సినిమాలు పోటీ పడుతుంటాయి. అయితే ఇప్పుడు క్రిస్మస్‌ కూడా మరో సంక్రాంతిని తలపిస్తోంది. ఈ క్రిస్మస్‌కి ఏకంగా ఏడు సినిమాలు విడుదల కాబోతుండటం విశేషం. అయితే ఇందులో కుర్రాళ్లతో శివాజీ పోటీపడుతున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
శివాజీ దండోరాపై మంచి అంచనాలు
Image Credit : Asianet News

శివాజీ దండోరాపై మంచి అంచనాలు

ఈ క్రిస్మస్‌ కానుకగా విడుదల కాబోతున్న సినిమాల్లో శివాజీ ప్రధాన పాత్రలో నటించిన `దండోరా` మూవీ ఉంది. ఇది విలేజ్‌ డ్రామా నేపథ్యంలో రూపొందింది. సామాజిక అంశాలను చర్చించేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. శివాజీ, నవదీప్‌, నందు, బిందు మాధవి, రవికృష్ణ, మౌనికా రెడ్డి, రాధ్య‌, అదితి భావ‌రాజు వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని నిర్మించారు. మురళీ కాంత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కాబోతుంది. ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్‌, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. సినిమాపై కూడా అంచనాలున్నాయి. ఈ క్రమంలో తాజాగా మహిళలకు సంబంధించిన శివాజీ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. అవి ఈ చిత్రానికి ప్రమోషనల్‌గా ఉపయోగపడుతున్నాయని చెప్పొచ్చు. 

38
శంబాలతో ఆది సాయికుమార్‌ బౌన్స్ బ్యాక్‌ అవుతాడా?
Image Credit : Asianet News

శంబాలతో ఆది సాయికుమార్‌ బౌన్స్ బ్యాక్‌ అవుతాడా?

దీంతోపాటు ఆది సాయికుమార్‌ నటించిన `శంబాల` మూవీ ఈ నెల 25న విడుదల కాబోతుంది. షైనింగ్‌ పిక్చర్స్ పతాకంపై రాజశేఖర్‌ అన్నభిమోజు, మహీధర్‌ రెడ్డి నిర్మించారు. సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి యుగంధర్‌ ముని దర్శకత్వం వహించారు. ఇందులో అర్చన అయ్యర్‌, స్వసిక, రవి వర్మ, మధునందన్‌, శివ కార్తీక్‌ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌ విశేషంగా ఆకట్టుకుంది. ప్రభాస్‌, నాని వంటి వారు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో ఈ చిత్రంపై మంచి బజ్‌ ఉంది. ఆది సాయికుమార్‌ బౌన్స్ బ్యాక్‌ అయ్యే మూవీ అవుతుందని చెప్పొచ్చు.

48
ఛాంపియన్‌గా వస్తోన్న శ్రీకాంత్ కొడుకు
Image Credit : Asianet News

ఛాంపియన్‌గా వస్తోన్న శ్రీకాంత్ కొడుకు

ఇదే రోజు శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటించిన `ఛాంపియన్‌` మూవీ విడుదల కానుంది. స్వప్న సినిమాస్‌ నుంచి జీ స్టూడియోస్‌ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ తో కలిసి ఈ సినిమాని నిర్మిస్తుంది. ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. రోషన్‌ సరసన అనస్వర రాజన్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంపై కూడా మంచి బజ్‌ ఉంది. మరి ఆడియెన్స్ ని ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.

58
హర్రర్‌ థ్రిల్లర్‌గా ఈషా మూవీ
Image Credit : Asianet News

హర్రర్‌ థ్రిల్లర్‌గా ఈషా మూవీ

ఈ నెల 25న విడుదల కాబోతున్న మరో మూవీ `ఈషా`. హర్రర్‌ థ్రిల్లర్‌గా దీన్ని రూపొందించారు. ఇందులో `రాజు వెడ్స్ రాంబాయి` ఫేమ్‌ అఖిల్‌ రాజు, త్రిగుణ్‌, హేబా పటేల్‌, సిరి హనుమంతు ప్రధాన పాత్రలు పోషించారు. హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్ పతాకంపై కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీవాసు వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాసు విడుదల చేస్తున్నారు. టీజర్‌, ట్రైలర్స్ ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలున్నాయి.

68
పతంగ్‌ ఎగురుతుందా?
Image Credit : Asianet News

పతంగ్‌ ఎగురుతుందా?

ఇక క్రిస్మస్‌ కానుకగా విడుదల కాబోతున్న మరో మూవీ `పతంగ్‌`. ప్రీతి పగడాల, ప్రణవ్‌ కౌశిక్‌, వంశీ పూజిత్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రణీత్‌ ప్రత్తిపాటి రూపొందించిన ఈ మూవీలో సింగర్‌ ఎస్పీ చరణ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. డి సురేష్‌ బాబు సమర్పణలో విజయ్‌ శేఖర్‌ అన్నే, సంపత్‌ మక, సురేష్‌ కొత్తింటి, నాని బండ్రెడ్డి కలిసి నిర్మించారు. ఈ చిత్రం కూడా ఈ నెల 25నే విడుదల కానుంది. ఈ మూవీకి పెద్దగా బజ్‌ లేకపోవడం గమనార్హం. కాకపోతే కంటెంట్‌ ఓరియెంటెడ్‌ మూవీగా దీన్ని చెప్పొచ్చు. మరి ఈ పోటీలో ఎంత వరకు నిలబడుతుందో చూడాలి.

78
తెలుగులోకి వస్తోన్న మోహన్‌ లాల్‌ `వృషభ`
Image Credit : Asianet News

తెలుగులోకి వస్తోన్న మోహన్‌ లాల్‌ `వృషభ`

ఈ నెల 25న విడుదల కాబోతున్న సినిమాల్లో మలయాళ మూవీ `వృషభ` కూడా ఉంది. మోహన్‌ లాల్‌ నటించిన చిత్రమిది. ఆయనతోపాటు సమర్జీత్ లంకేష్, నయన్ సారిక కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు నందకిశోర్‌ రూపొందించిన ఈ మూవీని కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మించారు. ఈ మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్‌ చేస్తోంది.

88
తెలుగు మూవీస్‌తో పోటీపడుతున్న సుదీప్‌
Image Credit : Asianet News

తెలుగు మూవీస్‌తో పోటీపడుతున్న సుదీప్‌

వీటితోపాటు కన్నడ మూవీ `మార్క్` కూడా తెలుగు రిలీజ్‌ అవుతుంది. ఇందులో సుదీప్‌ హీరోగా నటిస్తున్నారు. విజయ్‌ కార్తికేయా దర్శకత్వం వహించారు. యాక్షన్‌ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ గురువారం క్రిస్మస్‌ కానుకగా విడుదల కాబోతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Related Stories
Recommended image1
Sivaji: సామాన్లు కనపడేలా బట్టలు వేసుకోకండి... అమ్మాయిల దుస్తులపై శివాజీ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved